అంతర్జాతీయ కరాటే పోటీలకు జనగామ విద్యార్థులు
జనగామ :పాండిచ్చేరి రాష్ట్రంలో ఈనెల 26 నుంచి 30 వరకు జే ఎస్.కలామణి–గ్రాం డ్ మాస్టర్ టకేషి మ సూయమ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న అం తర్జాతీయ రైషూన్కాన్ షిటో రియో కరాటే చాంపియన్ షిప్ పోటీలకు జనగామ విద్యార్థులు ఎంపికయ్యారు. గతనెల 31న జాతీయ స్థాయిలో ఏడేళ్ల నుంచి యాభై యేళ్ల వరకు జరిగిన కాన్షిటో రియో కరాటే పోటీల్లో మేకల తరుణ్, ఎండీ మైపోజ్, సాత్విక్, రొడ్డ విశాల్ పాల్గొని బంగారు పథకం సాధించారు. దీంతో వారు అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించినట్లు రైషూన్కాన్ షిటోరియో తెలంగాణ చీఫ్ జి.ధన్రాజ్, గ్కాండ్ మాస్టర్ ఎం.సలీంపాషా తెలిపారు.