parliamentary bypolls
-
కిన్నౌర్‌లో ఓటేసిన కురువృద్ధుడు
సిమ్లా: స్వతంత్ర భారతావనిలో తొలి ఓటర్ 104 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగి హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి పార్లమెంటరీ స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌లో మరోసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కిన్నౌర్ జిల్లా కల్పా పోలింగ్ స్టేషన్లో ఓటేసేందుకు చక్రాల కుర్చీలో వచ్చిన నేగికి రెడ్‌కార్పెట్ పరిచి, కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ అపూర్వ్ దేవ్గన్ మేళతాళాలతో స్వాగతం పలికారు. దేశాభివృద్ధికి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా నేగి కోరారు. మొట్టమొదటిసారిగా ఆయన 1951లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1917లో జన్మించిన ఆయన స్కూల్ టీచర్‌గా పనిచేశారు. స్వాతంత్య్రం సిద్ధించాక దేశంలో 1952 ఫిబ్రవరిలో మొదటిసారిగా సాధారణ ఎన్నికలు జరిగాయి. అయితే, హిమాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాల్లో శీతాకాలంలో ఎన్నికల ప్రక్రియ కష్టమని భావిస్తూ అధికారులు ఐదు నెలలు ముందుగానే అక్టోబర్ 1951లోనే ఎన్నికలు జరిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న నేగి కల్పా ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఉదయం 7 గంటలకు ఓటు వేసిన మొట్టమొదటి వ్యక్తి అయ్యారు. అప్పటి నుంచి ఆయన అన్ని ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. -
బెంగళూరు రూరల్, మాండ్య స్థానాలు కాంగ్రెస్ సొంతం
కర్ణాటకలోని బెంగళూరు రూరల్, మాండ్య లోక్‌సభ నియోజక వర్గాలు అధికార కాంగ్రెస్ పార్టీ సొంతమైనాయి. బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి డి.కే. సురేశ్ సమీప ప్రత్యర్థి, మాజీ కర్ణాటక సీఎం కుమారస్వామి భార్య అనిత కుమార స్వామిపై లక్షా 37 వేల ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. అలాగే మాండ్యలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, కన్నడ సినీ నటీ రమ్య తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ (ఎస్) అభ్యర్థి సీఎస్ పుట్టరాజుపై 67 వేల ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. కాగా గతంలో బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి కుమార స్వామి, మాండ్యా నుంచి చెలువరాయస్వామి గెలుపొందారు. అయితే ఈ ఏడాది మేలో ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వారిరువురు సభ్యులుగా ఎన్నికయ్యారు. దాంతో వారు అయా పార్లమెంట్ స్థానాలకు రాజీనామా చేశారు. దాంతో ఆ రెండు నియోజకవర్గాలకు ఎన్నికల సంఘం బుధవారం ఎన్నికలు నిర్వహించాయి. ఉప ఎన్నికల్లో పోలైన ఓట్లను శనివారం ఇక్కడ లెక్కించారు. అనంతరం ఉన్నతాధికారులు ఫలితాలను ఇక్కడ వెల్లడించారు. కాగా ఆ రెండు నియోజక వర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని తాము మందే ఊహించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య శనివారం వెల్లడించారు. ఆ ఉప ఎన్నికల్ల ఓడింది జేడీ ఎస్ మాత్రమే కాదని బీజేపీ, కేజీపీలు కూడా అని సిద్దరామయ్య ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.