28న కాంగ్రెస్ ఆక్రోశ్ దివస్: ఉత్తమ్
• పెద్ద నోట్ల రద్దుపై ఆందోళనకు టీపీసీసీ నిర్ణయం
• ప్రజల ఇబ్బందిపై కేసీఆర్ ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుపై కేంద్ర అనాలోచిత, ఏకపక్ష నిర్ణయాన్ని నిరసిస్తూ 28న ‘ఆక్రోశ్ దివస్’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణరుుంచింది. ఏఐసీసీ పిలుపు మేరకు చేపట్టే ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం గాంధీ భవన్లో కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అను బంధ సంఘాల అధ్య క్షుల సమావేశం జరి గింది. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధానమంత్రి చేసిన అనాలోచిత చర్యవల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు.
పేదలు అన్ని పనులు వదులుకుని బ్యాంకుల వద్ద రోజుల తరబడి వేచి చూసే దుస్థితి ఏర్పడిందన్నారు. నల్లడబ్బును నిరోధించే విషయంలో కాంగ్రెస్ మద్దతిస్తుందని, అరుుతే గతంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. నోట్ల మార్పిడి కోసం క్యూలో నిలబడే క్రమంలో ఒత్తిడి కారణంగా సామా న్యులు చనిపోయే దుస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడు తుంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తొలుత నోట్ల రద్దుపై అసహనం వ్యక్తం చేసిన కేసీఆర్ ఆ తరువాత వైఖరి మార్చుకుని నోట్ల మార్పిడి మంచి దేనంటూ చెప్పడం వెనుక ఆంతర్యమేమిటో చెప్పాలన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం కోసం కేసీఆర్ రూ.40 కోట్లతో విలాసవంతమైన ఇల్లు కట్టుకోవడమంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని విమర్శించారు.