raghuram krishnam raju
-
రఘురామ కృష్ణంరాజుకు బిగ్ షాక్
-
సర్కార్ పై ఎల్లో మీడియా కక్ష
-
ఇవిగో నోటీసులు..అదిగో అబద్ధం..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష కట్టి నిత్యం తప్పుడు కథనాలను వండి వార్చడమే పనిగా పెట్టుకున్న ఎల్లో మీడియా న్యాయస్థానాల్లో జరిగే కేసుల ప్రొసీడింగ్స్ విషయంలోనూ అదే పంథాను అనుసరిస్తోంది. పేదల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు అవినీతిని ఆపాదిస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ‘పిల్’పై విచారణ సందర్భంగా హైకోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్‌ను వక్రీకరించి ‘ఈనాడు’ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. కోర్టులో జరిగింది, ధర్మాసనం తేల్చి చెప్పింది ఒకటైతే అందుకు విరుద్ధంగా ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేసింది. న్యాయవర్గాల్లో విస్మయం ‘సీఎం జగన్‌కు హైకోర్టు నోటీసులు’ అనే శీర్షికతో ఈనాడు శుక్రవారం ప్రచురించిన కథనంపై న్యాయవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. రఘురామ పిల్ విచారణార్హతపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలంటూ కోర్టు నోటీసులు ఇస్తే.. కేసు లోతుల్లోకి వెళ్లి నోటీసులు ఇచ్చారనే అర్థం వచ్చేలా ఈనాడు కథనాన్ని వెలువరించింది. రఘురామ దాఖలు చేసిన వ్యాజ్యం విచారణార్హతపై అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తీవ్ర అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చడాన్ని ఏజీ తీవ్రంగా వ్యతిరేకించారు. రఘురామకృష్ణరాజు వ్యాజ్యంలో తనపై ఉన్న కేసుల గురించి, ఎంపీ అనర్హతకు సంబంధించి లోక్‌సభ స్పీకర్‌కు అందిన ఫిర్యాదు గురించి పేర్కొనకపోవడాన్ని కూడా ఏజీ ప్రస్తావించారు. రుణ సంస్థలకు రూ.వందల కోట్ల రుణాన్ని ఎగవేసినందుకు ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయాన్ని కూడా ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. రఘురామకృష్ణరాజు రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దల పట్ల ఎలా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారో కోర్టుకు నివేదించారు. ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడం వెనుక ఆయనకున్న దురుద్దేశాలను స్పష్టంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రఘురామ విశ్వసనీయతను ఏజీ ప్రశ్నించారు. తొలుత ఈ వ్యాజ్యం విచారణార్హతపై తేల్చాలని ఏజీ పట్టుబట్టారు. తేల్చిన తరువాతే తదుపరి అడుగులు.. పిల్ విచారణార్హత విషయంలో ఏజీ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో హైకోర్టు ధర్మాసనం సంతృప్తి చెందింది. రఘురామ వ్యాజ్యం విచారణార్హతపైనే ముందుగా తేల్చాలని నిర్ణయించింది. అందుకే వాదనల సందర్భంగా ధర్మాసనం పదేపదే ‘విచారణార్హత’ గురించే ప్రస్తావించింది. ఈ పిల్‌ను విచారణకు సైతం స్వీకరించడం లేదని తేల్చి చెప్పింది. విచారణకు స్వీకరించే ముందు ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నామని పేర్కొంది. ప్రతివాదులకు ఎందుకు నోటీసులు ఇస్తున్నామనే విషయాన్ని కూడా ధర్మాసనం చాలా స్పష్టంగా వివరించింది. విచారణార్హతపై ప్రతివాదులందరూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని సూచించింది. న్యాయస్థానం తమకు ఈ పిల్ విచారణార్హతపై వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదని భవిష్యత్తులో ఎవరూ అనకుండా అందరికీ అభ్యంతరాలను తెలియచేసే అవకాశం ఇస్తున్నామని ఇరు పక్షాలకు చాలా స్పష్టంగా పలుమార్లు చెప్పింది. అందరి అభ్యంతరాలను విని విచారణార్హతను తేల్చి న తరువాతే కేసు లోతుల్లోకి వెళతామని తేల్చి చెప్పింది. అయితే ఈనాడు మాత్రం ఉద్దేశపూర్వకంగా తన మొత్తం కథనంలో ‘విచారణార్హత’ గురించి నామమాత్రంగానే ప్రస్తావించింది. రఘురామ చేసిన ఆరోపణలకు స్పందించి కేసు లోతుల్లోకి వెళ్లి మరీ హైకోర్టు నోటీసులు జారీ చేసిందన్నట్లుగా కథనాన్ని ప్రచురించింది. రఘురామ ఆరోపణలకు తన ఉద్దేశపూర్వక కథనంలో ప్రాముఖ్యతనిచ్చిన ఈనాడు విచారణార్హతపై ఏజీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను మాత్రం నామమాత్రంగానే ప్రస్తావించింది. వాస్తవానికి రఘురామ ఆరోపణల జోలికి ఇప్పుడు వెళ్లే అవకాశం లేదని కోర్టు చెప్పినా కూడా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు న్యాయస్థానం ఆదేశాలను ఈనాడు వక్రీకరించింది. -
