ravisankar
-
పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్: రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని ఆ పార్టీ నాయకులు రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి అందరు కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని అనేక ప్రాంతాలల్లో సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి త్వరలో ఉద్యమాలు చేపడతామన్నారు. అనంతరం పార్టీ కార్యవర్గం ఎన్నిక జరిగింది. జిల్లా కార్యదర్శిగా శివశంకర్, కార్యవర్గ సభ్యులుగా మగ్బూల్ బాషాను నియమించారు. అదేవిధంగా జిల్లా కమిటిసభ్యులుగా 17 మందిని, నగర కమిటీ సభ్యులుగా 21 మందిని నియమించారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు సిద్దిరామయ్య,తిరుపాల్,లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. -
అన్నింట్లోనూ సీమకు అన్యాయమే
కడప వైఎస్ఆర్ సర్కిల్: రాయలసీమకు ప్రతి విషయంలోనూ అన్యాయమే జరిగిందని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నగరంలోని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాయలసీమలో సహ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు కుట్రలు,కుతంత్రాల వల్ల ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఎందరో మహానుభావులు పుట్టినిల్లకు నిలయంగా మారిన ఈ ప్రాంతం తాగు,సాగు నీటి ప్రాజెక్టులను ఏళ్ల తరబడి పూర్తి చేయడం లేదన్నారు..శ్రీశైలం నీటిని విద్యుత్ పేరుతో 854 కనీస అడుగుల నీటి మట్టాన్ని నిల్వ చేయకుండా ఏపీ,తెలంగాణ రాష్ట్రాలు రాయలసీమకు కాకుండా నీటిని తీసుకెళ్లడం దారుణమన్నారు. పట్టిసీమతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్న చంద్రబాబు ఇంతవరకు నీరు అందించిన దాఖలాలు లేవని విమర్శించారు. శ్రీ బాగ్ ఒడంబడిక నుంచి నేటి విభజన చట్టంలో కూడా రాయలసీమకు అన్యాయం జరగడం బాధాకరమన్నారు.సీమలోని సమస్యలు పరిష్కరించేందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. త్వరలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ తరపున కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శివశంకర్, లింగమూర్తి, బీసీ సంఘ నాయకులు అవ్వారు మల్లికార్జున, జేవీ రమణ.సంఘ సేవకులు సలావుద్దీన్ ,మగ్బూల్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పు
తిరుచానూరు: ఆంధ్ర రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. తిరుపతిలోని ఓ హోటల్లో జరిగిన ఐటీ ఎలక్ట్రానిక్స్ అధికారుల సమీక్షానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీ రంగం ద్వారా అనంతపురం, చిత్తూరు జిల్లాలకు 30 కంపెనీల ప్రతినిధులు రూ.80కోట్లు పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చారని తెలిపారు. సంక్షేమ పథకాల అమలుతీరులో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు వారి వ్యక్తిగత ఖాతాలోనే నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో సుమారు రూ.75కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మీ సేవా పథకం ద్వారా మరిన్ని సేవలందించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు చేరువయ్యేలా ప్రణాళికలు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యుఐడీఎఐ డిడి ఎంవీఎస్.రామిరెడ్డి, శ్రీనివాసరావు, రామ్‌ప్రసాద్, పద్మనాభం, ప్రకాష్, రాజశేఖర్, మునిరత్నం, రవీంద్ర, జేసి గిరీష, డ్వామా పీడి వేణుగోపాల్‌రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కాకినాడలో పరువు హత్య
-
నేరానికి పాల్పడితే వారు 'అడల్టే'
న్యూఢిల్లీ: క్రూరమైన నేరాలకు పాల్పడే బాలనేరస్తులను ఉపేక్షించేది లేదంటూ కేంద్ర కేబినెట్ కమిటీ తేల్చి చెప్పింది. అమానుషమైన నేరాలకు పాల్పడితే వయోజనులు కాకపోయినా వారిని కఠినంగా శిక్షించే చట్ట సవరణల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్భయ కేసు ఒక ప్రత్యేకమైనదని, దీన్ని ఆధారం చేసుకుని జువైనల్ చట్టాల్లో మార్పులు చేయడాన్ని వ్యతిరేకించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసులను కూడా పక్కనపెట్టి కేంద్ర క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. 16-18 ఏళ్ల వయసు కలిగిన బాలలు క్రూరమైన నేరాలకు పాల్పడితే వారిపై భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) కింద విచారణ జరుపుతారని ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. అత్యాచారం వంటి నేరానికి పాల్పడే బాలలను అడల్ట్గానే పరిగణించి చట్టప్రకారం శిక్షించాలని కమిటీ అభిప్రాయపడినట్లు ఆయన చెప్పారు. పాటు బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంతో పాటు పలు నిర్ణయాలు తీసుకున్నారు. కాగా ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో దోషిగా తేలిన బాలుడి అమానుష చర్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే జువైనల్ చట్టంలో మార్పులు చేయాలనే డిమాండ్లు ముందుకొచ్చాయి. 18ఏళ్ల లోపు బాలలు చేసే నేరాలను, పరిపక్వత లేని వయసులో చేసే నేరాలుగా పరిగణించే ఒక వెసులుబాటు జువైనల్ యాక్ట్‌లో ఉన్న సంగతి తెలిసిందే.