కోతి చేష్టలకు తెగిన రైల్వే హైటెన్షన్ తీగ
సంగెం: కోతి చేష్టలకు రైల్వే విద్యుత్ కాంటాక్ట్ తీగ తెగిపోయింది. వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుగూరు స్టేషన్ ప్లాట్‌ఫాం లూప్లైన్లో విజయవాడ నుంచి వరంగల్ వైపునకు బొగ్గు లోడ్‌తో వెళతున్న గూడ్స్‌ను క్రాసింగ్ కోసం నిలిపారు. అయితే గూడ్స్ వ్యాగిన్ (నంబర్ 72982) పైకి ఎక్కిన కోతి ఎగురుతూ, విద్యుత్ కాంటాక్టు వైర్‌ను పట్టుకుంది. విద్యుత్ ప్రసారం జరగడంతో మంటలు లేచి తీగ తెగిపడింది. దీంతో రైళ్లు ఎక్కడివక్కడే నిలి చిపోయాయి.
సమాచారం అందుకున్న కాజీపేట నుంచి ఇంజినీరింగ్ అధికారులు, నెక్కొండ నుంచి రైల్వే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికరారులు, సిబ్బంది బోగిలో స్టేషన్‌కు చెరుకున్నారు. విదుత్ తీగలను తాత్కాలికంగా జాయింట్ చేశారు. ఇతర స్టేషన్లల్లో నిలిచిపోయిన దర్భాం గా, దురంతో, గరీబ్ రథ్, పాట్నా ఎక్స్‌ప్రెస్‌లతో పాటుగా గూడ్స్ రైళ్లను పంపించారు. అనంతరం తెగిన తీగను పూర్తిస్థాయిలో మరమ్మతు చేశారు.