టీఎన్ఏ అధ్యక్షుడిగా కృపాకర్‌రెడ్డి
ఎల్బీ స్టేడియం న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపధ్యంలో రాష్ట్ర నెట్‌బాల్ సంఘం (ఏపీఎన్ఏ) కార్యవర్గం సమావేశం ఇక్కడి ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్లో ఆదివారం జరిగింది. ఏపీఎన్ఏ అధ్యక్షుడు తీగల కృపాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల కొత్త కార్యవర్గం ఎన్నికలు జరిపారు. ఈ ఎన్నికలకు రాష్ట్ర ఒలింపిక్ సంఘం కోశాధికారి బి.కె.హరనాథ్, ఎన్నికల అధికారిగా బి.కైలాష్ యాదవ్‌లు పాల్గొన్నారు. తెలంగాణ నెట్‌బాల్ సంఘం (టీఎన్ఏ)అధ్యక్షుడుగా తీగల కృపాకర్‌రెడ్డి(రంగారెడ్డి), ప్రధాన కార్యదర్శిగా ఎస్.సోమేశ్వర్రావు(రంగారెడ్డి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్షులుగా టి.సురేశ్ కుమార్(మహబూబ్‌నగర్), పి.వి.రమణ (ఖమ్మం), ఎం.రఘువీర్ సింగ్ (నల్లగొండ), జి.వేణుగోపాల్ (కరీంనగర్), సంయుక్త కార్యదర్శులుగా ఎం.సమ్మయ్య (ఆదిలాబాద్), జి.వెంకటేశ్వర్రావు (నిజామాబాద్), కె.శ్రీనివాస్ (ఆదిలాబాద్), సి.హెచ్.సూర్యరావు (వరంగల్), కోశాధికారిగా వై.నందు కుమార్ (హైదరాబాద్)లు ఎన్నికయారు. కార్యవర్గ సభ్యులుగా కె.కృష్ణమూర్తి (ఖమ్మం) టి.సురేశ్ (వరంగల్), ఎం.విఘ్నేశ్వర్ (హైదరాబాద్), ఎ.రమేశ్ (నిజామాబాద్), సుహేల్ రెహ్మన్ (మహబూబ్‌నగర్), కె.సురేశ్ (నల్లగొండ) నియమితులయ్యారు.