యాదాద్రి చుట్టూ రింగ్ రోడ్డు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన యాదాద్రి, వేములవాడ అభివృద్ధి పనుల పురోగతిని ప్రగతి భవన్లో ఆదివారం సీఎం కేసీఆర్ సమీక్షించారు. యాదాద్రి దేవాలయ క్యూ కాంప్లెక్స్ నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి, తగు సూచనలు చేశారు. గతంలో అనుకున్న విధంగా బస్టాండు, క్యూ కాంప్లెక్స్‌లు గుట్టపైన కాకుండా, కింద నిర్మించాలని సీఎం సూచించారు.
గుట్ట చుట్టూ రింగు రోడ్డు నిర్మాణం, ప్రత్యేక అతిథి గృహాల నిర్మాణ పురోగతిని సమీక్షించారు. గుట్టపై నిర్మాణంలో ఉన్న వివిధ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరగాల న్నారు. ఆలయశిల్పుల సహకారంతో డిజైన్లు రూపొందించి, అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని ప్రత్యేక అధికారి పురుషోత్తంరెడ్డిని ఆదేశించారు. ఈ సంద ర్భంగా శృంగేరి మఠం నుంచి తెచ్చిన ప్రసాదాన్ని వేములవాడ ఆలయ అధికారులు సీఎంకు అందజేశారు.