పశువైద్యుల పోస్టుల భర్తీ
బొబ్బిలిటౌన్, న్యూస్‌లైన్: డివిజన్ పరిధిలోని 15 మండలాల్లో 11 పశువైద్యుల పోస్టుల భర్తీకి ఫ్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇందులో భాగంగా నోటిఫికేషన్ కూడా వెలువడినట్లు పశుసంవర్థక శాఖ ఎ.డి. ఆర్.మురళీధర్ తెలిపారు. బుధవారం ఆయన బొబ్బిలిలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సునందిని పథకం నాలుగు నుంచి 6 నెలల మధ్య వయస్సు కలిగిన దూడలకు ఎంతో లబ్ధి చేకూర్చి పాడి రైతుల పాలిట వరంగా మారుతుందన్నారు. కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా జన్మించిన లేగ దూడలకు నాలుగునుంచి 6నెలలలోపు వయ స్సు ఉన్న వాటికి పశు యాజమాన్యం తరఫున రూ.975 చెల్లిస్తే ప్రభుత్వం తరఫున రూ.4,025 చెల్లించడం జరుగుతుందన్నా రు. పశువులలో కాళసంచుల నివారణకు డివిజిన్ పరిధిలో 2లక్షల 64వేల పశువులకు టీకాలు వేయనున్నామని చెప్పారు.