ఎంపీగా ఉండి కోర్టుకు రావడమేంటి? రఘురామకు హైకోర్టు చీవాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేయడమే పనిగా పెట్టుకున్న నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజుకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావించకుండా న్యాయస్థానానికి రావడం ఏమిటని ప్రశ్నించింది. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకే ప్రజలు ఆయన్ను పార్లమెంట్‌కు పంపారని వ్యాఖ్యానించింది. ఆర్థికపరమైన అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోబోవని హైకోర్టు తేల్చి చెప్పింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందకుండా ప్రభుత్వాన్ని అడ్డుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రఘురామకృష్ణరాజు అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆ ప్రశ్నే తలెత్తదని స్పష్టం చేసింది. ప్రభుత్వాన్ని న్యాయస్థానాలు నడపవని పేర్కొంది. ఈ వ్యాజ్యంపై పూర్తి స్థాయిలో తీరిగ్గా విచారణ జరుపుతామని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను జూన్ 15కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ (విదేశీ మద్యం, దేశీయ తయారీ విదేశీ మద్యం వ్యాపార నియంత్రణ) చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఇటీవల రెండు చట్టాలను తేవటాన్ని సవాలు చేస్తూ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎలాంటి రుణం పొందకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఆర్థికపరమైన వ్యవహారాలు, నిర్వహణ తదితరాలన్నీ పూర్తిగా ప్రభుత్వ విచక్షణకు సంబంధించినవని స్పష్టం చేసింది. జోక్యం చేసుకోం.. రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపిస్తూ.. కొత్త సవరణ చట్టాల ద్వారా సంచిత నిధికి చెందిన మొత్తాలను ప్రభుత్వం ఆదాయంగా చూపి రుణాలను పొందేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఇంతకీ పిటిషనర్ ఎవరని ప్రశ్నించింది. పిటిషనర్ పార్లమెంట్ సభ్యుడని సుధాకరరావు నివేదించడంతో సమస్యలుంటే పార్లమెంట్లో ప్రస్తావించాలేగానీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్థికపరమైన అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోబోవని తేల్చి చెప్పింది. అందులోనూ లిక్కర్‌కు సంబంధించిన వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని, అలా జోక్యం చేసుకోవడం న్యాయస్థానాలకు హానికరమని, అందువల్ల లిక్కర్‌కు దూరంగా ఉండాలంటూ ధర్మాసనం చమత్కరించింది. ఆర్థికపరమైన వ్యవహారాల నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనిదని తెలిపింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌కు మద్యం అమ్మకం ద్వారా పన్నుల రూపంలో వచ్చే మొత్తాన్ని ప్రభుత్వం ఆదాయంగా చూపుతోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని సుధాకరరావు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఆ మొత్తాలను ఆదాయంగా చూపడానికి వీల్లేదని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుని ఈ వ్యాజ్యంపై వేసవి సెలవుల తరువాత తీరికగా వింటామని తెలిపింది. ఆందోళన అవసరం లేదు... రుణాలు పొందకుండా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది కోరగా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రం దయనీయ స్థితిలో ఉందని, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సుధాకరరావు పేర్కొనడంతో.. ఆర్థిక పరిస్థితి గురించి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), అకౌంటెంట్ జనరల్ (ఏజీ) చూసుకుంటారని, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ప్రభుత్వాలను కోర్టులు నడపవు... ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోంది కాబట్టే న్యాయస్థానాల జోక్యం కోరుతున్నామని సుధాకరరావు పేర్కొనగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ప్రభుత్వాలను న్యాయస్థానాలు నడపవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే న్యాయస్థానాలను ప్రభుత్వాలు నడపవని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 15కి వాయిదా వేసింది. -
ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన ఆర్బీఐ
-
కోటి అందింది.. రాజా ఇంకా పది కోట్లివ్వాలి!
-
రఘురామకృష్ణరాజుపై ప్రధానికి వైఎస్సార్సీపీ ఎంపీల ఫిర్యాదు
-
బ్యాంకులు, కేంద్ర సంస్థలకు రఘురామ ఎగనామం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను మోసగించి 3 ఎఫ్ఐఆర్లు దాఖలైన కేసులో ఆ కంపెనీల డైరెక్టర్లు ఎంపీ రఘురామకృష్ణరాజు తదితరులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన పార్టీ ఎంపీల సంతకాలతో కూడిన లేఖలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు పంపారు. తీవ్రమైన ఆర్థిక మోసాలకు పాల్పడిన ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ, అనుబంధ కంపెనీలు, డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని, పారిపోకుండా ప్రయాణాలపై నిషేధ ఉత్తర్వులివ్వాలని కోరారు. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఇండ్ భారత్ కంపెనీపై సీబీఐ మూడు కేసులు నమోదు చేసిందని తెలిపారు. ఆ కంపెనీలు దురుద్దేశపూరితంగా బ్యాంకులను, ప్రభుత్వ రంగ సంస్థలను మోసగించిన తీరుకు ఈ మూడు ఎఫ్ఐఆర్లు రుజువని లేఖలో వివరించారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు సక్రమంగా లేదని, దీనివల్ల ప్రజలకు దర్యాప్తు సంస్థలపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దురుద్దేశాలను ఒప్పుకుంది.. ఇండ్–భారత్ లిమిటెడ్ 660 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును తమిళనాడులోని ట్యూటికొరిన్‌లో అభివృద్ధి చేసే ప్రతిపాదనతో ప్రభుత్వ సంస్థలు నిధులు సమకూర్చేలా ట్రస్ట్ అండ్ రిటెన్షన్ అగ్రిమెంట్(టీఆర్ఏ) కుదుర్చుకుందని లేఖలో తెలిపారు. ఇండ్–భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్, సంబంధిత కంపెనీలు ప్రభుత్వ ఫైనాన్స్ సంస్థల నుంచి పెట్టుబడి రూపంలో తెచ్చిన మొత్తాన్ని చూపి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.569.43 కోట్ల మేర రుణాన్ని తీసుకున్నాయని 2016లో పీఎఫ్సీకి సమాచారం అందిందన్నారు. 2016 మే 4న ఇండ్–భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ తన దురుద్దేశపూరిత చర్యలను అంగీకరించిందని, అప్పుగా తెచ్చిన ఫిక్స్డ్ డిపాజిట్లను తాకట్టు పెట్టి స్వల్పకాలిక రుణాలు తెచ్చినట్టు ఒప్పుకుందని వివరించారు. ఈ మోసాలపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసిందని, ఎస్బీఐ కూడా ఫిర్యాదు చేసిందని వివరించారు. బ్యాంకు కన్సార్షియాన్ని ఇండ్–భారత్ మోసగించిందని ఫిర్యాదులో పేర్కొందన్నారు. విజయ్ మాల్యా తరహాలో విదేశాలకు పారిపోకుండా డైరెక్టర్లపై ప్రయాణ నిషేధ ఉత్తర్వులివ్వాలని విజ్ఞప్తి చేశారు. మోసగించిన సొమ్మును రికవరీ చేసి డైరెక్టర్లను, కంపెనీలను బాధ్యులను చేయాలన్నారు. కంపెనీల డైరెక్టర్లపై కస్టోడియల్ విచారణ జరపాలని కోరారు. రూ.941.71 కోట్ల ప్రజాధనం స్వాహా.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ సంస, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌ల నుంచి ఇండ్–భారత్ పవర్(మద్రాస్), దాని మాతృసంస్థ ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్, ఆర్కే ఎనర్జీ (రామేశ్వరం) లిమిటెడ్, ఆ సంస్థ డైరెక్టర్లు కె.రఘురామకృష్ణరాజు, మధుసూదన్‌రెడ్డి, వారి గ్రూప్ కంపెనీలు రూ.941.71 కోట్ల మేర ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు లేఖలో తెలిపారు. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు ఢిల్లీ పోలీస్ శాఖ పరిధిలోని ఆర్థిక నేరాల విభాగంలో ఫిర్యాదు చేసినా దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఆ కంపెనీల డైరెక్టర్లు ప్రజాధనంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తెచ్చారు. -
రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయండి: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి.. లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్‌కు లేఖ రాశారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్ దాఖలు చేసి 11 నెలలు గడిచిందని, అయినా ఇప్పటికీ అతనిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడంలో లోక్‌సభ స్పీకర్ కార్యాలయం ఆదర్శంగా ఉండాలని, అనర్హత పిటిషన్‌పై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న విపరీతమైన జాప్యం వల్ల నర్సాపురం ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన వాపోయారు. అర్హత లేని వ్యక్తి పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడం అనైతికమని, ఈ విషయమై లోకసభ స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అనర్హత పిటిషన్‌పై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
రఘురామకృష్ణరాజుపై గరగపర్రు గ్రామ దళితుల ఫిర్యాదు
సాక్షి, పశ్చిమగోదావరి: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజుపై గరగపర్రు గ్రామ దళితుల ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజును ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రఘురామకృష్ణరాజు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. చదవండి: పెళ్లి పేరుతో యువతి మోసం.. రూ.ఆరు లక్షలతో పరార్ నేడు, రేపు భారీ వర్షాలు -
రఘురామకృష్ణరాజును డిస్క్వాలిఫై చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కె. రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే తాము ఆధారాలను లోక్ సభ స్పీకర్‌కు సమర్పించామని భరత్ రామ్ తెలిపారు. అనేక పర్యాయాలు రఘురామకృష్ణరాజు డిస్ క్వాలిఫికేషన్‌కు సంబంధించి స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్ క్వాలిఫై చేయాల్సిందిగా ఈరోజు మరోసారి లోక్ సభ స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశామని భరత్ తెలిపారు. చదవండి: తీరు మార్చుకోకపోతే.. గుణపాఠం చెబుతాం.. -
రఘురామ తీరుపై ఏపీ సీఐడీ అభ్యంతరం
సాక్షి, అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తీరుపై ఏపీ సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రఘురామ తమకు చెప్పినదానికి, ఢిల్లీ పోలీసుల ఫిర్యాదుకు తేడా ఉందని.. దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించేలా ఆయన వ్యవహరిస్తున్నారని సీఐడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా.. ‘‘మొబైల్ ఫోన్ అంశంలో రఘురామ తప్పుదారి పట్టిస్తున్నారు. మే 15న రఘురామ మొబైల్ (యాపిల్ 11) స్వాధీనం చేసుకున్నాం. అందులో ఉన్నది ఫలానా నెంబర్ అని రఘురామ చెప్పారు. ఇద్దరు సాక్షుల ముందు రఘురామ స్టేట్మెంట్ నమోదు చేశాం. మొబైల్ ఫోన్ సీజ్ చేసిన అంశాన్ని సీఐడీ కోర్టుకు తెలిపాం. రఘురామ యాపిల్ ఫోన్‌ను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్‌కు పంపించాం. రఘురామ ఫోన్ డాటాను మే 31న కోర్టుకు అందించాం’’ అని సీఐడీ తెలిపింది. ‘‘తన ఫోన్ సీజ్ చేసినట్టు ఢిల్లీ పోలీసులకు.. రఘురామ ఫిర్యాదు చేసినట్టు మీడియాలో గమనించాం. తన నెంబర్ అంటూ అని ఢిల్లీ పోలీసులకు వేరే ఫోన్ నంబర్ ఇచ్చారు. రఘురామ మే 15న మాకు చెప్పినదానికి, ఢిల్లీ పోలీసుల ఫిర్యాదుకు తేడా ఉంది. దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించేలా రఘురామ ఫిర్యాదు ఉందని’’ సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. చదవండి: అది కేసును ప్రభావితం చేసే కుట్రే -
రాజకీయ దురుద్దేశాలతోనే పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ‘ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యక్తిగత ప్రయోజనాలతోను, రాజకీయ దురుద్దేశాలతోను నా బెయిల్‌ను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇది చట్టప్రక్రియను దుర్వినియోగం చేయడమే..’ అని సీఎం వైఎస్ జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. పిటిషన్ దాఖలు చేసిన తీరు, అందులో వాడిన భాష ఆయన దురుద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. అవాస్తవాలు, తప్పుడు ఆరోపణలు, అభూత కల్పనలతో ఈ పిటిషన్ దాఖలు చేశారని, ప్రత్యేక కోర్టు విధించిన బెయిల్ షరతులను తాను ఎప్పుడూ ఉల్లంఘించలేదని జగన్ తెలిపారు. సీఎం జగన్‌బెయిల్‌ను రద్దుచేయాలంటూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై జగన్ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఓ సాక్షిని జగతి పబ్లికేషన్స్ ఇంటర్వ్యూ చేసిందన్న కారణంగా 2017లో బెయిల్ రద్దుచేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు కొట్టివేసిందని తెలిపారు. జగన్ బెయిల్ షరతులను ఉల్లంఘించలేదని, ఆయన బెయిల్‌ను రద్దు చేయాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసిందన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా సీఎం హోదాలో చర్యలు తీసుకోవాల్సి ఉన్నందునే కోర్టు విచారణకు హాజరుకాలేకపోతున్నానని, తాను హాజరుకాకపోయినా విచారణకు ఎక్కడా అంతరాయం కలగలేదని తెలిపారు. వ్యక్తిగత ద్వేషంతో రాజకీయంగా ప్రయోజనం పొందాలని దాఖలు చేసే ఈ తరహా పిటిషన్లు ఎంతమాత్రం విచారణార్హం కాదని పేర్కొన్నారు. అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. రఘురామ అనేక కేసుల్లో నిందితుడు బెయిల్ రద్దుచేయాలని కోరే హక్కు థర్డ్‌పార్టీకి లేదని అనేక కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులిచ్చిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు రోజువారీ పద్ధతిలో ఈ కేసులను విచారిస్తోందని, నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు వింటోందని తెలిపారు. విచారణను జాప్యం చేస్తున్నారంటూ రఘురామ పేర్కొనడం కోర్టు ధిక్కరణకు పాల్పడమేనని పేర్కొన్నారు. రఘురామ వాస్తవాలను దాచి ఈ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ఆయనపై బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్న రూ.947.71 కోట్లకుపైగా ఎగ్గొట్టారనే తీవ్రమైన ఆరోపణలున్నాయని, సీబీఐ నమోదు చేసిన 2 కేసుల్లో నిందితుడని తెలిపారు. ఆయనపై 7 క్రిమినల్ కేసులున్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించినందున ఎంపీగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ గతేడాది లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు కౌంటర్లో జగన్ వివరించారు. దీనిపై రిజాయిండర్ దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలని రఘు న్యాయవాదులు కోరడంతో విచారణను న్యాయమూర్తి ఈనెల 14కు వాయిదా వేశారు. కాగా, ఈ పిటిషన్‌పై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో మెమో దాఖలు చేసింది. -
ఏపీ సర్కారు వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వం
-
సిఐడీ విచారణకు రఘురామకృష్ణరాజు పూర్తిగా సహకరించాలి
-
అయ్య రామ చంద్రా..!
-
కెఎస్ఆర్ లైవ్ షో 18 may 2021
-
రఘురామ్ ... కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించారు
-
కెఎస్ఆర్ లైవ్ షో 17 may 2021
-
ఖైదీ నంబర్ 3468
-
రఘురామ్ కృష్ణరాజుది రాక్షస సంస్కృతి
-
కుట్రలు బయటపడతాయని బాబు గగ్గోలు
-
ఈ కేసులో బాబును కూడా విచారించాలి
-
రఘురామ్ కృష్ణరాజుకు 14 రోజుల రిమాండ్
-
రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు