nominations filing
-
సార్వత్రిక ఎన్నికలు.. తొలిరోజు ప్రముఖుల నామినేషన్లు
Upadates తెలంగాణలో మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి భాజపా తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ నామినేషన్ వేశారు. నల్గొండ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి స్థానానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందజేశారు. సంగారెడ్డి జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ మొదటి సెట్ నామినేషన్ సురేష్ షెట్కార్ తరపున నామినేషన్ వేసిన కాంగ్రెస్ నాయకులు ఈ నెల 24న సురేష్ షెట్కార్ నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ: డీకే అరుణ నామినేషన్ దాఖలు భారతీయ జనతా పార్టీ తరఫున నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన డీకే అరుణ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మహారాష్ట్ర నామినేషన్ సమర్పించిన సుప్రియా సూలే ఎన్సీపీ (శరద చంద్ర పవార్) పార్టీ సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే నామినేషన్ దాఖలు చేశారు బారామతి స్థానంలో పోటీలో ఉన్నారు Maharashtra: NCP-SCP sitting MP and candidate from Baramati, Supriya Sule files her nomination papers. Sunetra Pawar, wife of Maharashtra Deputy CM Ajit Pawar has been fielded by NCP against NCP-SCP MP Supriya Sule from Baramati. pic.twitter.com/8uS99KwDTk — ANI (@ANI) April 18, 2024 తెలంగాణ నల్లగొండ లోక్ సభ స్థానంలో తొలి నామినేషన్ దాఖలు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసిన మాజీ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరపున తొలి సెట్టు నామినేషన్ సమర్పించిన పార్టీ నేతలు తెలంగాణ కాసేపట్లో ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ నేడు తెలంగాణ బీజేపీ అభ్యర్థులు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు నామినేషన్ వేయనున్నారు నాలుగో విడత లోక్ సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ ఏపీ, తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడతలో ఎన్నికలు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే 13న పోలింగ్ నాలుగో విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశి్చమబెంగాల్, బిహార్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి తెలంగాణలోని 17, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. The Gazette notification has been issued for the 4th phase of general elections. Polling will take place for 96 Lok Sabha seats across 10 states Andhra Pradesh, Bihar, Jharkhand, Madhya Pradesh, Maharashtra, Odisha, Telangana, Uttar Pradesh, West Bengal, and Jammu & Kashmir.… pic.twitter.com/xyjCS0xesf — ANI (@ANI) April 18, 2024 సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధం అయ్యింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ జరుగనుంది. గురువారం ఉదయం నాలుగో విడత ఎన్నికల ప్రక్రియకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఈ విడతకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ 96 లోక్‌సభ స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యే అభ్యర్థులకు ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు దాఖలు చేసుకొనేందుకు అవకాశం కలి్పంచారు. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26 న జరుగనుంది. అనంతరం ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. కాగా నాలుగో విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలోని 17, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, ఒడిషాలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగో విడతలో పోలింగ్ జరుగనుంది. -
తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన ఘట్టం
-
తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోన్న నామినేషన్లు స్వీకరణ
-
చేతల నేత సీఎం జగన్
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సామాజిక న్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ అభ్యర్థులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు గురువారం అసెంబ్లీ కమిటీ హాలులో నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు ఇన్ని అవకాశాలు ఇవ్వలేదు? సీఎం జగన్ సామాజిక సాధికారతను చేతల్లో చూపుతున్నారు. మూడున్నరేళ్లలో సామాజిక విప్లవం తీసుకొచ్చారు. గతంలో ఈ వర్గాలకు మేలు చేయాలన్న కనీస ఆలోచన కూడా చేయని చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా 18 స్థానాల్లో 11 మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, నలుగురు ఓసీలను ఎంపిక చేసి, ఆయా వర్గాల పట్ల తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు’ అని కొనియాడారు. వివరాలు వారి మాటల్లోనే.. సొంత సామాజికవర్గం బాగు కోసమే బాబు కృషి చంద్రబాబు నమ్మక ద్రోహి. కుల అహంకారి. 