pregnent women
-
మానవత్వం చాటుకున్న హోంగార్డు..
-
దారుణం: బస్సు కింద పడి గర్భిణి మృతి
సాక్షి, హిమాయత్‌నగర్ (హైదరాబాద్): బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న దంపతుల్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో దంపతులిద్దరూ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరగా...భార్య ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బుధవారం హిమాయత్‌నగర్ వై జంక్షన్ వద్ద జరిగిన ఈ ప్రమాదం ఘటన వివరాలిలా ఉన్నాయి. ముషీరాబాద్ కుమ్మరిబస్తీకి చెందిన సతీశ్‌గౌడ్, భార్య షాలిని దంపతులు కాగా, షాలిని రెండు నెలల గర్భిణి. ఉదయం భార్యాభర్తలిద్దరూ హైదర్‌గూడ ఫెర్నాండెజ్ ఆస్పత్రికి రెగ్యులర్ చెకప్ కోసం వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేస్తుండగా ...అదే సమయంలో ముషీరాబాద్ డిపోకు చెందిన ఏపీ28జెడ్0017 నంబర్ గల బస్సు కోఠి నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుంది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన బస్సు హిమాయత్‌నగర్ వై జంక్షన్ వద్ద వేగంగా వస్తూ కుడివైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దంపతులను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అదుపుతప్పి కిందపడ్డారు. బసు వెనుక భాగం చక్రాల్లో పడిపోయిన షాలినికి కాలి తొడ భాగం, ఛాతీ భాగాలు నుజ్జు అయ్యాయి. వెంటనే అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మల్లేశ్ ఓ అంబులెన్స్ సాయంతో హైదర్‌గూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా..ఐసీయూలో చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా బస్సు నడిపిన మహబూబ్‌నగ్ జిల్లా ఫరీద్పూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ కమలన్నని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మ ఏదని అడిగితే ఏం చెప్పాలి? షాలిని, సతీశ్‌లకు రెండేళ్ల కుమార్తె ఉంది. ప్రమాదం విషయంపై షాలిని భర్త సతీశ్‌ని ‘సాక్షి’ఫోన్ ద్వారా సంప్రదించగా.. ‘నా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. షాలిని లేకుండా ఇంటికి వెళ్తే నా రెండేళ్ల బంగారం(కూతురు) అమ్మ ఏది అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి?’అంటూ రోదిస్తున్నాడు. చదవండి: (సహజీవనం చేస్తూ ‘రిచ్’గా బిల్డప్.. పక్కాగా చీటింగ్) -
నంద్యాలలో దారుణం.. నిండు గర్భిణీ హత్య
సాక్షి, కర్నూలు: నంద్యాలలో నిండు గర్భిణీ దారుణ హత్యకు గురయింది. లక్ష్మి అనే వివాహితను మరో మహిళ కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన నంద్యాల లోని వైఎస్సార్ నగర్లో చోటుచేసుకుంది. అయితే లక్ష్మీ తండ్రి వెంకట రాముడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం తెలుసుకొని లక్ష్మీ, ఆమె తల్లి భారతి ఆ మహిళతో వాగ్వివాదం జరిగింది. గర్భిణీ లక్ష్మీపై క్షణికావేశంలో ఓ మహిళ హత్య చేసింది. కాగా ఒక్కసారిగా 8 నెలల నిండు గర్భిణీ లక్ష్మి పై కత్తితో దాడికి పాల్పడడంతో అక్కడికక్కడే లక్ష్మీ మృతి చెందింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. -
కోవిడ్ రాయని మరణ శాసనం
తల్లి, ఇద్దరు బిడ్డలు... మూడు ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. ఈ మరణాలను నిర్ణయించింది కోవిడ్ కాదు, వైద్యులు. గర్భిణిని హాస్పిటల్లో చేర్చుకోలేదెవ్వరూ. ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా ఐదు హాస్పిటళ్ల మెట్లెక్కింది. ఆమె కడుపులో పెరుగుతున్న ఇద్దరు బిడ్డలు భూమ్మీదకొస్తామని తల్లిని తొందర పెడుతున్నారప్పటికే. ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్న ఈ ఘోరానికి బలైపోయిన ప్రాణం పేరు సుధా సైనీ. ఇంత పెద్ద శిక్షా! సుధాసైనీ ఒక పేదింటి మహిళ. భర్త కమలేశ్ కురిపిస్తున్న ప్రేమ సంపన్నత తప్ప, సమాజంలో బతకగలిగిన సంపన్నత లేదు. కమలేశ్ భార్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. సుధకు ఏడు నెలలే నిండాయి. అయినా సరే... పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమె నెలనెలా చూపించుకుంటున్న ప్రభుత్వ హాస్పిటల్‌కి వెళ్లింది. నర్సులు... ‘తొమ్మిది నెలలు నిండిన తర్వాత రండి’ అని పంపించేశారు. ‘నొప్పులు భరించలేకపోతున్నాను, హాస్పిటల్లో చేర్చుకోండి’ అని వేడుకున్నా కనికరించలేదు. డెహ్రాడూన్‌లోని డూన్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, కోరోనేషన్ హాస్పిటల్‌తోపాటు మరో రెండు ప్రైవేట్ హాస్పిటళ్లకు కూడా వెళ్లింది. అందరూ వెనక్కి పంపేశారు. సుధ నొప్పులతోనే ఇంటికి వెళ్లిపోయింది. ఈ నెల తొమ్మిదో తేదీన ఇంట్లోనే ప్రసవం అయింది. బిడ్డలిద్దరూ కొంతసేపటికే ప్రాణాలు వదిలేశారు. మరో మూడు రోజులకు తల్లి ప్రాణం కూడా బిడ్డలను వెతుక్కుంటూ వెళ్లిపోయింది. శుక్రవారం భార్య అంతిమ సంస్కారాలు పూర్తి చేశాడు కమలేశ్. బిడ్డల అంతిమ సంస్కారం చేసిన రోజు నుంచే తిండి మానేశాడతడు. ఇప్పుడు భార్యను కూడా కాటికి అప్పగించేసి జీవచ్ఛవంలా ఉన్నాడు. ‘‘భూమ్మీదకు రావడానికి నా బిడ్డలు తెలియక తొందరపడ్డారు, డాక్టర్లు వైద్యం చేయకుండా నా బిడ్డలకు ఇంత పెద్దశిక్ష వేస్తారా? బిడ్డలను భూమాత కడుపులో దాచి వచ్చిన తర్వాత సుధ నాతో ‘మన దగ్గర బాగా డబ్బు ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు కదా. మన బిడ్డలు బతికేవాళ్లు’ అని కన్నీళ్లు పెట్టుకుంది. సుధ మాట నిజమే కదా’’ అని కూడా అంటున్నాడు కమలేశ్. నిజంగా కరోనా వచ్చిందా! సుధా సైనీని అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించిన డాక్టర్ల అనుమానం ఒక్కటే ‘ఆమె కరోనా పేషెంట్ కావచ్చు’ అని. ఆమె ప్రాణం పోయిందని తెలిసి ఇప్పుడు నాలుక్కరుచుకుంటున్నారు. తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ‘ఆమె ఇప్పటి వరకు చూపించుకున్న హాస్పిటల్ ఎందుకు చేర్చుకోలేదు’ అనే తెలివైన ప్రశ్న సంధించారు. స్థానిక ఎమ్మెల్యే హర్భజన్ కపూర్ జోక్యంతో దర్యాప్తు మొదలైంది. జిల్లా ప్రధాన వైద్యాధికారి చెప్తున్న కారణం మరీ విచిత్రంగా ఉంది. ‘హాస్పిటల్‌కు వచ్చేటప్పటికే ఆమె పరిస్థితి క్లిష్టంగా ఉందిట’ అని సెలవిచ్చారు. మరి... హాస్పిటల్‌కు వైద్యసహాయం అవసరమైనప్పుడు కాకుండా, హాయిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు హాలిడే వెకేషన్‌కు వచ్చినట్లు వస్తారా? వైద్యుల్లో సున్నితత్వం కనుమరుగైందని సుధా సైనీ మరణమే చెబుతోంది. ఇంగితం కూడా హరించుకుపోయిందా? ‘చనిపోయిన పేషెంట్ స్వాబ్ శాంపిల్స్ తీసుకున్నాం, కరోనా పరీక్ష నిర్వహిస్తాం’ అని చెప్తున్నారు. పరీక్షించి ఏం చెబుతారు? ఏం చెప్పినా ఒరిగేదేముంటుంది? సుధ, ఆమె బిడ్డలు తిరిగి రారు. వైద్యులు ఒక విషయాన్ని మాత్రం నిర్ధారించగలిగేది ఈ మరణాన్ని కరోనా మరణం కింద నమోదు చేసుకోవాలా, ఇతర మరణం కింద నమోదు చేసుకోవాలా అనేది మాత్రమే. ‘డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా సంభవించిన మరణం’ అనే కాలమ్ మన అడ్మినిస్ట్రేషన్ చార్టుల్లో ఎక్కడా లేదు కాబట్టి... ప్రభుత్వ లెక్కల ప్రకారం సు«ధది సహజ మరణమే. ఇంకా చెప్పాలంటే... ‘వైద్యసదుపాయాలెన్ని కల్పించినప్పటికీ హాస్పిటళ్లకు వెళ్లకుండా ఇంట్లోనే పురుడు పోసుకోవడం వల్ల సంభవించిన మరణం ఇది’ అని భాష్యం చెప్పడానికి కూడా ఎవరికీ గొంతుకు ఏమీ అడ్డుపడకపోవచ్చు. -
అమ్మా.. అనే పిలుపుకు నోచుకోకుండానే..
