కంది జైలులో ఖైదీ ఆత్మహత్య
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కంది జైలులో చాకలి కరణాకర్ అనే ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం బాత్రూంలో ఉన్న ఫినాయిల్ తాగాడు. దీంతో జైలు సిబ్బంది అతడిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ అతను మృతి చెందాడు. కరుణాకర్ స్వస్థలం మెదక్ జిల్లా గజ్వేల్ మండలం సింగాటం. 2016 లో చర్లపల్లి జైలు నుంచి కంది జైలుకు వచ్చాడు. ఓ చోరీ కేసులో కరుణాకర్ అరెస్ట్ అయ్యి జైలు జీవితం అనుభవిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.