గోకులపాడు ఘటనలో మరో వ్యక్తి మృతి
విశాఖపట్నం : గోకులపాడు బాణసంచా పేలుడు ఘటన కేసులో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. బాణాసంచా పేలుడుతో గాయపడ్డ పసిరెడ్డి కృష్ణ సెవన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. మృతుడు కోట ఉరట్ల మండలం పందూరు వాసిగా గుర్తించారు.
కాగా విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గోకులపాడులోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం సాయంత్రం పేలుడు సంభవించిన ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.