వ్యాను ఢీకొని పుష్కర భక్తురాలు మృతి
ధవళేశ్వరం (తూర్పుగోదావరి) : పుష్కర స్నానం చేసి రోడ్డు దాటుతున్న ఓ వృద్ధురాలు వ్యాను ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ప్రాంతానికి చెందిన గ్రంథి మాణిక్యాంబ(60) గురువారం మధ్యాహ్నం రెండుగంటల సమయంలో పుష్కర స్నానం చేసి అన్నదాన సత్రం వైపు వెళ్లేందుకు రోడ్డు దాడుతుండగా వేగంగా వచ్చిన వ్యాను ఢీకొంది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు డ్రైవర్ను, వ్యానును అదుపులోకి తీసుకున్నారు.