డీఎస్సీ దరఖాస్తులు తొలిరోజు నిల్
మచిలీపట్నం : డీఎస్సీ-2014 దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్లో బుధవారం నుంచి ప్రారంభమైంది. ఆన్లైన్లో దరఖాస్తులు పూర్తి చేసిన అభ్యర్థులు ప్రింట్అవుట్ తీసుకుని డీఈవో కార్యాలయంలో సమర్పించాల్సి ఉంది.
దరఖాస్తులు స్వీకరించేందుకు డీఈవో కార్యాలయంలో గురువారం నుంచి ప్రత్యేక సెల్ పూర్తిస్థాయిలో పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. బుధవారం ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తులు చేసినా ఒక్క దరఖాస్తును కూడా డీఈవో కార్యాలయంలో సమర్పించలేదు. ఈ నెల 17వ తేదీ వరకు ఆన్లైన్లో డీఎస్సీ-2014 దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి.
ఈ నెల 17వ తేదీ లోపు అభ్యర్థులు తమ దరఖాస్తులను డీఈవో కార్యాలయంలో సమర్పించాల్సి ఉంది. డీఈవో కార్యాలయ అధికారులు వీటిని ఆథరైజేషన్ చేసి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి పంపుతారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తును పూర్తి చేసిన అనంతరం దాని ప్రింట్ అవుట్‌ను స్వయంగా గానీ లేదా పోస్టు ద్వారా డీఈవో కార్యాలయానికి పంపే అవకాశం ఉంది.