రోడ్డు ప్రమాద బాధితులకు అమర్ పరామర్శ
అనకాపల్లి టౌన్: కశింకోట ఆర్ఈసీఎస్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, స్థానిక ఉషాఫ్రై మ్ వైద్యాలయంలో చికిత్స పొందుతున్న క్షగగాత్రులను వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. అనంతరం వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరుపై బ్రాండెక్స్ కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు, పట్టణ కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు, మండల పార్టీ అధ్యక్షుడు గొర్లి సూరిబాబు, పార్టీ నాయకులు పి.డి.గాంధీ, యువజన విభాగం అధ్యక్షుడు జాజుల, గంటా సముద్రాలు, రమేష్, గైపూరి రాజు తదితరులు పాల్గొన్నారు.