1999 నుంచి రాజకీయాల్లో ఉన్న నేను ఆయన నైజాన్ని చూశా. నా దగ్గర ఉన్న డబ్బు చూసి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చంద్రబాబు చెప్పారు. నాతోనే మిగిలిన నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టించారు. 2014లో నేను గెలిచే సీటు అని తెలిసినా, నన్ను పోటీ చేయకుండా ఆపేశాడు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు.. ఇద్దరూ కలిసి నన్ను మోసం చేశారు. డబ్బు వున్న వారికే టీడీపీ టికెట్లు ఇస్తుంది. సొంత సామాజిక వర్గం బాగు కోసమే చంద్రబాబు పని చేశారు. బెంజ్ కారులో తిరిగిన నన్ను డొక్కు కారులో తిరిగేలా చేశారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ అనే దేవుడి రూపంలో నాకు న్యాయం జరిగింది. – జయమంగళ వెంకటరమణ (బీసీ, ఏలూరు జిల్లా) నిశ్శబ్ద విప్లవానికి శ్రీకారం రాజకీయ సాధికారత అంటే పదవుల్లో మాత్రమే కాదు.. అధికారంలో కూడా పాలు పంచుకునేలా భాగస్వాములను చేయడమే అని సీఎం జగన్ నిరూపించారు. బలహీన వర్గాలకు మేలు చేయలన్నా బలమైన ఆలోచన ఉంటేనే ఇది సాధ్యం. సీఎం జగన్ ఒక నిశ్శబ్ద విప్లవానికి శ్రీకారం చుట్టారు. – పెన్మత్స వీవీ సూర్యనారాయణ రాజు (ఓసీ, విజయనగరం జిల్లా) చంద్రబాబు కుల అహంకారి 2014–19 మధ్య టీడీపీ శాసనమండలికి 48 మందిని పంపగలిగితే, అందులో ఓసీలు 30 మంది కాగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 18 మంది మాత్రమే. టీడీపీ వంచనకు ఇంతకన్నా వేరే నిదర్శనం అక్కర్లేదు. సీఎం వైఎస్ జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 68.18 శాతం కేటాయించడం ఆయన చిత్తశుద్ధిని నిరూపిస్తోంది. చంద్రబాబు పెద్ద కుల అహంకారి. సీఎం జగన్ నాకు దేవుడిచ్చిన అన్నయ్య.– పోతుల సునీత (బీసీ, చీరాల, బాపట్ల జిల్లా) బీసీ అంటే బ్యాక్ బోన్.. బీసీలంటే కేవలం బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్‌బోన్ క్లాస్ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ గుర్తించి ఆ వర్గాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవులు, స్పీకర్‌గా బీసీ, మండలి చైర్మన్‌గా ఎస్సీ, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళకు అవకాశం ఇచ్చారు. పదవులన్నిటిలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రా«ధాన్యమిచ్చారు. సీఎం జగన్ ఎప్పటికీ నా గుండెల్లో ఉంటారు. – కోలా గురువులు (బీసీ, విశాఖ సౌత్) సామాజిక న్యాయానికి అసలైన నిర్వచనం కులాలను చీల్చే విధంగా కాకుండా స్ఫూర్తిదాయక విధానాలతో సామాజిక న్యాయానికి అసలైన నిర్వచనం చెప్పారు సీఎం జగన్. గతంలో టీడీపీ అన్ని విధాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను వంచించింది. చెప్పిందొకటి. చేసింది మరొకటి. ఊపిరి ఉన్నంత వరకు సీఎం జగన్‌తో ఉంటాను. – బొమ్మి ఇజ్రాయేల్ (ఎస్సీ, (మాదిగ), అంబేడ్కర్ కోనసీమ జిల్లా) ఎందుకు మోసం చేశావని బాబును నిలదీయాలి మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్నందున బాబు, ఎల్లో మీడియా.. రోజు వారీ తోలు బొమ్మలను తెచ్చి ప్రదర్శనలు ఇస్తూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చూస్తున్నారు. వారి మొహం మీద చరిచినట్లుగా అన్ని పదవుల్లోనూ, అధికారంలోనూ ఇంతగా అట్టడుగు వర్గాలకు వైఎస్సార్సీపీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తించాలని బీసీలను కోరుతున్నాం. ఎందుకు మోసం చేశావని చంద్రబాబును నిలదీయాలని కోరుతున్నాం. – చంద్రగిరి ఏసురత్నం (బీసీ. వెస్ట్ గుంటూరు) గొప్ప మానవతా మూర్తి నమ్మకానికి, ఇచ్చినమాట నిలబెట్టుకునేదానికి సీఎం జగన్ ప్రతిరూపం. ఒకసారి మాట ఇస్తే ఎన్ని అడ్డంకులు ఎదురైనా నెరవేర్చే తత్వం. ఇచ్చిన మాట మేరకు నాకు మేలు చేశారు. సీఎం జగన్ ఏమి చెబితే అది చేయటమే నా కర్తవ్యం. రాజకీయాల్లో గొప్ప మానవతా విలువలు వంట పట్టించుకున్న మానవతా మూర్తి సీఎం జగన్. రాజకీయాల్లో సోషల్ ఇంజినీరింగ్ అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే. – మర్రి రాజశేఖర్ (ఓసీ, చిలకలూరిపేట) -
సోనియా ఆశీస్సులతో.. కాంగ్రెస్ అధ్యక్ష బరిలోకి ఖర్గే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పోరు చివరి క్షణంలో అనూహ్యమైన మలుపు తిరిగింది. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్థానంలోకి సోనియా గాంధీ కుటుంబానికి విధేయుడు, దక్షిణాది దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గే వచ్చిచేరారు. సోనియా ఆశీస్సులతో ఆయన అధ్యక్ష బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఖర్గేతోపాటు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్, జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి అందజేశారు. రకరకాల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ పోటీలో చివరకు ముగ్గురు మిగిలారు. అభ్యర్థిగా మల్లికార్గున ఖర్గే పేరును అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, ప్రమోద్ తివారీ, పీఎల్ పూనియా, ఏకే ఆంటోనీ, పవన్‌కుమార్ బన్సల్, ముకుల్ వాస్నిక్‌తోపాటు జి–23 గ్రూప్‌లోని ఆనంద్ శర్మ, మనీశ్ తివారీ ప్రతిపాదించారు. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఖర్గే వెంట పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు కనిపించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఆయన విజయం ఖాయమేనని స్పష్టమవుతోంది. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు శశి థరూర్ రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. నామినేషన్ల కార్యక్రమానికి సోనియా గాంధీ కుటుంబ సభ్యులెవరూ హాజరు కాలేదు. వాస్తవానికి ఈ ఎన్నికలో పోటీ చేయడానికి దిగ్విజయ్ సింగ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నామినేషన్ పత్రాలను సైతం పార్టీ కార్యాలయం నుంచి తీసుకున్నారు. నామినేషన్ దాఖలు చేయబోతున్నానని గురువారం ప్రకటించారు. ఇంతలోనే పార్టీ అధిష్టానం వ్యూహం మార్చేసింది. దళిత నాయకుడికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో దిగ్విజయ్ వెనక్కి తగ్గారు. తాను పోటీ చేయడం లేదని విస్పష్టంగా ప్రకటించారు. నామినేషన్లకు గడువు శుక్రవారం ముగిసింది. అక్టోబర్ 17న జరుగనున్న ఎన్నికలో ఓటు వేయడానికి 9,100 మందికిపైగా ప్రతినిధులను అర్హులుగా గు ర్తించారు. అక్టోబర్ 19న ఫలితాలను ప్రకటిస్తారు. ఖర్గేకు సీనియర్ల మద్దతు: గెహ్లాట్ అధ్యక్ష ఎన్నికలో ఖర్గేకు మద్దతు ఇవ్వాలని పార్టీ సీనియర్లంతా కలిసి నిర్ణయించారని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు. తన మద్దతు ఖర్గేకే ఉంటుందని తెలిపారు. పోటీలో ఎవరు నిలిచినప్పటికీ ఎన్నిక పూర్తయ్యాక అసలు విజేత కాంగ్రెస్సేనని అన్నారు. పార్టీలో మార్పు కోసమే నా పోరాటం: ఖర్గే కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పు కోసం తాను పోరాడుతానని, నేతలు, కార్యకర్తలంతా మద్దతివ్వాలని ఖర్గే విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష ఎన్నికలో తనకు ఓటు వేసి గెలిపించాలని పార్టీ డెలిగేట్లను కోరారు. ఈ ఎన్నికలో పోటీ చేయడానికి తనను ప్రోత్సహించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బాల్యం నుంచే కాంగ్రెస్‌తో తనకు అనుబంధం ఉందని, పార్టీ ఆదర్శాలను కాపాడుకోవడానికి మరింత ఉధృతంగా పోరాడుతానని అన్నారు. కాంగ్రెస్‌లో అత్యంత అనుభవజ్ఞుడైన నాయకుడు మల్లికార్గున ఖర్గే అని సీనియర్ నేత ప్రమోద్ తివారీ కొనియాడారు. మార్పు కావాలనుకుంటే నాకు ఓటేయండి: థరూర్ కాంగ్రెస్‌కు ఖర్గే ‘భీష్మ పితామహుడు’ అని శశి థరూర్ ప్రశంసించారు. భారత్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్షుడిని ఎన్నుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్‌కు సేవలందించడం గర్వకారణంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఖర్గే, తాను ప్రత్యర్థులం, శత్రువులం కాదని.. తమ మధ్య స్నేహపూర్వక పోటీ జరగబోతోందని చెప్పారు. ఖర్గే పట్ల తనకు గౌరవం ఉందన్నారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి తనకు ఒక విజన్ ఉందని ఉద్ఘాటించారు. ఖర్గే ‘యథాతథ స్థితి కొనసాగింపు నాయకుడేనని’ అన్నారు. పార్టీలో యథాతథ స్థితి కొనసాగాలనుకుంటే ఖర్గేకు, మార్పు కావాలనుకుంటే తనకు ఓటు వేయాలని థరూర్ పిలుపునిచ్చారు. నామినేషన్‌ను ఉపసంహరించుకోబోనని తేల్చిచెప్పారు. 12 రాష్ట్రాల నాయకులు, కార్యకర్తలు తనకు మద్దతుగా సంతకాలు చేశారన్నారు. పార్టీని బలోపేతం చేసి, దేశాన్ని ముందుకు తీసుకెళ్తామన్న అశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలో సోనియా గాంధీ కుటుంబం ప్రత్యక్షం గానీ, పరోక్షంగా గానీ ఎవరికీ మద్దతు ఇవ్వబోదని అన్నారు. గాంధీ కుటుంబానికి వీరవిధేయుడు బెంగళూరు: సోలిల్లాదా సర్దార(ఓటమి తెలియని నాయకుడు)గా స్వరాష్ట్రం కర్ణాటకలో పేరుగాంచిన మల్లికార్జున ఖర్గే(80) కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలో విజయం సాధిస్తే కర్ణాటక నుంచి ఎస్.నిజలింగప్ప తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడైన రెండో నేతగా రికార్డుకెక్కుతారు. అలాగే బాబూ జగ్జీవన్ రామ్ తర్వాత పార్టీ అధ్యక్షుడైన రెండో దళిత నాయకుడిగా మరో రికార్డు సృష్టిస్తారు. గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన ఖర్గే 50 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కార్మిక నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించారు. 1969లో కాంగ్రెస్‌లో చేరారు. తొలుత గుల్బర్గా సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. కర్ణాటకలోని గుర్మిత్కల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 9 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో మొదటిసారిగా గుల్బర్గా నుంచి లోక్‌సభకు పోటీ చేసి, విజయం సాధించారు. 2014లో నరేంద్ర మోదీ ప్రభంజనంలోనూ భారీ మెజార్టీతో గెలిచారు. 2014 నుంచి 2019 దాకా లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరించారు. 2019లో తొలిసారిగా ఓటమి చవిచూశారు. 2020 జూన్‌లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఎగువసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ, రైల్వే, సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రిగా సేవలందించారు. ఖర్గేకు కర్ణాటక సీఎం అయ్యే అవకాశం పలుమార్లు వచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆయన 1942 జూలై 21న బీదర్ జిల్లాలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. బీఏ, న్యాయ శాస్త్రం అభ్యసించారు. 1968 మే 13న రాధాబాయిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమారుడు ప్రియాంక్ ఖర్గే ప్రస్తుతం కర్ణాటక ఎమ్మెల్యే. గతంలో మంత్రిగా పనిచేశారు. -
Telangana MLC Elections: నామినేషన్లు ముగిశాయ్.. క్యాంపులు షురూ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో 12 శాసనమండలి స్థానాలకు నామినేషన్ల స్వీకరణ గడువు మంగళవారం ముగిసింది. చివరి రోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున 12 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్ మినహా పూర్వపు తొమ్మిది జిల్లాల పరిధిలోని 12 స్థానాలకు ఈ నెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా బుధవారం నామినేషన్ల పరిశీలన, 26 వరకు ఉపసంహరణ తర్వాత బరిలో మిగిలే అభ్యర్థుల జాబితాపై స్పష్టత రానుంది. ఈ కోటా కింద ఓటు హక్కు కలిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో టీఆర్ఎస్కు చెందినవారే అధికంగా ఉన్నారు. అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్‌తో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు అత్యధికంగా కరీంనగర్ నుంచి 27 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ సమర్పించారు. టీఆర్ఎస్ నామినేషన్లు ఇలా..: మెదక్ అభ్యర్థిగా డాక్టర్ యాదవరెడ్డి రెండో సెట్ నామినేషన్ పత్రా లు దాఖలు చేయగా, నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత నామినేషన్ సమర్పించారు. పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూచుకుల్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, నల్లగొండ స్థానం నుంచి ఎంసీ కోటిరెడ్డి కోటిరెడ్డి, ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధు, ఆదిలాబాద్ స్థానం నుంచి దండె విఠల్ నామినేషన్ వేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు పట్నం మహేందర్‌రెడ్డి, సుంకరి రాజు రెండో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాలకు ఎల్.రమణ, తానిపర్తి భానుప్రసాద్ నామినేషన్లు వేశారు. రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీరాజ్ చాంబర్స్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు శైలజారెడ్డి, ఎంపీపీల ఫోరం అధ్యక్షురాలు నిర్మలాశ్రీశైలంగౌడ్ సహా మరో 10 మంది ఎంపీపీలు, జెడ్పీటీసీలు నామినేషన్లు వేసేందుకు వచ్చారు. అధికార పార్టీకి చెం దిన నాయకులు వీరిని అడ్డు కుని నామినేషన్ పత్రాలను చించివేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గందరగోళంలోనే, శేరిలింగంపల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చలిక చంద్రశేఖర్ చాకచక్యంగా లోపలికెళ్లి స్వత్రంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేశారు. మంత్రులకు బాధ్యతలు: సంఖ్యా పరంగా ఎక్కు వ మం ది ఓటర్లను కలిగి ఉన్న టీఆర్ఎస్ వీలైనన్ని స్థానాలను ఏకగ్రీవంగా గెలుపొందేలా వ్యూహరచ న చేస్తోంది. పార్టీ ఓటర్లు చేజారకుండా ఉండేందుకు ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేవరకు క్యాంపులకు తరలించాలని నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులకు ఓటర్ల మద్దతు కూడగట్టడం, క్యాంపుల నిర్వహణ, అసంతృప్తుల బుజ్జగింపు, స్వతంత్రులకు నచ్చచెప్పి పోటీ నుంచి వైదొలిగేలా చూడటం వంటి బా«ధ్యతలు అప్పగించారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఓటర్లను మంగళవారం సాయంత్రానికే హైదరాబాద్ సమీపంలోని ఓ రిసార్టుకు తరలించినట్లు సమాచారం. -
మండలి ఎన్నికలకు వేళాయె
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 14 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కోటా కింద మూడు ఎమ్మెల్సీ స్థానాలకు, స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 16న నోటిఫికేషన్ జారీచేసి అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎమ్మెల్యే కోటా నుంచి మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి, శాసనమండలి ఉప కార్యదర్శి పి.వి.సుబ్బారెడ్డి నోటిఫికేషన్ జారీచేశారు. శాసనమండలి సభ్యులు మొహమ్మద్ అహ్మద్ షరీఫ్, దేవసాని చిన్నగోవిందరెడ్డి, సోము వీర్రాజుల పదవీకాలం ఈ ఏడాది మే నెల 31వ తేదీతో ముగిసింది. ఈ ఖాళీలను భర్తీచేసేందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 వరకు అసెంబ్లీ భవనంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రభుత్వ సెలవు రోజులు మినహా మిగతా రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ నెల 17న నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 22 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అవసరమైతే ఈ నెల 29న అసెంబ్లీ భవనంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కిస్తారు. 8 జిల్లాల్లో ఎన్నికల కోడ్ రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాలకు గతంలో ఎన్నికైనవారి పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికలకు ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ జారీచేస్తారు. అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో స్థానిక సంస్థల నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకు, అనంతపురం, తూర్పుగోదావరి, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో స్థానిక సంస్థల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి డిసెంబర్ 10వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలు జరిగే స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీస్థానాల్లో కోవిడ్–19 వ్యాప్తి నివారణకు తగిన చర్యలతో ఎన్నికలు నిర్వహించేందుకు సీనియర్ అధికారులను పంపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు 11 మంది పదవీకాలం ఆగస్టు 11తో పూర్తి ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు గతంలో ఎన్నికైనవారి పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీతో ముగిసింది. కృష్ణా స్థానిక నియోజకవర్గాల నుంచి బుద్ధా వెంకటేశ్వరరావు, వై.రాజేంద్రప్రసాద్, గుంటూరు స్థానిక నియోజకవర్గాల నుంచి ఎ.సతీష్‌ప్రభాకర్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విశాఖపట్నం స్థానిక నియోజకవర్గాల నుంచి బి.నాగజగదీశ్వరరావు, పి.చలపతిరావుల పదవీకాలం పూర్తయింది. అనంతపురం స్థానిక నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్, తూర్పుగోదావరి స్థానిక నియోజకవర్గం నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం, విజయనగరం స్థానిక నియోజకవర్గం నుంచి డి.జగదీశ్వరరావు, చిత్తూరు స్థానిక నియోజకవర్గం నుంచి జి.సరస్వతి, ప్రకాశం స్థానిక నియోజకవర్గం నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డిల పదవీకాలం ముగిసింది. (మాగుంట శ్రీనివాసులురెడ్డి స్థానం 14–3–2019 నుంచి, పయ్యావుల కేశవ్ స్థానం 04–06–2019 నుంచి, ఎ.సతీష్ ప్రభాకర్ స్థానం 10–7–2019 నుంచి ఖాళీ అయ్యాయి. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనందున అప్పట్లో ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు.) ఎలక్టొరల్ రిజిస్ట్రేషన్ అధికారుల నియామకం రాష్ట్రంలో 13 జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎలక్టొరల్ రిజిస్ట్రేషన్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పశ్చిమగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు–అభివృద్ధి)ను, మిగిలిన అన్ని జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా–రెవెన్యూ)లను ఎలక్టొరల్ రిజిస్ట్రేషన్ అధికారులుగా నియమించారు. కొత్త పథకాలు, ప్రాజెక్టులు ప్రకటించరాదు, శంకుస్థాపనలు చేయరాదు రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో స్థానిక సంస్థల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఆయా జిల్లాల్లో మంగళవారం నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. ఈ జిల్లాల్లో ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ప్రింట్ మీడియాలో ఎటువంటి ప్రభుత్వ ప్రకటనలు జారీచేయరాదని ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రకటనలు జారీచేసి ఉంటే అవి ప్రచురితం, ప్రసారం కాకుండా నిలుపుదల చేయడంతోపాటు ఉపసంహరించుకోవాలని సమాచారశాఖ కమిషనర్‌కు సూచించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆర్థికపరమైన గ్రాంటుతో కూడిన ఎటువంటి కొత్త ప్రాజెక్టులను, పథకాలను ప్రభుత్వం ప్రకటించరాదని తెలిపారు. ఎటువంటి హామీలు ఇవ్వకూడదని, శంకుస్థాపనలు చేయరాదని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు జరిగే డిసెంబర్ 14వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు. అప్పటివరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లను ప్రభావితం చేసే ప్రకటనలను ప్రభుత్వం చేయరాదని ఆయన పేర్కొన్నారు. -
పురపోరుకు నామినేషన్ల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: పురపోరుకు నామినేషన్లు వెల్లువెత్తాయి. పత్రాల సమర్పణకు చివరి రోజైన శుక్రవారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపాలిటీల్లోని నామినేషన్ దాఖలు చేసే కార్యాలయాల్లో పలు పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు, వారి కుటుంబసభ్యులు, అనుయాయుల సందడి కనిపించింది. శుక్రవారం రాత్రి 7.45 గంటల వరకు అందిన సమాచారం మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు కలిపి మొత్తం 21,850 నామినేషన్లు (ఆన్లైన్లో అందిన 574 నామినేషన్లు) అందినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) వెల్లడించింది. శనివారం పూర్తి వివరాలు అందాక మొత్తం నామినేషన్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రకటిస్తామని ఎస్ఈసీ వర్గాలు తెలిపాయి. ఆన్లైన్లో దాఖలు చేసిన అభ్యర్థులు స్వయంగా రిటర్నింగ్ ఆఫీసర్లకు దరఖాస్తు కాపీలను సమర్పించాల్సి ఉన్నందున మొత్తంగా నామినేషన్లను సరిచూశాక దాఖలైన పత్రాల సంఖ్యపై శనివారం స్పష్టత రానుంది. బుధవారం నుంచి నామినేషన్ల దాఖలు మొదలు కాగా మూడు రోజులు కలిపి మొత్తం 21,850 నామినేషన్లను ప్రధాన పార్టీలు, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు సమర్పించారు. వీటిలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని 15 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అత్యధికంగా 2,392 నామినేషన్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మున్సిపాలిటీలో అత్యల్పంగా 134 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికలు జరగనున్న 9 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 325 డివిజన్లకు 120 మున్సిపాలిటీల పరిధిలోని 2,727 వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన మొదలుపెట్టి, అది పూర్తికాగానే చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై 12న సాయంత్రం 5 గంటల దాకా జిల్లా ఎన్నికల అధికారి లేదా అదనపు జిల్లా ఎన్నికల అధికారి/ డిప్యూటీ ఎన్నికల అధికారి లేదా జిల్లా ఎన్నికల అధికారి నియమించిన అధికారి వద్ద అప్పీల్ చేసుకోవచ్చు. 13న సాయంత్రం 5 గంటల లోగా ఈ అప్పీళ్లను పరిష్కరిస్తారు. 14న మధ్యాహ్నం 3 గంటల దాకా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీచేసే అభ్యర్థుల తుది జాబితాలు ›ప్రచురిస్తారు. 22న పోలింగ్, రీపోలింగ్ ఏవైనా ఉంటే 24న నిర్వహిస్తారు. 25న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి, అది పూర్తి కాగానే ఫలితాలు ప్రకటిస్తారు. ఇదిలా ఉండగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా సంగారెడ్డి ఎమ్మె ల్యే జగ్గారెడ్డికి శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ బీ ఫారాలను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అందజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసకృష్ణన్‌ల సమక్షంలో సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన బీ ఫారాలను జగ్గారెడ్డి చేతికి అందజేశారు. -
‘తొలి’ సమరానికి సై
మెదక్ రూరల్: పరిషత్ ఎన్నికల్లో భాగంగా తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఆది వారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో హవేళిఘణాపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం 339 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి విడతలో 6 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 18 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 65 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 190 మంది బరిలో నిలిచారు. పెద్దశంకరంపేట మండలం జూకల్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి మానస ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు బీఫాం లను ఇచ్చిన అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించగా, ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నవారికి బ్యాట్, కత్తెర గుర్తులను కేటాయించారు. ఆదివారం నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు తర్వాత 6 జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 16 నామినేషన్లు, 65 ఎంపీటీసీ స్థానాలకు గాను 158 నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియలో మొత్తం 65 ఎంపీటీసీ స్థానాలకు 433 నామినేషన్లు, 6 జెడ్పీటీసీ స్థానాలకు 41 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 25న జరిగిన స్క్రూటినీలో పెద్దశంకరంపేట మండలం జూకల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి శైలజ ఐకేపీలో పనిచేస్తున్నందున నామినేషన్‌ను తిరస్కరించారు. రెండేసి చొప్పున వచ్చిన నామినేషన్లను తొలగించగా మొత్తం 341 మంది అభ్యర్థులు 354 నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 6 జెడ్పీటీసీ స్థానాలకు గాను 41 నామినేషన్లు వేయగా అందులో రెండేసి చొప్పున ఉన్న నామినేషన్లను తొలగించగా, మొత్తం 31 మంది అభ్యర్థులకు గాను 34 నామినేషన్లను పరిగణలోకి తీసుకున్నారు. బరిలో మిగిలిన అభ్యర్థులు సోమవారం నుంచి ప్రచారం నిర్వహించనున్నారు. ముగిసిన రెండో విడత నామినేషన్ల పర్వం రెండో విడత నామినేషన్ల ప్రక్రియకు ఆదివారంతో తెరపడింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని నర్సాపూర్, చిలప్‌చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వెల్దుర్తి మండలాలకు సంబంధించి ఈనెల 26 నుంచి 28 వరకు నామినేషన్లు స్వీకరించారు. ఇందులో భాగంగా మొత్తం 6 జెడ్పీటీసీ స్థానాలకు గాను 53 మంది అభ్యర్థులు 66 నామినేషన్లు వేశారు. 