మహాత్ముడిని ఆదర్శంగా తీసుకోవాలి
ఖమ్మం వైరారోడ్ : వివిధ పార్టీల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 147వ జయంతిని ఆదివారం నిర్వహించారు. టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. గాంధీ సాధించి పెట్టిన స్వాతంత్ర ఫలాలను ప్రతి ఒక్కరికీ అందేలా కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మేయర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, బిచ్చాల తిరుమలరావు, ఆర్జేసీ కృష్ణ కార్పొరేటర్లు మచ్చా నరేందర్, శీలంశెట్టి వీరభద్రం పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...
స్థానిక సంజీవరెడ్డి భవన్లో గాంధీ చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు జహీర్‌అలీ, కొత్తా సీతారాములు, యర్రం బాలగంగాధర్‌తిలక్, దీపక్ చౌదరి, బానోత్ బాలాజీ నాయక్, పాషా, సైదులునాయక్ పాల్గొన్నారు. 43వ డివిజన్లోని గాంధీ విగ్రహానికి మేయర్ పాపాలాల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాసరావు తోట వీరభద్రం, అన్నం శ్రీనివాసరావు, పేళ్లూరి విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
ఖమ్మం లోక్‌సభ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ప్రదీప్‌షా, క్రాంతికుమర్ ఆధ్వర్యంలో జవీనసంధ్యం వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అహ్మద్, సాయి, రాకేష్, అజ్గర్ పాల్గొన్నారు.
టీడీపీ కార్యాలయంలో..
ఖమ్మం అర్బన్ : జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం గాంధీ జయంతిని నిర్వహించారు. జిల్లా పార్టీ సమన్వయ కార్యదర్శి తోటకూరి శివయ్య గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణమూర్తి, ఏలూరి శ్రీనివాసరావు, రాయిపూడి జయాకర్, గొడ్డె మాధవరావు, గొల్లపుడి హరికృష్ణ, సుమంత్, చిత్తారి సింహాద్రి, వెంకటనారాయణ, సురేష్, భిక్షపతి, శ్రీను, సందీప్, అశోక్ పాల్గొన్నారు.