నవంబర్ 15కల్లా సాగర్ 3వ జోన్‌కు నీరు | By November 15, the 3rd zone Sagar water | Sakshi
Sakshi News home page

నవంబర్ 15కల్లా సాగర్ 3వ జోన్‌కు నీరు

Published Sun, Oct 12 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

నవంబర్ 15కల్లా సాగర్ 3వ జోన్‌కు నీరు

నవంబర్ 15కల్లా సాగర్ 3వ జోన్‌కు నీరు

  • మంత్రి ఉమ
  • పెనుగొలను(గంపలగూడెం) : రాష్ట్రంలో సాగర్ ఆయకట్టు భూములకు సక్రమంగా నీరు అందేలా చూస్తామని భారీ నీటిపారుదలశాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు  తెలిపారు. జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో భాగంగా  శనివారం ఆయన పెనుగొలను పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన సభలో మాట్లాడారు.  నవంబర్ 15 నాటికల్లా సాగర్ 3వ జోన్‌కు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. రెండో జోన్‌లో ప్రసుత్తం సరఫరా అవుతున్న నీరు టైలాండ్ భూములకు చేరేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

    సాగు, తాగు నీటికి ఇబ్బంది లేకుండా సాగర్ జలాల సరఫరా అయ్యేలా రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో చర్చిస్తానని వివరించారు. పేదలు నిర్మించుకునే ఇళ్లకు ఇకమీదట ప్రభుత్వం రూ.1.50లక్షలు మంజూరు చేస్తుందని చెప్పారు.  ఇప్పటికే ఇళ్లు నిర్మించుకొని బిల్లులు రానివారికి త్వరలో  చెల్లిస్తామని తెలిపారు. గతంలో పింఛన్లు పొంది నూతన జాబితాలో రద్దయిన వారిలో అర్హులు ఉంటే కమిటీలలో చర్చించి పింఛను పునరుద్ధరిస్తామని చెప్పారు.   

    రైతు రుణ మాఫీ కోసం ఈనెల 22వ తేదీన రూ.20 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు.  అనంతరం తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధితో కలిసి పలువురికి పింఛన్లను పంపిణీ చేశారు. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, డీసీఎమ్మెస్ డెరైక్టర్ చెరుకూరి రాజేశ్వరావు,ఎంపీపీ కోటగిరి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ దిరిశాల కృష్టారావు,  పలువురు సర్పంచిలు, అధికారులు పాల్గొన్నారు.
     
    త్వరలో మార్కెట్ యార్డులకు నూతన పాలకవర్గాలు

    మైలవరం  : జిల్లాలోని మార్కెట్ యార్డులకు త్వరలో నూతన పాలకవర్గాలు ఏర్పాటు చేస్తామని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. పొందుగల గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన మాట్లాడూతూ.. ఏఎమ్‌సీలకు నూతన పాలకవర్గాలు ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఎరువులు, పురుగు మందుల ఉంచుతామని చెప్పారు. కాగా గ్రామంలో యథేచ్ఛగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని ఒక వ్యక్తి మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే అతడిని జాగ్రత్తగా బెల్టు షాపుల నిర్వాహకుల కంటబడకుండా ఇంటికి పంపించాల్సిందిగా పోలీసులకు చెప్పడంతో సభలో కొద్ది సేపు నవ్వులు విరిసాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement