8 వికెట్లతో విజృభించిన సజ్జాద్
జింఖానా, న్యూస్‌లైన్: బ్రదర్స్ ఎలెవన్ బౌలర్ సజ్జాద్ ఆలీ 8 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో బ్రదర్స్ ఎలెవన్ జట్టు 32 పరుగుల తేడాతో సిండికేట్ బ్యాంక్ జట్టుపై విజయం సాధించింది. తొలిరోజు మ్యాచ్‌లో బ్రదర్స్ ఎలెవన్ 153 పరుగులు చేసింది. సలీం (29), పవన్ కుమార్ (29), సాలమ్ బయాష్ (25) ఫర్వాలేదనిపించారు. సిండికేట్ బ్యాంక్ బౌలర్ 6 వికెట్లు తీసుకున్నాడు. రెండో రోజు బరిలోకి దిగిన సిండికేట్ బ్యాంక్ 121 పరుగుల వద్ద కుప్పకూలింది. శ్రీనివాస్ (42), అరవింద్ శెట్టి (29) మినహా తక్కిన వారు రాణించలేకపోయారు. పాషాబీడి, వీనస్ సైబర్‌టెక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో... పాషా బీడి జట్టు 8 వికె ట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. సయ్యద్ ఫరాన్ (73 నాటౌట్) అర్ధ సెంచ రీతో చెలరేగగా, సౌరవ్ కుమార్ 46 పరుగులు చేశాడు. వీన్స్ సైబర్‌టెక్ బౌలర్ వంశీ 4 వికెట్లు చేజిక్కించుకున్నాడు. నేడు వీనస్ సైబర్‌టెక్ బ్యాటింగ్ చేయాల్సివుంది.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
బాలాజి కోల్ట్స్: 175 (రతన్ శర్మ 78; విజయ్ అశ్విన్ 4/41, మహేష్ 3/66); సుల్తాన్ షాహి: 176/7 (ప్రసాద్ 32, మహేష్ 40; ఇంద్ర దీప్ 3/14, నవజోత్ 3/74) జిందా: 281 (శ్యామ్ 71, హుస్సేన్ 68, శహభాష్ ఉద్దీన్ 63; భరత్ 4/69, రాకేష్ 4/56); జై భగవతి: 44/0. బడ్డింగ్ స్టార్: 200 (తుషార్ 55); హైదరాబాద్ టైటాన్స్: 59/3.