60 ఎంపీటీసీ స్థానాలకు 405 మంది అభ్యర్థులు 454 నామినేషన్లను దాఖలు చేశారు. ఆదివారం చివరి రోజు 60 ఎంపీటీసీ స్థానాలకు 276 మంది అభ్యర్థులు 318 నామినేషన్లను వేయగా, 6 జెడ్పీటీసీ స్థానాలకు 44 మంది అభ్యర్థులు 57 నామినేషన్లను దాఖలు చేశారు. ప్రతి మండల కేంద్రంలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు నామపత్రాలను స్వీకరించారు. రెండో విడత నామినేషన్ల వివరాలు ఇలా నర్సాపూర్‌లో 10 ఎంపీటీసీ స్థానాలకు 78 నామినేషన్లు, చిలప్‌చెడ్‌లో 6 ఎంపీటీసీ స్థానాలకు 41నామినేషన్లు, కౌడిపల్లిలో 10 ఎంపీటీసీ స్థానాలకు 66, కొల్చారంలో 10 ఎంపీటీసీ స్థానాలకు 75 నామినేషన్లు, వెల్దుర్తిలో 12 ఎంపీటీసీ స్థానాలకు 83 నామినేషన్లు, శివ్వంపేటలో 12 ఎంపీటీసీ స్థానాలకు 111 నామినేషన్ల చొప్పున మొత్తం 60 ఎంపీటీసీ స్థానాలకు 454 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆరు జెడ్పీటీసీ స్థానాలకు నర్సాపూర్‌లో 11, చిలప్‌చెడ్‌లో 10, కౌడిపల్లి 09, కొల్చారం 12, వెల్దుర్తిలో 15, శివ్వంపేటలో 09 చొప్పున మొత్తం 66 నామినేషన్లు దాఖలయ్యాయి. -
బరిలో 201 మంది
ఆత్మకూరు(పరకాల): జిల్లాలో దుగ్గొండి, నర్సంపేట, పర్వతగిరి, సంగెం, వర్ధన్నపేట మండలాల్లో ఆదివారం ఉపసంహరణ గడువు ముగిసింది. 5 జెడ్పీటీసీ స్థానాలకు 32 మంది, 62 ఎంపీటీసీ స్థానాలకు గాను 4 స్థానాలు ఏకగ్రీవం కాగా 169 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 201 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సంగెం మండలంలోని కుంటపల్లిలో ఎంపీటీసీ కందకట్ల కళావతి(టీఆర్ఎస్, దుగ్గొండి మండలం మల్లంపల్లి ఎంపీటీసీ సభ్యుడిగా పల్లాటి జైపాల్‌రెడ్డి(టీఆర్ఎస్), వర్దన్నపేట మండలంలో నల్లబెల్లి ఎంపీటీసీ దుగ్యాల జ్యోతి(టీఆర్ఎస్), దమ్మన్నపేట ఎంపీటీసీ చొప్పరి సోమలక్ష్మి (టీఆర్ఎస్) ఏకగ్రీవమైంది. 58 ఎంపీటీసీ స్థానాలకు గాను 169 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా నల్లబెల్లి జెడ్పీటీసీ స్థానానికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి పెద్ది స్వప్న ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ముగిసిన రెండో విడత నామినేషన్లు 6 జెడ్పీటీసీ స్థానాలకు 68, 63 ఎంపీటీసీ స్థానాలకు 531 నామినేషన్లు ఆత్మకూరు(పరకాల): జిల్లాలో పరిషత్ ఎన్నికలకు రెండో విడత నామినేషన్లు ఆదివారం ముగిసాయి. జిల్లాలోని ఖానాపురం, నల్లబెల్లి, పరకాల, నడికూడ, శాయంపేట, రాయపర్తి మండలాలకు సంబంధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించారు. 6 జెడ్పీటీసీ స్థానాలకు 68 నామినేషన్లు, 63 ఎంపీటీసీ స్థానాలకు 531 నామినేషన్లు దాఖలయ్యాయి. ఖానాపురం జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ (3), టీఆర్ఎస్(5), టీడీపీ(1), సీపీఐ(1) మొత్తం 10 నామినేషన్లు దాఖలయ్యాయి. నల్లబెల్లి స్థానానికి కాంగ్రెస్(5), బీజేపీ(3), టీఆర్ఎస్(5), టీడీపీ(2), ఇతర పార్టీ(1), ఇండిపెండెంట్లు(3) మొత్తం 19 నామినేషన్లు దాఖలయ్యాయి. పరకాలలో బీజేపీ(1), కాంగ్రెస్ (4), టీఆర్ఎస్(1) మొత్తం 6 నామినేషన్లు దాఖలయ్యాయి. నడికుడలో కాంగ్రెస్(4), బీజేపీ(1), టీఆర్ఎస్ (2), టీడీపీ(1) మొత్తం 8 నామినేషన్లు దాఖలయ్యాయి. శాయంపేట జెడ్పీటీసీ స్థానానికి బీజేపీ(1), కాంగ్రెస్(3), టీఆర్ఎస్(4), ఇండిపెండెంట్(4) మొత్తం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. రాయపర్తి జెడ్పీటీసీ స్థానానికి బీజేపీ(1), కాంగ్రెస్(5), టీఆర్ఎస్(4), టీడీపీ(1), ఇండిపెండెంట్(2) మొత్తం 13 నామినేషన్లు దాఖలయ్యాయి.. ఎంపీటీసీ స్థానాల్లో... జిల్లాలో 6 మండలాలలో 63ఎంపీటీసీ స్థానాలకు 531 నామినేషన్లు దాఖలయ్యాయి. ఖానాపూర్ మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలకు సీపీఐ(3), కాంగ్రెస్ (31) టీఆర్ఎస్(38), టీడీపీ(1), ఇండిపెండెంట్(9) మొత్తం 82 నామినేషన్లు దాఖలయ్యాయి. నల్లబెల్లి మండలంలో 11ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ(3), కాంగ్రెస్(25), టీఆర్ఎస్(49), టీడీపీ(1), ఇతరపార్టీలు(5)ఇండిపెండెంట్(9) మొత్తం 92 నామినేషన్లు దాఖలయ్యాయి.పరకాల మండలంలో 5ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ(1), కాంగ్రెస్(19),టీఆర్ఎస్(12), టీడీపీ(1), ఇతరపార్టీలు(2), ఇండిపెండెంట్(8) మొత్తం 43 నామినేషన్లు దాఖలయ్యాయి. నడికుడ మండలంలో 10ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ(2), కాంగ్రెస్(20), టీఆర్ఎస్(18),టీడీపీ(2), ఇండిపెండెంట్(9) మొత్తం 51 నామినేషన్లు దాఖలయ్యాయి. శాయంపేట మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ(7)కాంగ్రెస్(22), టీఆర్ఎస్(91), ఇండిపెండెంట్(24), ఇతర పార్టీ(10) మొత్తం 154 నామినేషన్లు దాఖలయ్యాయి. రాయపర్తి మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు గాను బీజేపీ(5), కాంగ్రెస్(40), టీఆర్ఎస్(51), ఇండిపెండెంట్(13) మొత్తం 109 నామినేషన్లు దాఖలయ్యాయి. -
నామినేషన్ల జోరు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల దాఖలు చివరిరోజు జోరందుకున్నాయి. ఆదివారం రెండో విడత నామినేషన్ల ఘట్టం ముగిసింది. రెండో విడతలో 7 జెడ్పీటీసీ, 91 ఎంపీటీసీ స్థానాలకు గాను జెడ్పీటీసీలకు 53, ఎంపీటీసీ స్థానాలకు 538 నామినేషన్లు వచ్చాయి. తొలి రెండు రోజులు నామినేషన్లు అంతగా వేయలేదు. చివరిరోజు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పోటీపడ్డారు. ఏ నామినేషన్ కేంద్రం చూసినా ఆయా పార్టీల అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడాయి. మూడు రోజులు ఇలా.. మొదటి రోజు శుక్రవారం నామినేషన్లు పెద్దగా దాఖలు కాలేదు. జెడ్పీటీసీ స్థానాలకు తొలి రోజు 13, ఎంపీటీసీలకు 176 నామినేషన్లు వేశారు. రెండోరోజు శనివారం జెడ్పీటీసీలకు 6, ఎంపీటీసీలకు 66, నామినేషన్లు వచ్చాయి. మూడో రోజు జెడ్పీటీసీలకు 34, ఎంపీటీసీలకు 296 నామినేషన్లు దాఖలు చేశారు. కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం ఎన్నికల పోటీ ఖర్చు తడిసి మోపెడయ్యే అవకాశాలు ఉండడంతో అభ్యర్థులు పోటీలో ఉండకుండా ప్రత్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు. నామినేషన్ల పర్వం ప్రారంభానికి ముందే తమ ప్రత్యేర్థులెవరో తెలుసుకుని ముందుకుపోయారు. వారి వద్దకు వెళ్లి పోటీ నుంచి తప్పుకోవాలని వేడుకుంటున్నారు. ఇవి పార్టీ పరంగా జరిగే ఎన్నికలు కావడంతో పోటీదారులను బుజ్జగించడం రాజకీయ పార్టీల నాయకులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఒక ఎంపీటీసీ స్థానం నుంచి ఒకే పార్టీకి చెందిన నలుగురైదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఆయా పార్టీ నేతలు వారిని సుముదాయించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు çఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. మే 2 వరకు గడువు రెండో విడత నామినేషన్ల దాఖలుకు ఆదివారంతో తెర పడింది. ఇక 29వ తేదీన వచ్చిన నామినేషన్లను పరిశీలిస్తారు. 30న తిరస్కరణ, మే 2వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ చేపడుతారు. అదేరోజు బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. 10వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు 795 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. మంగళవారం నామినేషన్ల పరిశీలన నిర్వహించగా, భువనగిరి నియోజకవర్గం మినహా మిగిలిన 16 స్థానాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయం ప్రకటించింది. 16 లోక్‌సభ స్థానాల్లో 612 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, అందులో 130 మంది అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. మిగిలిన 482 మంది అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఆమోదించారు. భువనగిరి స్థానంలో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించగా, సదరు అభ్యర్థులు పునఃపరిశీలన కోసం అప్పీల్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకుడు ఈ ముగ్గురు అభ్యర్థుల అప్పీళ్లను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని మంగళవారం రాత్రి సీఈఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 28న నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. రాష్ట్రంలో ఏప్రిల్ 11న లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, మే 23న ఫలితాలు వెల్లడవుతాయి. -
నామినేషన్ల జాతర
సాక్షి, నల్లగొండ,సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శుక్రవారం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి, రెండు రోజుల్లో ఒకే నామినేషన్ దాఖలు కాగా... మూడో రోజు అనూహ్యంగా మొత్తం 32 నామినేషన్లు పడ్డాయి. నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాలకు ఒక్కొక్కటి చొప్పున, 12 అసెంబ్లీ స్థానాలకు 30 నామినేషన్లను ఆయా పార్టీల అభ్యర్థులు వేశారు. భువనగిరి లోక్‌సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నల్లగొండ లోక్‌సభ స్థానానికి సీపీఎం అభ్యర్థిగా అనంతరామశర్మ నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల దాఖలుకు 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటల దాకా గడువుంది. పార్టీల వారీగా అభ్యర్థిత్వాలు తేలితే నామినేషన్ల సంఖ్య అంతకంత పెరిగే అవకాశం ఉంది. అసెంబ్లీకి... జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి 7, వైఎస్సార్సీపీ నుంచి 6, టీడీపీ నుంచి 4, టీఆర్ఎస్ నుంచి 3, సీపీఐ, ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) నుంచి 2 చొప్పున, సీపీఎం, బీజేపీ ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు దాఖలు చేశాయి. మరో నలుగురు స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. ముగ్గురు అభ్యర్థులు రెండు సెట్ల చొప్పున నామినేషన్లు సమర్పించారు. నామినేషన్లు వేసిన ప్రముఖులు... నల్లగొండ అసెంబ్లీ స్థానానికి మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నాగార్జునసాగర్ స్థానానికి మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి తరఫున ఆయన అనుచరులు నామినేషన్ వేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ బిల్యానాయక్ దేవరకొండ నుంచి నామినేషన్ వేయగా, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్ హుజూర్నగర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉమా మాధవరెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్ తరఫున వారి అనుచరులు నామినేషన్లు సమర్పించారు.