మిస్టర్ ఇండియా అవుతారా? | mister-india | Sakshi
Sakshi News home page

మిస్టర్ ఇండియా అవుతారా?

Published Wed, May 7 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 7:00 AM

మిస్టర్ ఇండియా అవుతారా?

మిస్టర్ ఇండియా అవుతారా?


 దండోరా
 ‘లక్షలాది  భారతీయ పురుషులకు రోల్‌మోడల్ కావాలనుకుంటున్నారా? ఆడవాళ్ల హృదయాలలో గ్రీకువీరుడిగా నిలిచి పోవాలనుకుంటున్నారా? సమాజంలో ప్రముఖుడిగా నిలవాలనుకుంటున్నారా? బంగారంలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారా?  అయితే మాతో చేతులు కలపండి’ అంటోంది ‘మెన్స్ ఎక్స్‌పి’ ఫ్యాషన్ మ్యాగజైన్.
 
ఈ పోటీలో పాల్గొనడానికి అర్హతలు:

- చూడడానికి బాగుండాలి, శారీరక దృఢత్వం ఉండాలి  స్టైలిష్‌గా ఉండాలి దీంతో పాటు ప్రతిభ ఉండాలి     ఇతరులను హాయిగా నవ్వించగలగాలి.పై మూడు అర్హతలు  మీలో ఉంటే చాలు ‘మిస్టర్ ఇండియా’ టైటిల్ గెలుచుకోవడానికి కావలసిన సరుకు మీలో ఉన్నట్లే. ఈ పోటీకి నిరభ్యంతరంగా నిండు ధైర్యంతో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోటీలో విజేతగా నిలిచినవారు ‘మిస్టర్ వరల్డ్’ టైటిల్ కోసం ప్రపంచం నలుమూలల నుంచి ‘మోస్ట్ స్టైలిష్‌మెన్’తో పోటీ పడవచ్చు. ‘‘ప్రతి ఒక్కరూ మిస్టర్ ఇండియా టైటిల్‌ను గెలుచుకోలేకపోవచ్చు. కానీ ఆ అవకాశమేదో మీకు వస్తే సంతోషమే కదా!’’ అంటోంది మెన్స్ ఎక్స్‌పి.నిజమే కదా... ఏ పోటీలో మన విజయం దాగుందో ఎవరికి తెలుసు. మీకు ఆసక్తి ఉంటే పోటీలో పాల్గొనండి. అదృష్టం మీ వైపు ఉంటే టైటిల్ గెలుచుకోండి. రాత్రికి రాత్రే సెలబ్రిటీ కండి. రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. వివరాలకు: mensxp.com mrindia2014

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement