recavery
-
రికవరీలో ప్రపంచంలో మనమే టాప్
న్యూఢిల్లీ: ఒకే రోజు నమోదైన కరోనా కేసులు 93,337 అదే రోజు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 95,880 కరోనాను జయించడంలో ఇది కూడా ఒక రకమైన పురోగతే. కేసుల భారం ఎక్కువగానే ఉన్నప్పటికీ రికవరీలో ప్రపంచంలో మనమే నంబర్ వన్ భారత్లో కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తున్నప్పటికీ అదే స్థాయిలో రికవరీ కూడా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 42,08,431 మంది కోవిడ్–19 నుంచి కోలుకున్నారు. దీంతో భారత్ రికవరీలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. అమెరికా 41 లక్షల మంది రికవరీతో రెండో స్థానంలో ఉంది. యాక్టివ్ కేసుల కంటే రికవరీ కేసులు 4.04 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం 10 లక్షల 13 వేల వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక మొత్తం కేసుల సంఖ్య 53,08,014కి చేరుకుంది. దేశంలో రికవరీ రేటు 79.28గా ఉంది. రికవరీ సాధించింది ఇలా కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచడం, అత్యధికంగా పరీక్షలు చేయడం, ట్రాకింగ్, ట్రేసింగ్ విధానాన్ని సమర్థంగా నిర్వహించి సరైన సమయంలో చికిత్స అందించడం ద్వారా ఈ స్థాయిలో రికవరీ సాధించామని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ట్వీట్లో పేర్కొంది. అంతేకాకుండా హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం, శరీరంలో వైరస్ దాడి తీవ్రతరం కాకుండా రెమిడెసివర్ ఇంజెక్షన్ల వినియోగం, ఆక్సిజన్ పరికరాలు, వెంటిలేటర్ల వినియోగం పెంచడం, ప్లాస్మా థెరపీ, అవసరమైతే స్టెరాయిడ్స్ ఇస్తూ ఉండడంతో ఈ స్థాయిలో రికవరీ సాధించామని తెలిపింది. భారత్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ దేశంలో జనాభాతో పోల్చి చూస్తే చాలా స్వల్పమేనని పేర్కొంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా 60% వరకు రికవరీ కేసులు వస్తున్నాయని వివరించింది. -
సొంత వైద్యం వద్దు
కరోనా నుంచి కోలుకున్నారు కన్నడ భామ నిక్కీ గల్రానీ. తెలుగులో ‘కృష్ణాష్టమి’ సినిమాలో నటించారామె. ‘మలుపు, మరకతమణి’ వంటి డబ్బింగ్ సినిమాలతోనూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. కరోనా నుంచి కోలుకోవడం గురించి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలను ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. ‘‘నా కోసం ప్రార్థించిన వాళ్లకు, ప్రేమాభిమానాలు అందించినవాళ్లకు కృతజ్ఞతలు. నేను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాను. కొన్ని నెలలుగా మనందరం ఒకలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఉన్నాం. భయం, ఆందోళన మన ఆలోచనల్ని తినేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండటం మంచిదే. కానీ అదే పనిగా భయపడటం కూడా సరైనది కాదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు వైరస్ మన వరకూ ఎలా వస్తుందో తెలియదు. కానీ లక్షణాలు కనిపిస్తే తప్పకుండా టెస్ట్ చేసుకోండి. ఏమీ లేదనుకుని మీ చుట్టుపక్కనవాళ్లను ఇబ్బందుల్లో పడేయొద్దు. 14 రోజుల్లో కోలుకోవచ్చు. డాక్టర్ను సంప్రదించండి. సొంత వైద్యం చేసుకోవద్దు’’ అన్నారు నిక్కీ. -
రికవరీ ఉత్తిమాటే..
ఉద్యోగుల కుటుంబాలకు ‘ఆసరా’ అనర్హులకు..రూ.3కోట్లు! రికవరీకి ఆదేశాలు.. ఫలితం దక్కేనా..? కోరుట్ల : ఉద్యోగుల కుటుంబసభ్యులకు అందిన పింఛన్ల రికవరీ కోసం అధికార యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. 2014 నవంబర్లో ప్రభుత్వం ఆసరా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఆధారంగా చేసుకుని సర్కార్ పింఛన్లు అందించింది. ఆ సమయంలో ఉద్యోగాలు ఉన్న కుటుంబాలకు చెందిన వారి వివరాలు సక్రమంగా నమోదు కాకపోవడంతో అనర్హులకూ ఆసరా పింఛన్లు అందాయి. ఈ విషయం సర్కార్ దృష్టికి రాగా 2015లోనే ఉద్యోగులపై ఆధారపడి ఉండి పింఛన్లు పొందిన వారి నుంచి డబ్బుల రికవరీకి ఆదేశించినా ఫలితం దక్కలేదు. 2,932 మంది.. జిల్లాలో సుమారు 5.40 లక్ష మందికి వివిధ వర్గాల కింద ఆసరా పింఛన్లు అందుతున్నాయి. వీరిలో 2,932 మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబసభ్యులు పింఛన్లు పొందుతున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. 2015లోనే ఈ రీతిలో పింఛన్లు పొందుతున్న వారి వివరాలు సేకరించిన డీఆర్డీఏ అధికారులు సదరు వ్యక్తుల పింఛన్లను నిలిపివేసి వారి నుంచి డబ్బుల రికవరీకి సంకల్పించారు. ఈ దిశలో కిందిస్థాయి అధికార యంత్రాంగం ముందుకు వెళ్లిన దాఖలాలు కనబడలేదు. ఫలితంగా రికవరీ ఉత్తి మాటే అయింది. 2016 జూలై వరకు లెక్కలు తీసిన అధికారులు ఆగస్టు నెలాఖరులో మరోసారి ఉద్యోగుల కుటుంబాలపై ఆధారపడి పింఛన్లు పొందుతున్న వారి నుంచి డబ్బుల రికవరీకి ఆదేశించారు. మొదట నోటీసులు ఇచ్చి ఆ తరువాత డబ్బులు వసూలు చేయాలని చెప్పారు. కిందిస్థాయి అధికార యంత్రాంగం అనర్హులుగా గుర్తించిన వారందరికీ నోటీసులు జారీ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. రికవరీ రూ.3కోట్లు! ఉద్యోగుల కుటుంబాలపై ఆధారపడిన వ్యక్తులు సుమారు రెండు సంవత్సరాల్లో రూ.3కోట్ల వరకు ఆసరా పింఛన్ల కింద పొందినట్లు అధికారులు లెక్కతేల్చారు. వీరిలో కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కోరుట్ల, హుజూరాబాద్, హుస్నాబాద్, మెట్పల్లి, జమ్మికుంట, వేములవాడ మున్సిపాల్టీల్లోనే దాదాపు రూ.కోటిన్నర రికవరీ కావాల్సి ఉండగా.. మిగిలిన మండలాల్లో సుమారు రూ.కోటిన్నర డబ్బులు వసూలు కావాలి. రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న ఇంత డబ్బువసూలు చేయడం అధికార యంత్రాంగానికి తలకు మించిన భారంగా మారింది. ఒక్కసారి ఆసరా పింఛన్లు పొందిన వారు మళ్లీ ఆ డబ్బులు వాపస్చేయడం అయ్యే పని కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు డబ్బుల రికవరీకి అక్రమంగా పింఛన్లు పొందిన వారికి నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఫలితం ఎలా ఉంటుందన్న అంశం మున్ముందు తేలనుంది.