ఆర్థిక క్రమశిక్షణ అలవరచుకోవాలి
చిత్తూరు(అగ్రికల్చర్): స్వయం సహా యక సంఘాల్లోని ప్రతి మహిళ ఆర్థిక క్రమశిక్షణను అలవరచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక టీటీడీసీ భవనం ఆవరణలో జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహించా రు.
ఆయన మాట్లాడుతూ ఎస్‌హెచ్ జీ (స్వయం సహాయక సంఘాలు)ల్లోని మహిళలు ఎప్పటికప్పుడు తమ ఆర్థిక లావాదేవీల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడమే కాకుండా, సకాలంలో బ్యాంకులకు తిరిగి రుణాలను కట్టించేందుకు ఆయా సంఘాల లీడర్లు చురుగ్గా వ్యవహరించాలన్నారు. స్త్రీనిధి రుణాలను జూలై నుంచి వడ్డీలతో సహా కట్టించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంతవరకు వడ్డీలేని రుణాలుగా మహిళలు తిరిగి స్త్రీనిధి బ్యాంకు కు చెల్లిస్తున్నారన్నారు.
అయితే జూలై 1 నుంచి తిరిగి చెల్లించే రుణాల మొత్తాలు 14 శాతం వడ్డీతో సహా కట్టేవిదంగా గ్రామీణ ప్రాంత ఎస్‌హెచ్ జీ మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 94 బీఎంసీల ద్వారా రోజుకు 1.6లక్షల లీటర్ల పాలసేకరణ మాత్రమే జరుగుతోందని, దీంతో బీఎంసీయూల నిర్వహణలో నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. పాలసేకరణ శాతాన్ని పెంచేందుకు పాడిరైతుల్లో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
జూలై 2 నుంచి చిత్తూరు, వైఎస్సార్, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన సంఘాల పర్యవేక్షణ, సీఏఎఫ్ ఆడిట్ కమిటీలకు తిరుపతిలో శిక్షణతరగతులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణ ద్వా రా సంఘాల్లోని మహిళలే స్వయంగా తమ బ్యాంకు లావాదేవీలను ఆన్లై న్ లో పొందుపరచుకునేందుకు అవగాహ న కల్పిస్తారని చెప్పారు.
అనంతరం జిల్లా సమాఖ్య మహిళలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పింఛనుదారులకు పింఛను మొత్తం పెంచకపోవడం దారుణమన్నారు.అభయహ స్తం పింఛన్‌ను నెలకు రూ.500నుంచి రూ. 1000 మేరకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై పీడీ మా ట్లాడుతూ అభయహస్తం పింఛన్ పెం చాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదలను పంపుతామని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సులోచన, కార్యదర్శి చిట్టెమ్మ, కోశాధికారి అనిత, ఐబీ డీపీఎం ప్రభావతి, జిల్లా సమాఖ్య సభ్యురాలు పాల్గొన్నారు.