వినాయక చవితికి భారీగా ఏర్పాట్లు
సాక్షి, బళ్లారి : వినాయకున్ని పూజించి పనులు చేపడితే సర్వ విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే సోమవారం వినాయక చవితి ని పురస్కరించుకుని పలు వార్డుల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేం దుకు ఆయా కాలనీల్లో మండళ్లను ము స్తాబు చేశారు. నగరంలోని దాదాపు 500కు పైగా విగ్రహాలు కూర్చోబెట్టేం దుకు సన్నాహాలు పూర్తి చేశారు. ప్ర ముఖ కాలనీలైన అనంతపురం రోడ్డు, మున్సిపల్ హైస్కూల్ దగ్గర, ఎస్పీ సర్కిల్, పటేల్‌నగర్, మిల్లార్‌పేట, బెంగళూరు రోడ్డులతోపాటు నగరంలోని 35 వార్డుల పరిధిలో విగ్రహాలు కూర్చోబెట్టేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పూజా సామాగ్రిని కొనుగోలు చేసేం దుకు నగరంలో జనం కిక్కిరిసా రు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ చేతన్‌సింగ్ రాథోడ్ ఆదేశాలు జారీ చేశారు.
విగ్రహాల రూపకల్పనలో మేటి ఓంకార్
బళ్లారి అర్బన్ : ఆంధ్రాళ్ గ్రామంలోని పవిత్ర ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఓంకార్ మధుసూధన్, మల్లికార్జునలు వినూత్న తరహాలో బొజ్జగణపయ్యలను తయారు చేసి చూపరులను ఆకట్టుకుంటున్నారు. వినాయక విగ్రహాలను చేయడంలో ఓంకార్‌ది ప్రత్యేకమైన శైలి. ఆయన ఉపేంద్ర గణపతి, జట్కాబండి గణపతి, జింకల గణపతి, రజనీకాంత్ కొచ్చడియన్ గణపతి, కొబ్బరిచెట్టు గణపతి, జాస్మిన్ పూవుపై ఉన్న సీతాకోక గణపతి, తబల గణపతి, ఏకలవ్య గణపతి, రుద్రాక్ష గణపతులను తయారు చేసి ప్రతిభను చాటారు.
హోస్పేట : నగరంలోని పలు ముఖ్య వీధుల్లో వినూత్న రకాల గణేష్ విగ్రహాలు అమ్మకానికి ఉంచారు. ఈ విగ్రహాలను ఆదివారం జోరుగా కొనుగోలు చేశారు. అలాగే పూజకు కావాల్సిన సామాగ్రిని నగర వాసులు జోరుగా కొనుగోలు చేశారు. పండ్లు, పూలు, మామిడి ఆకులు, అరటి పిలకలు కొనుగోలు చేశారు.