అమర్‌రాజాకూ చుక్కెదురు
హైదరాబాద్: అమర్‌రాజా బ్యాటరీస్‌కు ప్రైవేట్ విద్యుత్ పంపిణీ లెసైన్సు ఇచ్చేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) నిరాకరించింది. చిత్తూరు జిల్లాలో కంపెనీకి చెందిన ప్లాంటు వరకు సొంతంగా (ప్రైవేటుగా) విద్యుత్ పంపిణీ చేసుకుంటామని... ఇందుకోసం లెసైన్సు ఇవ్వాలని కంపెనీ కోరింది. అయితే ఇలాంటి లెసైన్సును జారీ చేయడం వల్ల గుత్తాధిపత్యం ఏర్పడుతుందని ఈఆర్సీ అభిప్రాయపడింది.
ఈ ప్రాంతానికి అవసరమైన విద్యుత్‌ను ఎస్పీడీసీఎల్ నుంచే కొనుగోలు చేస్తామన్న అమర్‌రాజా వాదనను ప్రస్తావిస్తూ.. ఎలాగూ ఎస్పీడీసీఎల్ నుంచే ప్రస్తుతం కూడా విద్యుత్ కొనుగోలు చేస్తున్నందున ప్రత్యేకంగా లెసైన్సు అవసరం లేదని కమిషన్ అభిప్రాయపడింది. అమర్‌రాజా దరఖాస్తును తిరస్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జీఎంఆర్ సంస్థ చేసుకున్న దరఖాస్తును కూడా ఈఆర్సీ ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే.