ఉత్తమ జాతీయ రెండో ఆస్పత్రిగా అవార్డు స్వీకరణ
హిందూపురం అర్బన్ : హిందూపురం ప్రభుత్వాస్పత్రికి కేంద్ర కాయకల్ప బృందం జాతీయ ఉత్తమ రెండో ఆస్పత్రిగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో బుధవారం ఢిల్లీలోని మేడి హర్డింగ్ మెడికల్ కాలేజ్ స్వర్ణజయంతి ఆడిటోరియంలో కేంద్రమంత్రి జేపీ నడ్డా చేతుల మీదుగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు అవార్డు అందుకున్నారు. 2016–17కి విజయనగరం ఆస్పత్రికి మొదటిస్థానం, హిందూపురం ఆస్పత్రికి రెండో ఉత్తమ స్థానం లభించింది. అవార్డు రావడంపై ఆస్పత్రి కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి, వైద్యులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.