సాక్షి, కరీంనగర్ : అమ్మా.. అనే పిలుపు కోసం పురిటినొప్పులను పంటిబిగువున భరిస్తుంది తల్లి. బిడ్డలకు జన్మనివ్వడం అంటే మృత్యువును ముద్దాడి రావడమే..! పిల్లలకు జన్మనిచ్చి అమ్మా అని పిలిపించుకున్నప్పుడే జన్మ సార్థకమైందని మహిళలు భావిస్తారు. పెళ్లయిన పదమూడేళ్లకు గర్భం దాలిస్తే.. అమ్మా అనే పిలుపు కోసం ఆమె పడే ఆరాటం అంతా ఇంతా కాదు. కానీ ఆ మహిళను ఎనిమిది నెలలకే విధి చిన్నచూపు చూసింది. పిల్లలకు జన్మనివ్వకుండానే.. అమ్మా అని పిలిపించుకోకుండానే గుండెపోటు రూపంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన హుజూరాబాద్‌లో గురువారం విషాదం నింపింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. (ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఇంట్లో మద్యం పట్టివేత ) సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన జూపాక స్వరూప(35)కు చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన కనుకయ్యతో 13 ఏళ్ల కిత్ర వివాహం జరిగింది. సంతానం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగి రూ.లక్షలు ఖర్చు చేసుకున్నారు. చివరగా హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోగా స్వరూప గర్భం దాల్చింది. దీంతో తల్లి కావాలనే కోరిక నెరవేరబోతోందని స్వరూప ఎంతో సంబరపడింది. పదమూడేళ్లకు సంతానం కలుగబోతోందని ఆమె కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషపడ్డారు. గర్భం దాల్చినప్పటి నుంచి స్వరూపను ఆమె భర్త కనుకయ్య, కుటుంబ సభ్యులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. (మళ్లీ గ్యాంగ్‘వార్’) ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్న స్వరూపకు గురువారం ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హుజూరాబాద్‌లోని ప్రభుత్వా ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ థియేటర్‌కు తరలిస్తున్న క్రమంలోనే మహిళ మృత్యువాతపడింది. కాగా, ‘స్వరూపకు కవల పిల్లలు జన్మిస్తారని వైద్యులు చెప్పారు.. కనీసం పిల్లలనైనా బతికించేలా చూడండి సారూ..’ అంటూ మృతురాలి భర్త వైద్యులను వేడుకోవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ‘పెళ్లయిన పదమూడేళ్లకు మా బిడ్డకు సంతానం కలుగుతుందని ఎంతో ఆశపడ్డాం. దేవుడు మాకు అన్యాయం చేశాడు..’ అంటూ స్వరూప కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు పలువురిని కలిచివేసింది. (అమెరికాలో ‘రవి’ కిరణం ) -
కర్ణాటక నుంచి నడిచివస్తున్న మహిళకు సాయం
చంకన బిడ్డ.. కడుపున నలుసు.. పొట్టకూటి కోసం పొరుగు ప్రాంతం వెళ్లిందా మహిళ.. అంతలోనే కరోనా మహమ్మారి కసిరింది ఉన్న ప్రాంతం వదిలి సొంతూరికి బయల్దేరింది.. బండ్లు తిరగలేదు.. బస్సులు కదలలేదు నెత్తిన భగభగ మండే ఎండ నిప్పుల కొలిమిలా కాలుతున్న నేల భుజాన బిడ్డను ఎత్తుకొని ఆకలి ఎరుగక.. కాలినడకన వడివడిగా అడుగులు వేస్తూ.. స్వగ్రామానికి పయనమైంది దారిపొడవునా కష్టాలే.. ఆ అమ్మను చూసి ‘అయ్యో..’ అనడమే అందరి వంతైది.. అష్టకష్టాలతో అనంత చేరుకోగా.. అధికారి పద్మావతమ్మ సాయంగా నిలిచారుపోలీసుల సాయంతో సొంతూరికి సాగనంపేందుకు ఏర్పాట్లు చేసింది. సాక్షి, మర్రిపూడి: ఉపాధి కోసం పొరుగు రాష్ట్రం కర్ణాటకకు వలస వెళ్లిన ఓ కుటుంబం లాక్డౌన్ నేపథ్యంలో పనుల్లేక స్వగ్రామానికి కాలినడకన బయలుదేరింది. ఆ కుటుంబంలోని మహిళ నిండు గర్భిణి కావడంతో ఆపసోపాలు పడుతూ సుమారు 150 కిలోమీటర్లు నడిచి ఆంధ్రాలో ప్రవేశించిన తర్వాత.. అనంతపురం జిల్లా అధికారులు ఆ కుటుంబానికి అండగా నిలిచి.. స్వగ్రామానికి తరలించారు. రాష్ట్ర అధికారుల ఔదార్యానికి ఆ కుటుంబం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని చిమట దళితవాడకు చెందిన కొమ్ము కృపానందం, సలోమి దంపతులకు ముగ్గురు సంతానం. ప్రస్తుతం సలోమి 8 నెలల గర్భిణి. చిమట గ్రామంలో కూలీ పనులు దొరక్క.. బేల్దారీ మేస్త్రీ వద్ద పనులు చేయడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్ణాటకలోని బళ్లారి వద్ద గల చెలికేరికి వెళ్లారు. తమతో పాటు మూడేళ్ల చిన్న కుమారుడిని తీసుకెళ్లారు. లాక్డౌన్ విధించాక బేల్దారీ మేస్త్రీ డబ్బులు ఇవ్వలేదు. దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. మరో ముగ్గురుతో కలసి కృపానందం దంపతులు ఈ నెల ఒకటిన కాలినడకన స్వగ్రామానికి బయలుదేరారు. రెండ్రోజుల అనంతరం వారు అనంతపురం జిల్లాలో ప్రవేశించారు. చేతిలో చిల్లిగవ్వలేదు. తెచ్చుకున్న తిండి అయిపోయిన తరుణంలో అనంతపురం జిల్లా సీటీవో కార్యాలయంలో అధికారి పద్మావతమ్మ ఆ కుటుంబ పడుతున్న అవస్థలను గుర్తించి ఆదుకున్నారు. వారికి భోజనం పెట్టించారు. వైద్య పరీక్షలు చేయించి, కలెక్టర్, ఎస్పీల వద్ద నుంచి తరలింపునకు అనుమతి పత్రాలు తీసుకున్నారు. ఆ కుటుంబాన్ని ఆదివారం కారులో స్వగ్రామం చిమటకు తరలించారు. బతిమాలినా బండ్లు ఆపలేదు: సలోమి నడిచి వచ్చేటప్పుడు ఎంతో మందిని బతిమలాడాను. అయినా ఎవరూ వాహనాలు ఆపలేదు. నడిచి వచ్చేటప్పుడు నా బిడ్డను చూసి కనికరించి కొందరు పండ్లు, తినుబండారాలు ఇచ్చారు. చెప్పులు సైతం తెగిపోయాయి. అనంతపురంలో ప్రభుత్వ అధికారి పద్మావతమ్మ భోజనం పెట్టించి వైద్యపరీక్షలు చేయించి కారు మాట్లాడి మా ఇంటికి పంపించారు. ఆవిడకు ప్రత్యేక ధన్యవాదాలు. కంట తడిపెట్టించింది.. కృపానందం కరోనా నేపథ్యంలో మమ్మల్ని కర్ణాటక రాష్ట్రం తీసుకెళ్లిన మేస్త్రీ మాకు కూలి డబ్బులు ఇవ్వలేదు. చేతిలో చిల్లి గవ్వలేక జీవనం కష్టంగా మారింది. నడిచి ఇంటికి వెళ్లాలనుకుని ఈ నెల ఒకటో తేదీన బయలు దేరాం. 8 నెలల నిండు గర్భిణి అయిన నా భార్య సలోమి మాతో నడవడం నాకు బాధేసింది. పైగా మూడు ఏళ్ల వయసున్న నా మూడో కుమారుడు జైపాల్‌ను ఎత్తుకుని నడవడం మరీ కష్టం అయిపోయింది. -
తల్లి గర్భంలో తలలేని కవలలు!
పలమనేరు(చిత్తూరు): కడుపులో తల లేని కవలలున్న గర్భిణి తీవ్ర కడుపు నొప్పితో ఆదివారం కన్నుమూసింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మేలుమాయి ఎస్సీ కాలనీకి చెందిన యుగంధర్ భార్య అన్నపూర్ణ (27) గర్భం దాల్చింది. అప్పటి నుంచి కడుపు నొప్పితో బాధపడుతూ పలమనేరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంది. ఈ నెల 9న తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వైద్యులు చిత్తూరులో స్కానింగ్ సెంటర్‌కు పంపారు. స్కాన్ చేయగా కడుపులో తలలు లేని కవలలున్నట్టు తేలింది. దీంతో అబార్షన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నెల 10న ఆమెకు గర్భస్రావ మాత్రలిచ్చారు. వాటిని వేసుకున్నాక ఆమెకు ఫిట్స్ రావడంతో వెంటనే కుప్పం మెడికల్ కళాశాలకు తరలించారు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించి మెదడులో రక్తం గడ్డ కట్టిందని తేల్చారు. అక్కడ న్యూరో సర్జన్లు లేరని ఆమెను తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. అన్నపూర్ణ మృతికి సంబంధించిన నివేదికను మండల వైద్యాధికారి డాక్టర్ మురళీకృష్ణ డీఎంహెచ్‌వోకు పంపనున్నారు. -
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా సీఎం జగన్ అడుగులు
సాక్షి, అమరావతి : రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం పైన బుధవారం సీఎం వైఎస్ జగన్ సమీక్ష చేపట్టారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పోషక విలువలు పెంచడంపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పిల్లలు ఏం తింటున్నారో గమనించాలన్నారు. ఆ తర్వాత వారికి అందించే ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలనే దానిపై సూచనలు చేయాలని కోరారు. ఇందుకోసం షోషకాహారంలో నిపుణులైన వారి సలహాలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణలో భాగంగా.. మొదటి దశలో రక్తహీనత, పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న గిరిజన, సబ్‌ప్లాన్ ప్రాంతాల్లోని గర్భవతులు, 6 ఏళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని పెంచాలని.. దీనిని పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. 77 గిరిజన, సబ్‌ప్లాన్ మండలాల్లో డిసెంబర్ నుంచి ఈ పైలట్ ప్రాజెక్టు అమలు కానుంది. వైఎస్సార్ బాల సంజీవని, వైఎస్సార్ బాలామృతం.. ఈ పైలట్ ప్రాజెక్టును అనుసరించి గర్భవతులకు, బాలింతలకు నెలకు రూ. 1062 విలువైన ఆహారం అందించనున్నారు. 25 రోజులపాటు రోజూ భోజనం, గుడ్డు, 200 మి.లీ. పాలతో పాటు రూ. 500 విలువ చేసే వైఎస్సార్ బాల సంజీవని కిట్ ఇస్తారు. వైఎస్సార్ బాల సంజీవని కిట్‌లో మొదటి వారం రెండు కేజీల మల్టీ గ్రెయిన్ ఆటా, రెండో వారం అర కేజీ వేరుశనగలతో చేసిన చిక్కీ, మూడో వారం అర కేజీ రాగి ఫ్లేవర్, అర కేజీ బెల్లం, నాలుగో వారం అర కేజీ నువ్వులుండలు అందజేస్తారు. 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులకు నెలలో ప్రతి రోజూ గుడ్డు, 200 మి.లీ. పాలు, వైఎస్సార్ బాలామృతం కిట్టు కింద రోజుకు రూ. 100 గ్రాముల చొప్పున 2.5 కేజీలు మొత్తంగా రూ. 600 విలువ చేసే పౌష్టికాహారం ఇవ్వనున్నారు. అలాగే 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా నెలకు 25 రోజుల పౌష్టికాహారం అందజేయాలని నిర్ణయించారు. మొత్తంగా నెలకు రూ. 560లతో పౌష్టికాహారం అందించనున్నారు. ఈ మేరకు నెలలో 25 రోజులపాటు భోజనం, గుడ్డు, 200 మి.లీ. పాలు, పోషకాలు ఇచ్చే మరో అల్పాహారం అందజేస్తారు. పైలట్ ప్రాజెక్టు అమలయ్యే ప్రాంతాలు.. ఈ పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం 36 గిరిజన మండలాలు ఎంపిక చేయగా.. శ్రీకాకుళం జిల్లాలో 1, విజయనగరం జిల్లాలలో 7, విశాఖపట్నం జిల్లాలో 11, తూర్పు గోదావరి జిల్లాలో 11, పశ్చిమ గోదావరి జిల్లాలో 6 ఉన్నాయి. సబ్‌ప్లాన్ ప్రాంతానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో 19, తూర్పు గోదావరి జిల్లాలో 4, విశాఖపట్నం జిల్లాలో 6, పశ్చిమ గోదావరి జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 3 కలపి మొత్తం 41 మండలాలను ఎంపిక చేశారు. -
కోతకైనా సిద్ధం. ..సర్కారీ ఆస్పత్రి నిషిద్ధం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలామంది గర్భిణులు సిజేరియన్‌కే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని కొందరు గర్భిణులు సాధారణ ప్రసవాలకు అంగీకరించడంలేదు. పురుటి నొప్పుల సమయంలో పరిస్థితి చేజారిపోతున్నా సాధారణ ప్రసవమే చేద్దామని ప్రభుత్వ వైద్యు లు చేస్తున్న ఒత్తిడే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కొన్నిచోట్ల ప్రసవాలు చేసే లేబర్ రూంలు సరిగా లేకపోవడం, కొందరు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణమని వైద్య వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలపై గర్భిణులు, వారి కుటుంబసభ్యులు ఆందోళ చెందుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో సాధారణ ప్రసవం చేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని కొందరు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. దీన్నే ఆసరాగా తీసుకొని ప్రైవేటు ఆసుపత్రులు అవసరమున్నా లేకపోయినా సిజేరియన్ ద్వారానే బిడ్డను బయటకు తీస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితి ముఖ్యంగా జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోనే కనిపిస్తుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. సాధారణ ప్రసవాలు చేస్తే మంచిదేనని, కానీ గర్భిణీలను మానసికంగా సిద్ధం చేయకుండా ఒత్తిడి చేస్తే ప్రయోజనం ఉండదని వైద్యులు అంటున్నారు. దీంతో ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణుల సంఖ్య ఒకట్రెండు శాతం తగ్గిందని వైద్య విధాన పరిషత్‌లోని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ ఏడాది 3.83 లక్షల మంది ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3.83 లక్షల మంది శిశువులు జన్మించారు. అందులో 2.18 లక్షల (57%) మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో, 1.65 లక్షల (43%) మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో జన్మించారు. గతేడాది ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటి సంఖ్య ఒకట్రెండు శాతం అధికంగా ఉందని, ఇప్పుడు తగ్గిందని అంటున్నారు. ఇక ఇప్పటివరకు జరిగిన ప్రసవాల్లో మొత్తంగా 59% సిజేరియన్ ద్వారా ప్రసవాలు చేశారు. అందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవాల్లో 45%, ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవాల్లో 78% సిజేరియన్ ద్వారా జరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి పంపిన నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా ఖమ్మం, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లో గర్భిణులు జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవం అంటేనే హడలిపోతున్నారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించా యి. సాధారణ ప్రసవానికి ప్రైవేటు ఆస్పత్రుల్లో కేవలం రూ. 25 వేలతో ముగించేయవచ్చు. అదే సిజేరియన్ ఆపరేషన్ చేసినందుకు, వారం పది రోజులపాటు ఆస్పత్రిలో అద్దె గదుల్లో ఉంచినందుకు ఆస్పత్రి స్థాయిని బట్టి రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. -
డైనమిక్ డాక్టరమ్మ
గర్భిణి ప్రసవ వేదనతో హాస్పిటల్‌కు వస్తే ‘‘డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లండి’’ అని పేషెంట్‌ని నిర్దాక్షిణ్యంగా పంపించేసిన ఉదంతాలనే చదువుతుంటాం. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా స్పందించారు మేఘాలయలోని డాక్టర్ బాల్నామ్చి సంగ్మా. అంబులెన్స్ నడిపేందుకు డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో పెద్దాసుపత్రివరకు తనే బండి నడిపి గర్భిణి ప్రాణాలు కాపాడారు. మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్‌లో గారోబదా ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్ ఆమె. తమ హాస్పిటల్‌కి వచ్చిన పేషెంట్‌కి నొప్పులు మొదలయ్యాయి. ఆమెకు స్కానింగ్ టెస్ట్‌లో అంచనా వేసిన తేదీ కంటే ముందుగానే కాన్పు నొప్పులు మొదలయ్యాయి. ఆమెను తురా పట్టణంలోని మెటర్నిటీ అండ్ చైల్డ్ హాస్పిటల్‌కు చేర్చాల్సిన అవసరాన్ని గుర్తించారు డాక్టర్లు. పేషెంట్ బంధువులకు అదే మాట చెప్పారు. అయితే పేషెంట్‌ను పెద్దాసుపత్రికి చేర్చే నాధుడు లేడు. అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన 108 సర్వీస్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. ఆ హాస్పిటల్‌కి ఒక అంబులెన్స్ కూడా ఉంది. కానీ ఆ డ్రైవర్ ఆ రోజు సెలవులో ఉన్నాడు. వాహనం ఉంది కానీ నడిపే వాళ్లు లేరు. ‘‘ప్రైవేట్ వాహనం తెచ్చుకుని పేషెంట్‌ని తీసుకెళ్లండి’’ అని చెప్పడానికి డాక్టర్ సంగ్మాకి నోరు రాలేదు. వాళ్లు అంత ఖర్చును భరించలేరని వాళ్లను చూస్తేనే తెలుస్తోంది. అలాంటప్పుడు అంబులెన్స్ అందుబాటులో ఉండి, తనకు డ్రైవింగ్ వచ్చి ఉండి, లైసెన్స్ కూడా చేతిలో ఉండి... వాళ్లనలా వదిలించుకోవడానికి మనసొప్పలేదామెకి. అందుకే స్టెత్‌ని కోటు జేబులో పెట్టి, కోటును పక్క సీటుకు తగిలించి, డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారామె. అంబులెన్స్ ప్రయాణం తురా పట్టణం వైపు మొదలైంది. ఫోన్లో ఫొటోలు డాక్టర్ సంగ్మా ప్రయాణిస్తున్న దారిలో రోడ్ల మీద ఉన్న జనం దృష్టి ఆ అంబులెన్స్ మీద పడనే పడింది. వెంటనే చాలా మంది చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లతో ఆ దృశ్యాన్ని క్యాప్చర్ చేశారు. అయితే వాళ్లకు విచిత్రంగా అనిపించిన సంగతి డాక్టర్ అంబులెన్స్ డ్రైవ్ చేస్తోందన్న విషయం కాదు. నిజానికి వాళ్లకెవరికీ ఆ సంగతి తెలియదు కూడా. స్థానికులను ఆశ్చర్యపరిచిన సంగతి.... అంబులెన్స్‌ని ఒక మహిళ నడుపుతోంది అని. అంబులెన్స్ తురా చేరింది, గర్భిణికి సుఖ ప్రసవం అయింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా సమయానికి తీసుకురావడంతో కాంప్లికేషన్లు ఏమీ తలెత్తలేదని చెప్పారు డెలివరీ చేసిన డాక్టర్లు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా. సంగ్మా మాత్రం ‘‘ఆ సమయానికి అవసరమైన పని చేశానంతే’’ అంటున్నారు. ఈ నెల ఒకటో తేదీన జరిగిన ఈ సంఘటన ఈశాన్య రాష్ట్రం నుంచి దేశం నాలుగు మూలలకూ చేరడానికి నాలుగురోజులు పట్టింది. – మను -
పెళ్లి కాకుండానే గర్భం.. విచ్ఛిత్తికి యత్నం
రంగారెడ్డి ,పరిగి: గర్భిణిది హత్య కాదని పోలీసులు విచారణలో తేలింది. ఈనెల 5న పరిగి మండల పరిధిలోని రంగంపల్లి శివారులో గుర్తుతెలియని వ్యక్తులు నిండు గర్భిణితో పాటు బిడ్డ మృతదేహాన్ని కాల్చివేసిన విషయం కలకలం రేపిన విషయం తెలిసిందే. దుండగులు గర్భిణిని హత్య చేసి ఇక్కడ మృతదేహాన్ని పడేసి పెట్రోల్‌తో తగులబెట్టి ఉండొచ్చని అప్పట్లో భావించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మిస్సింగ్ కేసుతో మిస్టరీ వీడింది.. ఈమేరకు పరిగి పోలీసులు మిస్సింగ్ కేసులు, సీసీ పుటేజీల సాయంతో విచారణ ప్రారంభించారు. గర్భిణి మృతి వివరాలు పక్క జిల్లాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రానికి కూడా అందజేశారు. ఘటన జరిగిన రోజే కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో ఓ మిస్సింగ్ కేసు నమోదయ్యింది. పరిగి పోలీసుల వివరాలతో అక్కడి పోలీసులు సరిచూసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బ్రహ్మాపూర్ పోలీస్‌స్టేషన్ తమ మిస్సింగ్ కేసుతో ఇక్కడి వివరాలు చూసుకొని తమ ఠాణా పరిధిలోని కనిపించకుండా పోయిన యువతిగా గుర్తించారు. మృతురాలు డిగ్రీ విద్యార్థిని.. మృతురాలిని గల్బర్గాకు చెందిన యువతిగా గుర్తించారు. జయ ప్రభు శ్యామూల్ కూతురు ఎస్తేర్ రాణి(23)గా నిర్ధారించుకున్నారు. ఆమె గుల్బర్గాలోని ఓ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండేది. ఆమెను ఓ యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మించి వంచించడంతో గర్భవతి అయ్యింది. విషయం ఇంట్లో తెలుస్తుందని భావించి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్ చేయించేందుకు యత్నించారు. అబార్షన్ వికటించడంతో యువతి మృతి చెందింది. ఆమెతో పాటు శిశువు మృతదేహాన్ని ప్రియుడు ఓ కారులో తీసుకొచ్చి పరిగి మండల పరిధిలోని రంగంపల్లి శివారులో హైదరాబాద్–బీజాపూర్ రహదారి పక్కన పడేశాడు. మృతదేహాలపై పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. నిందుతుడికి అతని స్నేహితులు కూడా సహకరించినట్లు తెలిసింది. పరిగి పోలీసుల నుంచి సమాచారం అందుకున్న కర్ణాటక పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెలుగు చూసింది. దీంతో కేసును కర్ణాటక గల్బర్గాలోని బ్రహ్మాపూర్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేసినట్లు డీఎస్పీ రవీంద్రారెడ్డి వెల్లడించారు. -
ఆగిపోయిన ‘కేసీఆర్ కిట్’ చెల్లింపులు
నిధుల కొరతతో ప్రోత్సాహకానికి బ్రేకులు కేసీఆర్ కిట్ పథకం లబ్ధిదారులకు ప్రోత్సాహకం నిలిచిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెరుగుతున్నా గర్భిణులు, బాలింతలకు నగదు అందడం లేదు. లబ్ధిదారులు ప్రోత్సాహం కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు తమ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయో తెలుసుకునేందుకు బాలింతలు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. సాక్షి, షాద్‌నగర్ : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు 2017 కేసీఆర్ కిట్ పథకానికి శ్రీకారం చుట్టింది. మగ పిల్లవాడు జన్మిస్తే రూ.12వేలు, ఆడపిల్ల పుడితే రూ.13వేలు నాలుగు దశల్లో నగదుకు చెల్లిస్తుంది. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం కోసం, తల్లి, బిడ్డ ఆరోగ్యానికి, శిశువుకు వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించడం కోసం నాలుగు విడతల్లో ప్రభుత్వం ఈ పథకం కింద నగదును అందజేస్తుంది. ఆశా కార్యకర్తలు గర్భిణులను గుర్తించి వారి వివరాలను ఏఎన్ఎంలకు తెలియజేస్తారు. ఏఎన్ఎం గర్భిణి వద్దకు వెళ్లి ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులకు అందజేస్తారు. గర్భిణికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ఆ వివరాలను జిల్లా కేంద్రంలో ఉండే అధికారులకు పంపిస్తారు. నాలుగు దశల్లో నగదు చెల్లింపులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయించుకున్న లబ్ధిదారులకు నాలుగు విడతలుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. గర్భిణికి ఐదో నెలలో తొలిసారిగా రూ.3వేలు, ప్రసవం అయ్యాక కుమార్తె పుడితే రూ.5వేలు, కుమారుడు పుడితే రూ.4వేలు ఇస్తారు. మూడున్నర నెలల వయసులో శిశువుకు ఇంజక్షన్ ఇచ్చే సమయంలో రూ.2వేలు, 9నెలలకు ఇంజక్షన్ ఇచ్చే సమయంలో మిగిలిన రూ.3వేలు అందజేస్తారు. ఇప్పటి వరకు చెల్లింపులు ఇవీ..కేసీఆర్ కిట్ పథకం జూన్ 06, 2017 సంవత్స రంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి 2019 జూలై వరకు జిల్లాలో గర్భిణులుగా 60,238 మంది నమోదయ్యారు. ఇందులో కేసీఆర్ కిట్ పథకానికి 46,546 మంది అర్హత సాధించారు. వీరిలో 34,601 మందికి రూ.3వేల చొప్పున అందజేశారు. అయితే, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 17,153 మంది మాత్రమే ప్రసవం చేయించుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు కావడంతో 13,290 మంది అర్హత సాధించారు. ఇందులో కేవలం 10,386 మందికి రూ.5వేల చొప్పున ప్రభుత్వం నగదును బ్యాంకుల్లో జమ చేసింది. ఇంకా 11,945 మంది గర్భిణులకు మూడు వేల చొప్పున, 2,904 మంది బాలింతలకు రూ.5వేల చొప్పున ప్రోత్సాహక నగదు ప్రభుత్వం నుంచి అందాల్సి ఉంది. డబ్బులు జమ కాలేదు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసూతి చేయించుకుంటే నగదు వస్తుందని అనుకున్నాం. గర్భవతిగా ఉన్నప్పుడే ఆరోగ్య సిబ్బంది నా బ్యాంకు ఖాతా వివరాలు తీసుకున్నారు. గత ఏప్రిల్‌లో కాన్పు అయింది. ఇప్పటివరకు కూడా డబ్బులు బ్యాంకులో జమ కాలేదు. – తోటపల్లి పద్మ, వేములనర్వ, కేశంపేట -
వైద్యం అందక గర్భిణి మృతి
కుషాయిగూడ: సకాలంలో వైద్యం అందక ఓ గర్బిణి మృతి చెందిన సంఘటన బుధవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..యాదాద్రి జిల్లా, బొమ్మలరామారం మండలం, వాలుతండాకు చెందిన గర్బిణి శాంతాబాయి ఈ నెల 29న అనారోగ్యంతో బాధపడుతూ ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతున్న ఆమె బుధవారం మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని, డబ్బులు చెల్లించనందున వైద్యసేవల్లో జాప్యం చేయడంతో శాంతబాయి మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె కుటుంబసభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై సమాచారం అందడంతో అక్కడికి వచ్చిన లంబాడి హక్కుల పోరాటసమితి నాయకులు మృతురాలి కుటుంబ సభ్యులకు మద్దతు తెలిపారు. దీంతో దిగివచ్చిన యజమాన్యం రూ: 3 లక్షలు పరిహారం చెల్లించడంతో వారు ఆందోళన విరమించారు. డెంగీతో యువకుడి మృతి భాగ్యనగర్‌కాలనీ: డెంగీ వ్యాధితో బాధపడుతూ ఓ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన కూకట్‌పల్లిలో బుధవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జగద్గిరి గుట్టకు చెందిన రాజ్‌కుమార్ (23) సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. జూలై 25న డెంగీతో బాధపడుతున్న అతపు కూకట్పల్లి లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం రాత్రి ప్లేట్లెట్లు తగ్గిపోవటంతో మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని తల్లిదండ్రులు, బంధువులు, ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి సర్థిచెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
చనిపోయి.. తిరిగొచ్చిందా?
