పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి | party commitee costituted | Sakshi
Sakshi News home page

పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి

Published Sat, Dec 3 2016 7:41 PM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM

party commitee costituted

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: రాయలసీమ కమ్యూనిస్ట్‌ పార్టీ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని ఆ పార్టీ నాయకులు రవిశంకర్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి అందరు కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని అనేక ప్రాంతాలల్లో సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి త్వరలో ఉద్యమాలు చేపడతామన్నారు. అనంతరం పార్టీ కార్యవర్గం ఎన్నిక జరిగింది.  జిల్లా కార్యదర్శిగా శివశంకర్, కార్యవర్గ సభ్యులుగా మగ్బూల్‌ బాషాను నియమించారు. అదేవిధంగా జిల్లా కమిటిసభ్యులుగా 17 మందిని, నగర కమిటీ సభ్యులుగా 21 మందిని నియమించారు. ఈకార్యక్రమంలో  పార్టీ నాయకులు సిద్దిరామయ్య,తిరుపాల్,లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement