డ్వామా పీడీగా రవీందర్
సాక్షి, సంగారెడ్డి: జిల్లా గ్రామీణ నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్‌గా పి. రవీందర్ నియమితులయ్యారు. పరిశ్రమల శాఖ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్న ఆయన్ను డిప్యుటేషన్‌పై డ్వామా పీడీగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏడాది పాటు ఆయన ఈ పోస్టులో పనిచేస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వరంగల్ జిల్లా మొగిలపల్లి మండలం రంగాపూర్ ఆయన స్వగ్రామం. గతంలో ఆయన కరీంనగర్ డీఆర్డీఏ పీడీగా డిప్యూటేషన్‌పై 2008-11 మధ్య కాలంలో దాదాపు మూడున్నరేళ్లు పనిచేశారు.
అంతకు ముందు నిజామాబాద్ డీఆర్డీఏ పీడీగా, కరీంనగర్ డీఆర్డీఏ అదనపు పీడీగా, కర్నూలు జిల్లా స్టెట్కూరు సీఈఓగా డిప్యుటేషన్‌పై పనిచేశారు. పరిశ్రమల శాఖలో అసిస్టెంట్ డెరైక్టర్‌గా నియామకం పొందిన రవిందర్ .. ఆయన తన సర్వీసులో పదేళ్లకు పైగా వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో డిప్యుటేషన్లపై పనిచేశారు. ఈ వారాంతంలోగా ఆయన డ్వామా పీడీగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. డ్వామా పీడీగా పనిచేసిన శ్రీధర్ ఇటీవల ఆకస్మిక బదిలీపై వెళ్లిపోవడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్ ఇన్చార్జి పీడీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే