Public inquiry
-
భవిష్యత్ వెలుగులకు ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు తగినట్లుగా భవిష్యత్తు డిమాండ్‌ను అంచనా వేయకపోతే అకస్మాత్తుగా తలెత్తే దుష్పరిణామాలు అంధకారంలో ముంచేస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ప్రణాళిక (ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ప్లాన్)ను రూపొందించాయి. రానున్న పదేళ్లలో రాష్ట్ర విద్యుత్ రంగంలో చోటుచేసుకునే మార్పులను అంచనా వేశాయి. పెట్టుబడులు ఎంత పెట్టాలనే దానిపై లెక్కలుగట్టాయి. దానికి తగినట్లుగా చర్యలు తీసుకోవడానికి అనుమతించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి నివేదికలు సమర్పించాయి. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో), ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఇచ్చిన ఈ నివేదికలపై శనివారం ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టనుంది. నిజానికి.. ఎప్పుడూ హైదరాబాద్‌లోని కమిషన్ ప్రధాన కార్యలయంలో జరిగే ఈ విచారణ ఈసారి విశాఖలో కొత్తగా ప్రారంభించిన క్యాంపు కార్యాలయంలో జరగనుంది. కొత్త కార్యాలయం ఏర్పాటైన మరుసటిరోజే తొలి బహిరంగ విచారణ జరుగుతుండటం విశేషం. ఈ విచారణలో వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికపై ఏపీఈఆర్సీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎంత అవసరం.. ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలు 2024–25 నుంచి 2028–29 వరకూ 5వ కంట్రోల్ పీరియడ్‌కు, 2029–30 నుంచి 2033–34 వరకూ 6వ కంట్రోల్ పీరియడ్‌కు వివిధ అంశాలపై సమగ్ర అంచనా నివేదికలను రూపొందించాయి. వీటి ప్రకారం.. ప్రస్తుతం సోలార్ రూఫ్‌టాప్ సిస్టం సామర్థ్యం రాష్ట్రంలో 150.152 మెగావాట్లుగా ఉంది. ఇది 2034 నాటికి 661.88 మెగావాట్లకు పెరుగుతుంది. అలాగే, విద్యుత్ వాహనాలు ప్రస్తుతం 68,975 ఉన్నాయి. వీటి సంఖ్య 2034 నాటికి 10,56,617కు చేరుతుంది. ఇవి ప్రస్తుతం 16 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వాడుతుండగా, పదేళ్లకు 677 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఇక గృహ విద్యుత్ వినియోగం ప్రస్తుతం ఏడాదికి 17,330 మిలియన్ యూనిట్లు ఉంది. 2034 నాటికి ఇది 31,374 మిలియన్ యూనిట్లకు పెరగనుంది. అన్ని కేటగిరీలకూ కలిపి ప్రస్తుతం 65,228 మిలియన్ యూనిట్లు ఉండగా, 2034కు 1,30,899 మిలియన్ యూనిట్లు అవసరమవుతుంది. సాంకేతిక, పంపిణీ నష్టాలు పోనూ 1,45,331 మిలియన్ యూనిట్లు ఉంటే తప్ప అందరి అవసరాలు తీరవు. విద్యుత్ ఎలా వస్తుందంటే.. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీజెన్కో)కు 3,410 మెగావాట్ల థర్మల్, 1,774 మెగావాట్ల హైడల్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవికాక.. ♦ విజయవాడ వీటీపీఎస్‌లో 5వ యూనిట్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ♦ లోయర్ సీలేరులో 230 మెగావాట్లు, పోలవరంలో 560 మెగావాట్ల 1 నుంచి 7 యూనిట్లు 2024–25లో, 8 నుంచి 12 యూనిట్లలో 400 మెగావాట్లు 2025–26లో, అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజ్ 1 నుంచి 8 యూనిట్లలో 1,200 మెగావాట్లు 2027–28లో, ఇక్కడే 150 మెగావాట్ల 9వ యూనిట్ 2028–29లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశముంది. ♦ మొత్తంగా ఇప్పుడున్న ఉత్పత్తి సామర్థ్యం 5,184 మెగావాట్లుకు అదనంగా 3,340 మెగావాట్ల సామర్థ్యం ఏపీ జెన్కో ద్వారా తోడవ్వనుంది. ♦ ఇవికాక.. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్, ఇండిపెండెంట్ పవర్ జనరేటర్లు, సౌర, పవన విద్యుత్ వస్తుంది. ♦ వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో 3 వేల మెగావాట్లు, 2026లో మరో 3 వేల మెగావాట్లు, 2027లో 1000 మెగావాట్లు చొప్పున మొత్తం 7 వేల మెగావాట్లు రానుంది. ♦ ఈ విద్యుత్‌ను వినియోగదారులకు అందించేందుకు కొత్త సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్లు నిర్మించనున్నారు. ♦ ఏపీ ట్రాన్స్‌కో 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సబ్స్టేషన్లు 10 నుంచి 2029 నాటికి 71కి పెరగనున్నాయి. లైన్లు కూడా 969.15 సర్క్యూట్ కిలోమీటర్లు నుంచి 4,837.16 సీకేఎంకు విస్తరించనున్నాయి. ♦ ఈ మొత్తం ట్రాన్స్మిషన్ కోసం రూ.15,729.41 కోట్లు వ్యయం కానుంది. ♦ ఇదికాక మౌలిక సదుపాయాల కల్పన, కొత్త సాంకేతిక పరిజ్ఞానం వంటి వాటికి మరింతగా ఖర్చుచేయనున్నారు. -
‘జేఎన్‌యూ’పై నేడు విచారణ
న్యూఢిల్లీ: జేఎన్‌యూ లో ఫిబ్రవరి 9 నాటి వివాదాస్పద కార్యక్రమంపై విచారణ కోసం నియమించిన అత్యున్నత స్థాయి కమిటీ మంగళవారం బహిరంగ విచారణ జరపనుంది. వర్సిటీ పాలక భవనం వద్ద దీన్ని నిర్వహించనుంది. అఫ్జల్ గురు ఉరితీతకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమాన్ని ఇక్కడే నిర్వహించడం గమనార్హం. కమిటీ మూడు అంశాలపై అభిప్రాయాలు సేకరిస్తుందని జేఎన్‌యూటీఏ ప్రధాన కార్యదర్శి విక్రమాదిత్య చౌద్రీ చెప్పారు. దీనిపై అభిప్రాయాలు చెప్పేందుకు వర్సిటీ యంత్రాంగానికి కూడా ఆహ్వానం పంపారు. మరోవైపు, మనుస్మృతికి సంబంధించిన పత్రాలను ఎందుకు తగలబెట్టారో వివరణ ఇవ్వాలని జేఎన్యూకు చెందిన ఐదుగురు ఏబీవీపీ మాజీ విద్యార్థులకు వర్సిటీ నోటీసులివ్వగా, తగలబెట్టడంలో తప్పేం ఉందని వారు ఎదురు ప్రశ్నించారు. దేనిపైనైనా నిరసన వ్యక్తం చేయడం తమ హక్కు అని పేర్కొన్నారు. కాగా, వర్సిటీ అధికారులు.. తాజాగా అడ్మినిస్రేటివ్ భవనంపై జై భీమ్ అని రాసినందుకు జితేంద్ర కుమార్ అనే విద్యార్థికి నోటీసు జారీచేశారు. -
జానకీపురం ఎన్‌కౌంటర్‌పై బహిరంగ విచారణ
మోత్కూరు: మండలంలోని జానకీపురం వద్ద ఈనెల 4వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌పై బుధవారం మోత్కూరు తహసీల్దార్ కార్యాలయంలో మిర్యాలగూడ ఆర్డీఓ, మెజిస్టీరియల్ విచారణ అధికారి బి.కిషన్‌రావు బహిరంగ విచారణ జరిపారు. పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఉగ్రవాదులు అస్లామ్అయూక్ఖాన్, మహ్మద్ఎజాజొద్దీన్లతో పాటు ఆత్మకూరు ఎస్ఐ సిద్ధయ్య, కానిస్టేబుల్ నాగరాజు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉద యం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు, మృతిచెందిన పోలీ సుల బంధువులను, రెవెన్యూశాఖ, వైద్యాధికారులను విచారించారు. 36 మందికి నోటీసులు పంపగా విచారణకు 24 మంది హాజరై వాంగ్మూలాలను ఇచ్చారు. 12 మంది గైర్హాజర్ అయ్యారని, పోలీసు విచారణ అధికారి బృందానికి చెందిన 7గురిని తదుపరి పిలిపించి విచారించనున్నట్లు ఆర్డీఓ కిషన్‌రావు తెలిపారు. మొదటగా ఉగ్రవాదులకు పోస్టుమార్టం నిర్వహించిన జిల్లా కేంద్ర ఆస్పత్రికి చెందిన సివిల్‌సర్జన్ డాక్టర్లు టి.నర్సింగరావు, మాతృ, కె.ప్రసాద్రా వు, వినోద్‌కుమార్, బి.శోభారాణిలను ఆర్డీఓ విచారించారు. జానకీపురం వీఆర్వో సత్యనారాయణను ఎదురుకాల్పుల సంఘటన స్థలంలో ఏమి చూశా వు, అక్కడ ఏమి పరిశీలించావు, మృతుల పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించి అతడి స్టేట్మెంట్ను ఆర్డీఓ నమోదు చేసుకున్నారు. మృతిచెందిన కానిస్టేబుల్ నాగరాజు భార్య సంజన, ఆయన తల్లిదండ్రులు శ్రీమన్నారాయణ-లక్ష్మమ్మలను నాగరాజు మృతిచెందాడని ఎవరు చెప్పారని, మీకు ఎలా తెలిసిందని ఆర్డీఓ ప్రశ్నించారు. తమకు అధికారికంగా బాధ్యులైన పోలీసులు ఎవరూ సమాచారం ఇవ్వలేదని ఆత్మకూరు ఎస్ఐ సిద్ధయ్య కాల్పుల్లో మృతిచెందాడని ఆయనతో పాటు కానిస్టేబుల్ నాగరాజు కూడా చనిపోయాడని టీవీ చానల్స్‌లో స్క్రోలింగ్‌లు చూసి నిర్ధారించుకున్నామని ఆర్డీఓకు వివరించారు. చికిత్స కోసం హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించామని తెలపడంతో అక్కడికి తామువెళ్లిచూశామని తెలిపారు. నాగరాజు కాల్పులు జరపగా ఒక ఉగ్రవాది మరణించాడని ప్రత్యక్ష సంఘటనలో ఉన్న తోటి కానిస్టేబుల్స్ తమతో చెప్పారని ఆర్డీఓకు వారు వివరించారు. నాగరాజు ఉగ్రవాదనికి కాల్చిచంపిన సమాచారాన్ని కొంతమంది పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారని భార్య, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగరాజు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందాడని తమ విచారణలో నిర్ధారన జరిగిందని నల్లగొండ డీఎస్పీ రాములు నాయక్ ఆర్డీఓకు వివరించారు. మోత్కూ రు ఎస్ఐ పురేందర్‌భట్, మోత్కూరు, ఆత్మకూరు, రామన్నపేట పోలీస్‌స్టేన్లకు చెందిన కానిస్టేబుల్స్ బి.వెంకటేశ్వర్లు, కొణతం మధు, ఎల్.జానకిరాం, మంద నిరంజన్, టి.శివకోటశ్వర్రావు, ముత్తినేని శ్రీను,హోగార్డు కొంపెల్లి శ్రీనివాస్‌లను ఆయన విచారించారు.వారి ఇచ్చిన స్టేట్మెంట్స్ను రికార్డు చేశారు. భువనగిరి ఆర్డీఓ నూతి మధుసూదన్, డీఎస్పీ సాదుమోహన్‌రెడ్డి, ఎస్ఐ సిద్ధయ్య భార్య ధరణిష, ఆయన సోదరులు దస్తగిరి, పెద్దబాషా, శ్రీకాంత్‌రెడ్డి, ఎఫ్ఏ సీల్ అధికారి తజియోద్దీన్ విచారణకు గైర్హాజరు అయ్యారని ఆర్డీఓ తెలిపారు.