Rukhsar Rehman
-
రెండో భర్తతో విడాకులు.. పెళ్లైన 13 ఏళ్లకు నటి నిర్ణయం!
ది నైట్ మేనేజర్ నటి రుక్సర్ రెహ్మాన్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దాదాపు పెళ్లైన 13 ఏళ్ల తర్వాత తన రెండో భర్త ఫరూక్ కబీర్‌తో విడాకులు తీసుకోనున్నట్లు తెలిపింది. సినీ దర్శకుడైన ఫరూక్ కబీర్‌తో రుక్సర్ విడాకులు తీసుకుంటున్నట్లు గతంలో రూమర్స్ వచ్చాయి. ఫిబ్రవరి నుంచి వేరువేరుగా జీవిస్తున్న ఈ జంట తమ వివాహా బంధానికి గుడ్ బై చెప్పనున్నారు. (ఇది చదవండి: 'ది నైట్ మేనేజర్'.. ఆ సీన్‌తో తమన్నాను మించిపోయిందిగా..!) రుక్సర్ రెహ్మాన్ ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ ఫిబ్రవరి నుంచి తాము విడిగా జీవిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం తాము విడిపోవడానికి నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అయితే చట్టపరమైన ప్రక్రియ ముగియడానికి మరింత సమయం పడుతుందని తెలిపింది. మరోవైపు ఫరూక్ కబీర్ కూడా ఈ వార్తలను ధృవీకరించారు. ఇది నా వ్యక్తిగత విషయం కాబట్టి దీని గురించి ఇప్పుడే మాట్లాడదలుచుకోలేదన్నారు. కాగా.. రుక్సర్, ఫరూక్ మార్చి 2010లో వివాహాం చేసుకున్నారు. దాదాపు ఆరేళ్ల పాటు రిలేషన్ షిప్ తర్వాత పెళ్లి పీటలెక్కారు. గతేడాది ఆయన దర్శకత్వం వహించిన ఖుదా హాఫీజ్- 2లో ఈ జంట కలిసి పనిచేశారు. కాగా.. రుక్సర్ రెహ్మాన్ గతంలో అసద్ అహ్మద్‌ను వివాహం చేసుకున్నారు. వారికి 27 ఏళ్ల ఐషా అహ్మద్ అనే కుమార్తె ఉంది. రుక్సర్ రెహ్మాన్.. పీకే, 83, గాడ్, తుస్సీ గ్రేట్ హో, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, వంటి చిత్రాలలో నటించింది. అంతే కాకుండా కుచ్ తో లోగ్ కహెంగే, డ్రీమ్ గర్ల్, అదాలత్ సిరీస్‌ల్లో కనిపించింది. తాజాగా.. ఆదిత్య రాయ్ కపూర్ నటించిన వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్లో కనిపించింది. (ఇది చదవండి: రామ్ చరణ్ -ఉపాసన బిడ్డకు ఖరీదైన గిఫ్ట్.. స్పందించిన మెగా టీం!) View this post on Instagram A post shared by Rukhsar Rehman (@rukhsarrehman) -
రెండో భర్తకు విడాకులు.. కారణాలు అక్కర్లేదంటున్న నటి
బాలీవుడ్ నటి రుక్సర్ రెహమాన్, దర్శకనిర్మాత ఫరూఖ్ కబీర్ దంపతులు విడిపోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా వీరికి పొసగడం లేదని, తరచూ గొడవలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తారాస్థాయికి చేరడంతో విడిపోవడమే నయమనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వార్తలపై రుక్సర్ రెహమాన్ స్పందించింది. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. పెంట చేయాలనుకోవడం లేదు ఓ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. 'అవును, మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం, కొంతకాలంగా దూరంగా ఉంటున్నాం. ఫిబ్రవరి నుంచి మేము విడివిడిగానే జీవిస్తున్నాం. విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నాం. ఇదంత సులువుగా తీసుకున్న నిర్ణయం కాదు. దీని వెనక ఉన్న కారణాలను, వివరాలను కూపీ లాగి పెంట చేయాలనుకోవడం లేదు. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను' అని చెప్పుకొచ్చింది. మొదటి భర్తకు విడాకులు.. రెండో సారి.. కాగా నటి రెహమాన్ తొలుత అసద్ అహ్మద్‌ను పెళ్లాడింది. వీరికి ఐషా అహ్మద్ అనే కూతురు జన్మించింది. ఈమె కూడా నటిగా స్క్రీన్‌పై తళుక్కుమని మెరిసింది. అయితే రెహమాన్, అసద్‌ల మధ్య దూరం పెరగడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రెహమాన్.. ఫరూఖ్ కబీర్ ప్రేమలో పడింది. ఆరేళ్లు డేటింగ్లో ఉన్న తర్వాత 2010లో పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే రెహమాన్.. దీపక్ ఆనంద్ దర్శకత్వం వహించిన 'యాద్ రఖేగి దునియా' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. పీకే, గాడ్ టుస్సి గ్రేట్ హో, 83, ఖుదా హఫీజ్ 2 వంటి పలు చిత్రాల్లో నటించింది. చదవండి: రాకేశ్ మాస్టర్ గురించి తొలిసారి ఓపెన్ అయిన శేఖర్ మాస్టర్ -
అప్పటి వరకు పిల్లల్ని కనకండి: నటి
పుణె : దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులు ఆగే వరకు, సమాజంలో ఈ భయానకమైన పరిస్థితులు మారే వరకు ఎవరూ పిల్లల్ని కనొద్దంటూ రుక్సర్ రెహమాన్ అనే నటి పిలుపునిచ్చారు. దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న దాడులను ఆమె ‘జంతు ప్రవర్తన’తో పోల్చారు. సమాజంలోని ఈ పరిస్థితులను చూస్తుంటే తన 22 ఏళ్ల కూతురు బయటికి వెళ్లిన ప్రతిసారి తాను ఆందోళనకు గురౌతున్నట్టు తెలిపారు. అందుకోసమే సమాజం మారేవరకూ ఎవరు పిల్లల్ని కనకండి అంటూ పిలుపునిచ్చారు. ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి ఆందోళన, ఆవేదన ఆమె మాటల్లోనే.. ‘ఉత్తరప్రదేశ్‌లోనైన, కశ్మీర్‌లోనైన, చివరకూ పాకిస్తాన్లోనైన అత్యాచారం జరిగితే ఒక అమ్మగా, ఒక మహిళగా అవి నన్ను బాధిస్తాయి. నా 22 ఏళ్ల కూతురు బయటికి వెళ్లిన ప్రతిసారి నేను భయపడుతుంటాను. ఈ సమాజ ఆలోచన విధానం, ప్రవర్తన మారనంత వరకూ బేటీ బచావో, బేటీ పడావో లాంటి కార్యక్రమాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. రుక్సర్ 1992లో తన 17 ఏళ్ల వయసులో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ‘కుచ్ తో లోగ్ కహెంగే’ ‘తుమారి పాకీ’ ‘అవుర్ ప్యార్ హొగయా’ లాంటి టీవీ షోలలో కూడా నటించారు. అలాగే ‘సర్కర్’, ‘షైతాన్’, మొన్నామధ్య వచ్చిన ఆమిర్ ఖాన్ ‘పీకే’ సివిమాలో కూడా రుక్సర్ నటించారు.