Sagar Area
-
72 గంటల్లో మూడు హత్యలు.. భయాందోళనలో ప్రజలు.. సీరియల్ కిల్లర్ పనేనా?
భోపాల్: గడిచిన 72 గంటల్లో వేరు వేరు ఘటనల్లో ముగ్గురు సెక్యూరిటీ గార్డులు హత్యకు గురయ్యారు. ఈ దారుణాలు మధ్య ప్రదేశ్ రాష్ట్రం సాగర్ ప్రాంతంలో వెలుగు చూశాయి. దీంతో నగరంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే మూడింటిలో రెండు ఒకే వ్యక్తి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. చంపిన విధానం చూస్తుంటే హంతకుడు సీరియల్ కిల్లర్‌గా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. విచారణ పూర్తి అవ్వకముందే ఎలాంటి స్పష్టతకు రాలేమన్నారు. అంతేగాక పోలీసులు అనుమానిత హంతకుడికి సంబంధించిన స్కెచ్‌ను విడుదల చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కళ్యాణ్ లోధి(50) అనే వ్యక్తిని ఆగస్టు 28 అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చేతిలో హత్యకు గురయ్యాడు. తలను సుత్తితో పగులగొట్టి అతి కిరాతకంగా చంపేశారు. చదవండి: కలిచివేసే ఘటన: వైద్యుడి కోసం పడిగాపులు...చివరికి తల్లి ఒడిలోనే ఆ చిన్నారి... నిందితుడి స్కెచ్ ఆగస్టు 29 అర్థరాత్రి రాత్రి.. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్నరో సెక్యూరిటీ గార్డు శంభు నారాయణ్ దూబే (60)ను కూడా రాయితో తల పగులకొట్టి హత్య చేశారు. ఇక మూడో ఘటనలో, ఆగస్టు 30 రాత్రి సాగర్‌లోని మోతీ నగర్ ప్రాంతంలో ఒక ఇంటికి కాపలాగా ఉన్న వాచ్మెన్ మంగళ్ అహిర్వార్ను కర్రతో దాడి చేసి చంపినట్లు అధికారులు గుర్తించారు. కాగా ముందు రెండు హత్యలు ఒకే తరహాలో ఉన్నాయని, క్రైమ్ జరిగిన క్రమాన్ని చూస్తే ఒకే వ్యక్తి హత్య చేసినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. కానీ నిందితులు ఒకరి కంటే ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ కుష్వాహా తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా హంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. హంతకుడు సైకో లేదా సీరియల్ కిల్లర్ అయ్యి ఉండొచ్చిన పేర్కొన్నారు. చదవండి: భార్య పుట్టింటికి వెళ్లిందని... ట్రాన్స్ జెండర్‌ని ఇంటికి రప్పించి... -
నవంబర్ 15కల్లా సాగర్ 3వ జోన్‌కు నీరు
మంత్రి ఉమ పెనుగొలను(గంపలగూడెం) : రాష్ట్రంలో సాగర్ ఆయకట్టు భూములకు సక్రమంగా నీరు అందేలా చూస్తామని భారీ నీటిపారుదలశాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన పెనుగొలను పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన సభలో మాట్లాడారు. నవంబర్ 15 నాటికల్లా సాగర్ 3వ జోన్‌కు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. రెండో జోన్లో ప్రసుత్తం సరఫరా అవుతున్న నీరు టైలాండ్ భూములకు చేరేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సాగు, తాగు నీటికి ఇబ్బంది లేకుండా సాగర్ జలాల సరఫరా అయ్యేలా రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో చర్చిస్తానని వివరించారు. పేదలు నిర్మించుకునే ఇళ్లకు ఇకమీదట ప్రభుత్వం రూ.1.50లక్షలు మంజూరు చేస్తుందని చెప్పారు. ఇప్పటికే ఇళ్లు నిర్మించుకొని బిల్లులు రానివారికి త్వరలో చెల్లిస్తామని తెలిపారు. గతంలో పింఛన్లు పొంది నూతన జాబితాలో రద్దయిన వారిలో అర్హులు ఉంటే కమిటీలలో చర్చించి పింఛను పునరుద్ధరిస్తామని చెప్పారు. రైతు రుణ మాఫీ కోసం ఈనెల 22వ తేదీన రూ.20 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. అనంతరం తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధితో కలిసి పలువురికి పింఛన్లను పంపిణీ చేశారు. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, డీసీఎమ్మెస్ డెరైక్టర్ చెరుకూరి రాజేశ్వరావు,ఎంపీపీ కోటగిరి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ దిరిశాల కృష్టారావు, పలువురు సర్పంచిలు, అధికారులు పాల్గొన్నారు. త్వరలో మార్కెట్ యార్డులకు నూతన పాలకవర్గాలు మైలవరం : జిల్లాలోని మార్కెట్ యార్డులకు త్వరలో నూతన పాలకవర్గాలు ఏర్పాటు చేస్తామని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. పొందుగల గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన మాట్లాడూతూ.. ఏఎమ్‌సీలకు నూతన పాలకవర్గాలు ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఎరువులు, పురుగు మందుల ఉంచుతామని చెప్పారు. కాగా గ్రామంలో యథేచ్ఛగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని ఒక వ్యక్తి మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే అతడిని జాగ్రత్తగా బెల్టు షాపుల నిర్వాహకుల కంటబడకుండా ఇంటికి పంపించాల్సిందిగా పోలీసులకు చెప్పడంతో సభలో కొద్ది సేపు నవ్వులు విరిసాయి.