కర్ణాటక, రాయచూరు రూరల్: కొప్పళ నగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనూహ్య సంఘటన జరిగింది. ఓ బాలింత కుటుంబ నియంత్రణ చికిత్స కోసం వస్తే వైద్యం చేశారు. అయితే చనిపోయిందని చెప్పి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లమన్నారు. బంధువులు విలపిస్తూ శవాన్ని అంబులెన్సులోకి తరలిస్తుండగా బాలింత కళ్లు తెరచి చూసింది. ఏం జరిగిందంటే.. కొప్పళకు చెందిన కుంభార మంజునాథ్ బాగల్‌కోట జిల్లా గోవనకు చెందిన కవిత(28)తో వివాహమైంది. వీరికి ఐదుగురు పిల్లలు ఉండగా రెండురోజుల క్రితం మగ పిల్లాడు పుట్టాడు. దీంతో కుటుంబ నియంత్రణ అపరేషన్ కోసం కేఎన్ ఆస్పత్రిలో చేర్చారు. అధిక రక్తస్రావం వల్ల బలహీనపడిందని చికిత్స చేయసాగారు. మంగళవారం ఉదయం ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించి రూ. లక్ష ఫీజుల్ని కట్టించుకున్నారు. మృతదేహాన్ని తీసుకెళ్లండని చెప్పారు. కుటుంబసభ్యులు కవిత దేహాన్ని స్ట్రెచర్ ద్వారా అంబులెన్సు వద్దకు తరలిస్తుండగా ఆమె ఒక్కసారిగా కళ్లు తెరిచింది. దీంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. చివరకు బతికే ఉందని తెలిసి సంతోషించారు. బతికి ఉన్న మనిíషిని చనిపోయిందని చెప్పిన వైద్యులపై మండిపడుతూ ధర్నా చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రి చూట్టు పోలీసుల బందోబస్తును ఇవ్వడం జరిగింది. ఆమెకు అక్కడే చికిత్సనందిస్తున్నారు. -
నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది
రాజేంద్రనగర్: డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణితో పాటు కడుపులో ఉన్న శిశువు మృతిచెందారని పీరంచెరువులోని షాదాన్ ఆస్పత్రి వద్ద శనివారం రాత్రి మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండలం మీర్జాగూడ ప్రాంతానికి చెందిన సురేష్, సంగీత(25) భార్యాభర్తలు. గర్భిణి అయిన సంగీత మూడు నెలలుగా రాజేంద్రనగర్ పరిధిలోని షాదాన్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంది. నెలలు నిండడంతో పది రోజులుగా ఆమె నిత్యం ఆస్పత్రికి వచ్చి చెకప్ చేసుకొని వెళ్లింది. ఈ నెల 8న ఆమెను డాక్టర్లు ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. అయితే, శనివారం ఉదయం నుంచి బాగానే ఉంది. రాత్రి 9 గంటల సమయంలో సంగీతతో పాటు కడుపులో ఉన్న శిశువు మృతి చెందిందని డాక్టర్లు కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే సంగీత మృతిచెందిందని ఆరోపించారు. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బంధువులను సముదాయించారు. పంచనామా నిర్వహించి రాత్రి ఉస్మానియా మార్చురీకి సంగీత మృతదేహాన్ని తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం మధ్యాహ్నం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వైద్యం వికటించి గర్భిణి మృతి
తిరువొత్తియూరు: అబార్షన్ చేసేందుకు ఇంజక్షన్ వేయడంతో గర్భిణి మృతి చెందిన సంఘటన పొల్లాచ్చి సమీపంలో జరిగింది. ఈ వ్యవహారంలో నకిలీ మహిళా డాక్టర్‌ను పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. పొల్లాచ్చి, మెట్టువావికి చెందిన సెల్వరాజ్ భార్య వనితామణి (38). వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో వనితామణి మళ్లీ గర్భం దాల్చింది. దీంతో ఆమెకు గర్భస్రావం చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. వడచిత్తూరుకు చెందిన సిద్ధా డాక్టర్ ముత్తులక్ష్మి నడుపుతున్న క్లినిక్‌కు తీసుకెళ్లారు. ఏప్రిల్ 28న ముత్తులక్ష్మి, వనితామణికి ఇంజక్షన్ వేసింది. అది వికటించడంతో వనితామణి మృతి చెందింది. దీనిపై వనితామణి కుమారుడు మారిముత్తు (19) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముత్తులక్ష్మి, ఆమె కుమారుడు కార్తీక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారైన ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. విచారణలో వనితామణికి కాలం చెల్లిన మందును ఎక్కించడం వల్లే మృతి చెందినట్టు తెలిసింది. మంగళవారం సాయంత్రం కోవై జిల్లా ఆరోగ్యశాఖ జాయింట్ కమిషనర్ భానుమతి నేతృత్వంలో కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ డైరక్టర్ కృష్ణ, జిల్లా సిద్ధ వైద్య కార్యాలయ అధికారి ధనం తదితరులు ముత్తులక్ష్మి క్లినిక్‌తో పాటు ఆమె ఇంటిని తనిఖీ చేశారు. ఆ సమయంలో ముత్తులక్ష్మి నడుపుతున్న క్లినిక్‌లో కాలం చెల్లిన ఆయుర్వేద మందులు, ఆంగ్ల మందులు, మాత్రలు ఉండడం గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని క్లినిక్‌కు తాళం వేశారు. అనంతరం మెట్టువావికి వెళ్లి వనితామణి కుటుంబ సభ్యులను విచారణ చేశారు. మంగళవారం జరిపిన విచారణలో ముత్తులక్ష్మి సిద్ధవైద్యం చదవలేదని, సిద్ధవైద్యం పేరుతో అలోపతి వైద్యం చేస్తున్నట్టు తెలిసింది. వడచిత్తూరు ప్రాంతంలో ముత్తులక్ష్మి ఆరేళ్లుగా క్లినిక్ నడుపుతోంది. గత ఏడాది ఓ యువకుడు జ్వరానికి చికిత్స తీసుకుని తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఆ సమయంలో క్లినిక్‌ను పరిశీలించిన పోలీసులు చికిత్స చేయరాదని హెచ్చరికలు జారీ చేశారు. బంధువు ఇంట్లో.. నాగపట్టినంలోని బంధువు ఇంటిలో నకిలీ మహిళా డాక్టర్ ముత్తులక్ష్మి దాగి ఉన్నట్టు ఇన్స్పెక్టర్ వెట్రివేల్‌కు సమాచారం వచ్చింది. బుధవారం పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పొల్లాచ్చికి తీసుకొచ్చి విచారించగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ వైద్యానికి సహకరిస్తున్న ముత్తులక్ష్మి కుమారుడు కార్తీక్ కోసం గాలిస్తున్నారు. -
ప్రసవానికి వచ్చిన గర్భిణి మృతి
తిరువొత్తియూరు: కోవైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రసవానికి వచ్చిన గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆమె మృతిచెందిందని ఆరోపిస్తూ బంధువులు గురువారం ఆందోళన చేపట్టారు. వివరాలు.. కోవై శివానందం కాలనీకి చెందిన సురేష్‌కుమార్ భార్య నిర్మల (35) కోవై ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంగతి తెలుసుకున్న కోవై ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ మహిళా డాక్టర్ తాను పార్ట్‌టైంగా పనిచేస్తున్న రామనాథపురంలోని ఎన్ఎం ఆస్పత్రిలో చెక్‌అప్‌లకు రమ్మని పిలిచినట్టు తెలిసింది. ఈ క్రమంలో నిర్మలను ప్రసవం కోసం గత 15వ తేదీ ఆమె చికిత్స పొందుతున్న ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అయితే గర్భంలో శిశువు మృతి చెందినట్లు తెలిసింది. తరువాత అక్కడ డాక్టర్లు లేక పోవడంతో ఆమెకు శస్త్రచికిత్స చేయనట్టు తెలిసింది. మరుసటి రోజు మంగళవారం డాక్టర్లు నిర్మలకు శస్త్ర చికిత్స చేసి మృతశిశువును బయటకు తీసి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రి నిర్వాహకులు నిర్మలను చికిత్స నిమిత్తం మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయినా నిర్మల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడంతో కోవై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ నిర్మల బుధవారం రాత్రి మృతి చెందింది. బంధువుల ఆందోళన నిర్మల మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు గురువారం ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న రేస్‌కోర్సు పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరపించారు. -
రాజేశ్వరి భర్త, అత్తపై కేసు నమోదు
సాక్షి, విశాఖపట్నం : అదనపు కట్నం కోసం ఆరు నెలల గర్భిణి అయిన గిరిజాల రాజేశ్వరి(23)పై అమానుషంగా దాడి చేసిన ఆమె భర్త దామోదర్, అత్త లలితలపై ఏయిర్పోర్ట్ జోన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివిధ సెక్షన్లకింద కేసు నమోదు చేసి వారిని కస్టడీలోకి తీసుకున్నారు. అనాద అయిన రాజేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్న దామోదర్.. కొద్దిరోజులకే ఆమెను హింసించడం మొదలు పెట్టాడు. అదనపు కట్నం తేవాలంటూ తల్లి లలితతో చిత్రహింసలలకు గురిచేశారు. వారు పెట్టే హింసను తట్టుకోలేక రాజేశ్వరి బయటకు వచ్చి ఒంటరిగా ఉంటోంది. చదవండి : అభాగ్యురాలిపై కట్న పిశాచి పంజా కలర్స్ సంస్థలో పనిచేస్తూ బతుకుతున్న రాజేశ్వరి వద్దకు మంగళవారం మధ్యాహ్నం వచ్చిన దామోదర్ ఆస్పత్రికి తీసుకెళ్తానని ఇంటి నుంచి బటయకు తీసుకొచ్చి కారులో ఎక్కించాడు. అప్పటికే కారులో ఉన్న తల్లి లలితతోపాటు దామోదర్ విపరీతంగా కారులోనే కొట్టుకుంటూ పురుషోత్తపురం వరకూ తీసుకెళ్లారు. అక్కడ కారు నుంచి తప్పించుకున్న రాజేశ్వరి పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని భర్త, అత్తలపై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేరి చికిత్స పొందుతుంది. అన్ని పరీక్షలు పూర్తయితే తప్ప ఏ విషయం చెప్పలేమని వైద్యులు తెలిపారు. -
నిండు గర్భిణీని కాళ్లతో తన్నిన భర్త
-
అభాగ్యురాలిపై కట్న పిశాచి పంజా
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): తల్లిదండ్రులు ఎవరో.. అయిన వారెవరో తెలియని మూడేళ్ల ప్రాయంలో దొరికిన చిన్నారిని, ఆమె అన్నను పోలీసులు ప్రేమ సమాజంలో చేర్పించారు. సమాజం అండతో చదువుకుని సొంత కాళ్లపై బతుకుతున్న క్రమంలో... ఆదర్శ వివాహం చేసుకున్న ఓ యువకుడు ఆ యువతికి ప్రస్తుతం నరకం చూపిస్తున్నాడు. అదనపు కట్నం తీసుకురావాలని అనాథ యువతిపై తల్లితో కలిసి దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి అని కూడా చూడకుండా ఆ తల్లీకొడుకు దాష్టీకానికి పాల్పడడంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళ్తే... ప్రేమగా చూసుకోవాల్సిన భర్త, అత్త అదనపు కట్నం కోసం ఆరు నెలల గర్భిణిపై అమానుషంగా దాడి చేశారు. ప్రస్తుతం బాధితురాలు గిరిజాల రాజేశ్వరి (23) కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చికిత్స పొందుతోంది. బాధితురాలు రాజేశ్వరి, ఆమె అన్న చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... తల్లిదండ్రులు ఎవరో, ఎక్కడి వారో తెలియని రాజేశ్వరిని, ఆమె అన్న చంద్రశేఖర్‌ను పోలీసులు డాబాగార్డెన్స్ ప్రేమ సమాజంలో కొద్ది సంవత్సరాల కిందట అడ్మిట్ చేర్పించారు. అప్పటికి రాజేశ్వరికి మూడేళ్లు, చంద్రశేఖర్‌కు ఆరేళ్లు. ప్రేమ సమాజం అందించిన సాయంతో రాజేశ్వరి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం వరకూ చదువుకొంది. అయితే యుక్త వయసు వచ్చిన వారు ప్రేమ సమాజంలో ఉండే అవకాశం లేనందున బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుని ఎన్ఏడీ కొత్తరోడ్డులో సొంతంగా బ్యూటీపార్లర్‌ను పెట్టుకుంది. ముందే పెళ్లి చేసుకుని మోసగించి... వివాహం జరిగిన తర్వాత కొంత కాలం రాజేశ్వరిని బాగా చూసుకున్న అత్త, భర్త అదనపు కట్నం కోసం నరకం చూపించడం మొదలు పెట్టారు. ఇదే క్రమంలో ఆమె నడుపుతున్న బ్యూటీ పార్లర్, ఐదు తులాల బంగారు గొలుసును అమ్మించి దామోదర్ కారు కొనుక్కున్నాడు. అయితే దామోదర్‌కు స్వాతి అనే యువతితో ముండే వివాహం జరిగినట్లు ఆలస్యంగా తెలిసింది. ఒక రోజు రాజేశ్వరికి స్వాతి ఫోన్‌చేసి ఎలా అయినా చంపించేస్తానని హెచ్చరించింది. దీంతో రాజేశ్వరి భర్తను నిలదీయగా తనకు ఇదివరకే వివాహం జరిగిందని ఒప్పుకోవడంతోపాటు మరింతగా హింసించడం మొదలు పెట్టాడు. వివాహమైన రెండేళ్లలో మూడు అబార్షన్లు చేయించాడు. ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి అయిన రాజేశ్వరిని అత్త, భర్త పెడుతున్న హింసలకు తట్టుకోలేక అత్తవారిల్లు వదిలి ఎన్ఏడీ కూడలిలో ఒంటిరిగా ఉంటోంది. కలర్స్ సంస్థలో పనిచేస్తూ బతుకుతున్న రాజేశ్వరి వద్దకు మంగళవారం మధ్యాహ్నం వచ్చిన దామోదర్ ఆస్పత్రికి తీసుకెళ్తానని ఇంటి నుంచి బటయకు తీసుకొచ్చి కారులో ఎక్కించాడు. అప్పటికే కారులో ఉన్న తల్లి లలితతోపాటు దామోదర్ విపరీతంగా కారులోనే కొట్టుకుంటూ పురుషోత్తపురం వరకూ తీసుకెళ్లారు. అక్కడ కారు నుంచి తప్పించుకున్న రాజేశ్వరి పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని భర్త, అత్తలపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేశ్వరి పరిస్థితిని గమనించి కేజీహెచ్‌కు వెళ్లాలని సూచించడంతో ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో చేరి చికిత్స పొందుతుంది. అన్ని పరీక్షలు పూర్తయితే తప్ప ఏ విషయం చెప్పలేమని వైద్యులు తెలిపారు. కట్నం వద్దంటూనే వేధింపులు రాజేశ్వరి, ఆమె అన్న చంద్రశేఖర్ ప్రేమ సమాజంలో ఆశ్రయం పొందుతున్న సమయంలో అక్కడి వృద్ధాశ్రమంలో ఉన్న తన అమ్మమ్మను చూసేందుకు పురుషోత్తపురం ప్రాంతానికి చెందిన దామోదర్, అతడి తల్లి లలిత తరచూ వచ్చిపోతుండేవారు. ఆ క్రమంలో రాజేశ్వరితో పరిచయం పెంచుకున్నారు. ప్రేమ సమాజం నుంచి వెలుపలికి వచ్చి బ్యూటీ పార్లర్ తెరిచిన తరువాత తల్లీ కొడుకు రాజేశ్వరిని, ఆమె అన్న చంద్రశేఖర్‌ను కలుసుకున్నారు. రాజేశ్వరిని తన కొడుకు దామోదర్‌కు చేసుకుంటానని చెప్పారు. తమ పరిస్థితి మొదటి నుంచి చూస్తున్నారు కనుక కట్నకానుకలు ఇచ్చుకోలేమని చెప్పిన చంద్రశేఖర్‌తో అటువంటివి అక్కరలేదని చెప్పి, వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి ఇంకా వారం రోజులు ఉందనగా తమ వద్ద డబ్బులు లేవని, ఎలా అయినా డబ్బులు సర్దుబాటు చేయాలని దామోదర్ తల్లి లలిత చెప్పడంతో రాజేశ్వరి, చంద్రశేఖర్ రూ.1.20లక్షలు ఇచ్చారు. -
గర్భిణి మృతి.. హత్యా? ఆత్మహత్యా?
నిడదవోలు(పశ్చిమగోదావరి): ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు.. దూర ప్రాంతంలో మంచి ఉద్యోగాలు చేస్తున్న సమయంలో కొంత కాలంగా కుటుంబ కలహాలు ప్రారంభమయ్యాయి. చివరకు అత్తారింటి బాధలకు నిండు గర్భిణి బలైపోయింది. నిడదవోలుకు చెందిన రావి జయమాధవి (28) బెంగళూరు కేఆర్ పురంలో ఈనెల 13న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు ఇవి. నిడదవోలు 4 వార్డులో నివాసముంటున్న రావి ధనంజయరావు, ధనలక్ష్మీలకు కుమార్తె జయమాధవి, కుమారుడు శ్రీనివాసరావు సంతానం. శ్రీనివాసరావు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. తండ్రి ధనంజయరావు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించాడు. 2018 మార్చిలో కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన గాదిరెడ్డి శివ సుబ్రహ్మణ్యంతో జయమాధవి వివాహం చేశారు. వివాహ సమయంలో వరకట్నం రూ.30 లక్షలు, 300 గ్రామలు బంగారం, రూ.2 లక్షల ఆడపడుచు కట్నం ఇచ్చారు. బెంగళూరు కేఆర్ పురంలో జయమాధవి డెలెట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. భర్త శివ సుబ్రహ్మణ్యం అదే నగరంలోని ఐబీఎం కంపెనీలో డెలివరీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. జయమాధవి ఇటీవల పర్సనల్ లోన్ తీసుకోవడంతో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తీసుకున్న రుణానికి ప్రతినెలా ఈఎంఐలు కడుతోంది. రుణం ఎందుకు తీసుకోవలసి వచ్చిందో చెప్పమని భర్త వేధించడం ప్రారంభించాడు. ఆమె ఎనిమిది నెలల గర్భిణి. జయమాధవి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని అక్కడ నుంచి నిడదవోలులోని ఆమె పుట్టింటికి సమాచారం అందింది. తన కుమార్తె ఉరి వేసుకునేంత పిరికిది కాదని, ఆమెను భర్త, అత్తగారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రికరించే ప్రయత్నం చేశారని ధనంజయరావు ఆరోపిస్తున్నాడు. ఎనిమిది నెలల గర్భిణిని పొట్టన పెట్టుకున్నారని కన్నీరు మున్నీరయ్యాడు. తన కుమార్తె గొంతు మీద గాయాలు ఉన్నాయని, దారుణంగా చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బెంగళూరు కేఆర్ పురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్నారు. పర్సనల్ లోన్ ఎందుకు తీసుకుంది... ఇటీవల జయమాధవి పర్సనల్ లోన్ తీసుకోవడంతో భర్త బాధిస్తున్నాడని బంధువులు చెబుతున్నారు. బెంగళూరు వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యం ఎంతో ప్రేమగా తమ ముందు నటించేవాడని, అక్కడ నుంచి వచ్చాక మళ్ళీ ఇబ్బందులు పెట్టేవాడని ఆమె బంధువులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే పట్టణంలో పాటిమీద సెంటర్లో ఉన్న సిరి సెల్ షాపు యజమాని బ్రాహ్మణగూడెంకు చెందిన పుల్లేటికుర్తి చంద్రశేఖర్ తమ ఇంటికి వచ్చి జయమాధవి ఫోటోలు చూపించి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు గత ఏడాది డిసెంబర్లో నిడదవోలు పట్టణ పోలీస్ స్టేషన్ ఆమె తల్లిదండ్రులు ధనంజయరావు, ధనలక్ష్మి ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జయమాధవి పర్సనల్ లోన్ ఎందుకు తీసుకోవలసి వచ్చిందనే అనుమానం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
అనుమానంతోనే అంతం చేశారు!
ఘట్కేసర్: సుశ్రుత, రమేష్‌ల వివాహం రమేష్ తల్లిదండ్రులకు ఇష్టం లేదని, భార్య గర్భిణి అయిందన్న అనుమానంతోనే హత్య చేశాడని మల్కాజ్గిరి ఇన్చార్జి డీసీపీ దివ్యచరణ్ రావు, ఇన్చార్జి ఏసీపీ శివకుమార్ సోమవారం స్పష్టం చేశారు. సుశ్రుత, నాలుగు నెలల కుమారుడి హత్య వివరాలను ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. సుశ్రుత గూడూరులో రమేష్ ఇంటి సమీపంలో అద్దెకున్నప్పటి నుంచి ప్రేమలో పడ్డారు. సుశ్రుత దళితురాలుకాగా, రమేష్ పద్మశాలి కులానికి చెందినవాడు. కులాంతర వివాహానికి వీరి పెద్దలు ఒప్పుకోకపోవడంతో పలుమార్లు తగాదాలు జరిగాయి. 2015 నవంబర్‌లో ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా తల్లి దగ్గర ఉంటున్న సుశ్రుతపై రమేష్‌కు గర్భిణి అయిందన్న అనుమానం వచ్చింది. దీంతో కలిసుందామని చెప్పి ఆమె సోదరుడి సాయంతో ఘట్కేసర్కు రప్పించాడు. ఘట్కేసర్ ఓఆర్ఆర్ సమీపంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం నిద్రమాత్రలు మింగే అలవాటున్న సుశ్రుత తనో మాత్ర మింగి కుమారుడికో మాత్రను పాలల్లో కలిపి తాగించింది. వాళ్లు నిద్రమత్తులోకి వెళ్లగానే ద్విచక్ర వాహనంపై కొండాపూర్ ప్రభాకర్ ఎన్‌క్లేవ్‌కు తరలించాడు. రోడ్డుపైనున్న బంక్‌లో పెట్రోల్ కొని సుశ్రుత, కుమారుడిని దహనం చేశాడు. హత్య తర్వాత పాలకుర్తి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన రమేష్‌ను ఘట్కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకొని సోమవారం రిమాండ్‌కు తరలించారు. జంట హత్యలపై రమేష్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పాత్ర... పరువు హత్యా? అనేది పూర్తి విచారణలో తేలుతుందని వివరించారు. ఘట్కేసర్ సీసీ రఘువీర్‌రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ గర్భిణి మృతి
కర్ణాటక, యశవంతపుర : చికిత్స పొందుతూ గర్భిణి మృతి చెందగా ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. కార్మిక కుటుంబానికి చెందిన అర్పిత(24) గర్భిణి చికిత్స కోసం పీణ్యలోని ఇఎస్ఐ ఆస్పత్రి చెరింది. కొద్దిసేపటికీ ఊపిరి ఆడక ఆమె మృతి చెందింది. అయితే విధుల్లో ఉన్న జూనీయర్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అర్పిత మృ చెందిందనిఆరోపిస్తూ కుటుంబసభ్యులు ఆర్ఎంసీ యార్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సీఎం సారూ.. ఇవిగో వేదనాశ్రువులు
పేదల ఆస్పత్రిగా పేరు పొందిన గుంటూరు జీజీహెచ్‌లోఅడుగడుగునా సమస్యలు తిష్టవేశాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆస్పత్రి కీర్తి మసకబారుతోంది. వైద్య పరికరాలు సమకూర్చడంలో, వసతుల కల్పనలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం పేదలను ఉచిత వైద్యానికి దూరం చేస్తోంది. అవసరమైన పడకలు లేక, వైద్య సిబ్బంది కరువై గుండెమార్పిడి, మోకీళ్ల ఆపరేషన్లు సైతం నిలిచిపోయాయి. సాక్షి, గుంటూరు: స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుకున్న అనేక మంది వైద్యులు జీజీహెచ్‌లో ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. పీపీపీ విధానం ద్వారా ఇప్పటికే జీజీహెచ్ మిలీనియం బ్లాక్‌లో సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే వైద్య బృందం 550 వరకూ గుండె ఆపరేషన్లు చేశారు. దాతల సాయం, సొంత డబ్బులతో నలుగురు నిరుపేద రోగులకు గుండె మార్పిడి ఆపరేషన్లు నిర్వహించి దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిపారు. గుండె మార్పిడి ఆపరేషన్లు ఉచితంగా ఆరోగ్యశ్రీలో చేర్చాలని డాక్టర్ గోఖలే ఉన్నతాధికారులను కోరడంతో సరేనని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. నిధులు మాత్రం మంజూరు చేయలేదు. ఆపరేషన్లు మాత్రం జరగడం లేదు. పడకలు, సిబ్బంది కొరతతో ఇక్కట్లు... జీజీహెచ్‌లో పడకల సంఖ్యను 50 శాతం పెంచాలని అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆస్పత్రిలో 1177 పడకలు ఉండగా అదనంగా 589 పడకలు కావాలని కోరారు. అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పడకలు పెంచుతామంటూ హామీ ఇచ్చారు. మూడేళ్లు గడిచినా అమలుకు మాత్రం నోచుకోలేదు. అదనపు పడకలు మంజూరు చేస్తే డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, నాల్గో తరగతి ఉద్యోగుల పోస్టులు మంజూరవుతాయి. ప్రస్తుతం సరిపడా పడకలు లేకపోవటంతో ఒకే పడకపై ఇద్దరు లేదా ముగ్గురు రోగులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది. రోజుకు 3500 నుంచి 4000 మంది రోగులు ఓపీలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో 60 ఏళ్ల క్రితం మంజూరు చేసిన పడకలు, పోస్టులే నేటికీ ఉన్నాయి. ఆస్పత్రిలో 5 ప్రొఫెసర్, 30 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. నర్సులు కేవలం 186 మంది మాత్రమే ఉన్నారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం సుమారు 400 మంది ఉండాలి. గుండె మార్పిడి, కిడ్నీ మార్పిడి, మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు పెద్దాసుపత్రిలో చేస్తూ ఉండటంతో రోగులు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. గుండె మార్పిడి ఆపరేషన్లకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవటంతో సుమారు 25 మంది ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లకు కోసం 700 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవటంతో వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందులు బయట కొనుక్కోవాల్సిన దుస్థితి జీజీహెచ్‌లో రెండేళ్లుగా మందుల కొనుగోలుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. సర్జికల్ బడ్జెట్ సైతం నిలిపివేయడంతో ఆపరేషన్ చేయించుకునే రోగులే సర్జికల్ బ్లేడ్లు, ఇంజెక్షన్లు, కాటన్ వంటివి కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సర్జికల్, మెడిసిన్ కొనుగోలుకు మూడు నెలలకు రూ.60 లక్షల చొప్పున మంజూరు చేయాల్సి ఉండగా, 25 నెలలుగా సర్జికల్ బడ్జెట్, 14 నెలలుగా మెడికల్ బడ్జెట్‌ను నిలిపివేశారు. ఎంసీహెచ్ వార్డుకు రెండోసారి శంకుస్థాపన రూ.65 కోట్లతో మాతాశిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్) నిర్మించేందుకు 2015 అక్టోబర్ 2Ðన సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఒక్క ఇటుక పడలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి సీఎం శంకుస్థాపన చేస్తున్నారు. -
అమ్మ కోసం....
విజయనగరం , సాలూరు: ఎత్తైన కొండలపై జీవనం.. కఠినమైన ఆచార వ్యవహారాలు... కట్టుబాట్లు.. నడుమ జీవిస్తుండడం గిరిజనుల ప్రత్యేకత. వారుండే గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం కూడా లేకపోవడంతో సాధారణ జీవనం సైతం దుర్భరమే. అదే గర్భం దాల్చిన మహిళలకైతే నరకప్రాయమే. పౌష్టికాహార లోపం.. రక్తహీనత.. వంటి కారణాలతో ఇళ్ల వద్దే ప్రసవిస్తున్న ఎందరో గర్భిణులు ప్రతిఏటా మృతువాత పడుతున్నారు. అలాగే వైద్యం అందక చిన్నారులు సైతం పురిటిలోనే కన్నుమూస్తున్నారు. పురిటినొప్పులు రాగానే డోలీల సహాయంతో మైదాన ప్రాంతాల్లోని ఆస్పత్రులకు గర్భిణులను తీసుకురావాల్సిన దుస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది ఇదేవిధంగా డోలీల సాయంతో గర్భిణులను కొండల నుంచి కిందకు దిస్తుండగా గర్భిణులు మృతువాత పడ్డారు. ఈ విషయాలు పత్రికల్లో రావడంతో మానవహక్కుల కమిషన్ సైతం ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. దీంతో పరిస్థితి మార్చాలన్న ఆలోచన నుంచే గిరిశిఖర గ్రామాల గర్భిణులకు ప్రత్యేక వసతిగృహం పుట్టుకొచ్చింది. ఈ ఏడాది అక్టోబరు 17న సాలూరు పట్టణంలోని గుమడాం రోడ్డులో ఉన్న యువజన శిక్షణ కేంద్రంలో వసతిగృహాన్ని ఐటీడీఏ పీఓ లక్ష్మీశా ఆదేశాల మేరకు తెరిచారు. సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లోనే అత్యధిక మంది గిరిజనులు వైద్యం కోసం డోలీలతో కొండలు దిగుతున్న కారణంగా పైలెట్ ప్రాజెక్ట్‌గా మూడు మండలాల ఏజన్సీ ప్రాంత గిరిజన గర్భిణుల కోసం వసతి గృహాన్ని ప్రారంభించారు. ఎన్నో అడ్డంకులు.. ఇదిలా ఉంటే ప్రత్యేక వసతిగృహం విధానం వల్ల వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా గిరిజనులు ఇంటివద్దే ప్రసవం జరుపుకునేందుకు ఇష్టపడతారు. ఊరుదాటి వెళితే తిరిగి వస్తామో.. రామోనన్న భయంతో ఇంటివద్దే మంత్రసానులు, ఏఎన్ఎంల సాయంతో ప్రసవం జరుపుకుంటారు. ఈ కారణంగా ఎంత నచ్చజెప్పినా గర్భిణులతో పాటు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చేందుకు సముఖత వ్యక్తం చేయరు. దీంతో వీరికి అవగాహన కల్పించడంతో పాటు వసతిగృహానికి తీసుకువచ్చేందుకు వైద్య, అంగన్వాడీ సిబ్బంది పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. అంతేగాకుండా వసతి గృహానికి వచ్చిన వారిని నెలల తరబడి ఇంటికి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంచడం కూడా శ్రమతో కూడిన పనవుతోంది. 31 మందికి ప్రసవాలు.. గత నెల 17న ప్రత్యేక వసతిగృహం ప్రారంభం కాగా ఇంతవరకు 31 ప్రసవాలు జరుపుకున్నారు. తల్లీబిడ్డ క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. మొత్తం 36 మంది వసతిగృహానికి చేరుకోగా 31 మంది ప్రసవించారు. ఇందులో 29 మందివి సాధారణ ప్రసవాలు కావడం విశేషం. ఐటీడీఏ పీఓ ఆలోచన సత్ఫలితాలిస్తోందని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కమ్మని ఆహారం.., వైద్యసేవలు.. ఏడో నెలలోకి అడుగుపెట్టిన గర్భిణులను అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు గుర్తించి వారిని వసతిగృహానికి తీసుకువస్తారు. నెలలు నిండేంతవరకు కమ్మని భోజనాన్ని అందివ్వడంతో పాటు వైద్యపరీక్షలు సైతం క్రమం తప్పకుండా చేపడతారు. ఇద్దరు ఏఎన్ఎంలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు బీపీ పరీక్షలు చేపడుతుంటారు. అవసరమైనవారిని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు అందిస్తారు. ప్రసవానికి పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తూ తల్లీబిడ్డ ఆరోగ్యంతో పాటు ప్రాణాలకు ఎలాంటి ముప్పులేకుండా చర్యలు తీసుకుని ఇంటికి క్షేమంగా పంపిస్తారు. తనిఖీలు చేస్తున్నారు.. నాకు ఏడో నెల రాగానే వసతిగృహానికి చేరుకున్నాను. భోజనం బాగుంది. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. కుటుంబాన్ని వదిలి ఉండడం బాధాగా ఉన్నప్పటికీ, పండంటి బిడ్డతో ఇంటికి వెళ్తానన్న నమ్మకంతో ఉంటున్నాను. వైద్యం సదుపాయం అందుబాటులో లేని గర్భిణులకు వసతిగృహం నిజంగా ఒక వరమే.– పొర్రజన్ని పార్వతి, గర్భిణి, గుమ్మిడిగుడ, పాచిపెంట మండలం