సాక్షి జర్నలిజం స్కూల్ ఫలితాలు విడుదల
మే 19 నుంచి ఇంటర్వ్యూలు
హైదరాబాద్: సాక్షి జర్నలిజం స్కూల్ ప్రింట్, టీవీ, వెబ్ జర్నలిజం విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 19న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను స్కూల్ ప్రిన్సిపల్ ఆదివారం విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మొత్తం 1,337 మందికి పైగా అభ్యర్ధులు పరీక్షకు హాజరుకాగా వీరిలో 246 మంది బృంద చర్చలు, ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. వీరికి ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సాక్షి ప్రధాన కార్యాల యంలో బృంద చర్చలు, ఇంటర్వ్యూలు జరుగుతాయి.
కాల్ లెటర్లను www.sakshi schoolof journalism.com వెబ్సైట్లో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు హాల్‌టికె ట్, కాల్ లెటర్, నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు , విద్యార్హతల సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్‌లతో పాటు వయసు నిర్ధారణ కోసం పదోతరగతి మెమోను తప్పనిసరిగా తీసుకురావాలి. అభ్యర్థులు నిర్దేశిత తేదీన ఉదయం 9 గంటలకు సాక్షి ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి.