Salvation
-
పిల్లల తిండి కోసం... పస్తులుంటున్న కెనడియన్లు
ఒట్టావా: ఒకప్పుడు లక్షల మందికి కలల గమ్యస్థానమైన కెనడా కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న కిరాణా బిల్లులు, గృహ నిర్మాణ ఖర్చులతో ప్రజలు సతమతమవుతున్నారు. అనేక కుటుంబాలు రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికే ఆపసోపాలు పడుతున్నాయి. చివరికి పిల్లలకు పౌష్టికాహారం కూడా గగనంగా మారుతోందట. సాల్వేషన్ ఆర్మీ చేసిన సర్వేలో ఇలాంటి విస్తుగొలిపే విషయాలెన్నో వెలుగులోకి వచ్చాయి. కెనడాలో 25 శాతం మంది తల్లిదండ్రులు పిల్లలకు పోషకాహారాన్ని అందించడానికి తమ ఆహారాన్ని తగ్గించుకుంటున్నారు. ఇక ఏకంగా 90 శాతానికి పైగా కుటుంబాలు కిరాణా వస్తువుల కొనుగోలును వీలైనంతగా తగ్గించుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే... → కెనడాలో ప్రతి నలుగురు తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లలకు మంచి ఆహారం అందించడానికి స్వీయ ఆహార వినియోగాన్ని తగ్గించారు → సర్వేలో పాల్గొన్న వారిలో 90% మందికి పైగా ఇతర ఆర్థిక ప్రాధాన్యతలకు కావాల్సిన డబ్బు కోసం కిరాణా ఖర్చులు తగ్గించినట్లు చెప్పారు → కెనడాలో ఫుడ్ బ్యాంకులు కూడా తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. → దాంతో భారతీయులు సహా అంతర్జాతీయ విద్యార్థులను తిప్పి పంపాలని అవి నిర్ణయించాయి. → చాలామందికి ప్రస్తుతం కనీస నిత్యావసర వస్తువుల కొనుగోలుకు సరిపడా జీవనోపాధి పొందడం కూడా కష్టంగా మారింది → డబ్బుల్లేక చాలామంది చౌకగా దొరికే నాసిరకం ఆహారంతో కడుపు నింపుకుంటున్నారు → అది కూడా కుదరినప్పుడు భోజనాన్ని దాటవేస్తున్నట్లు 84% మంది చెప్పారు. చాలామంది కెనడియన్లు తమ పిల్లలు, కుటుంబసభ్యుల రోజువారీ ప్రాథమిక అవసరాలను తీర్చడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభానికి ఇది అద్దం పడుతోంది– జాన్ ముర్రే, సాల్వేషన్ ఆర్మీ ప్రతినిధి -
ముక్తి అంటే ఏమిటి? ఎలా సాధించాలి?
శాస్త్రాలలోని విషయాలను గురుసమ్ముఖంలో కూర్చొని శ్రవణం చేసి, గ్రహించిన జ్ఞానాన్ని ఏకాగ్రమైన మనస్సుతో అనుభవానికి తెచ్చుకొని, స్వీయ స్వరూపాన్ని తెలుసుకోవటమే ‘జ్ఞానం’. ఆ జ్ఞానాన్ని ఏకాగ్రతతో అనుభవానికి తెచ్చుకొనుటకు ఆచరించే ఉపాయమే ‘యోగం’ (యోగ సాధన) మనస్సు పూర్తిగా నిర్మలంగా, నిష్కల్మషంగా, స్వచ్ఛంగా ఉంటేనే అందులో పరమాత్మ ఉండేది. నిర్మలమైన అద్దంలో ప్రతిబింబం బాగా ప్రకాశిస్తుంది గాని, దుమ్ము కొట్టుకొని ఉన్న అద్దంలో ప్రతిబింబం సరిగ్గా కనిపించదు గదా! కనుక నీలో పరమాత్మ జ్ఞానం ప్రకాశించాలంటే నీ అంతఃకరణం స్వచ్ఛంగా నిర్మలంగా ఉండాలి. అలాంటి జ్ఞానం కలిగి, నిరంతరం యోగం నందే ఉండాలి, ఏదో కొద్దిసేపు నేను ఆత్మను అనే జ్ఞానంలో ఉండటం కాక శాశ్వతంగా – స్థిరంగా ఆత్మగా ఉండిపోవాలి. ఇలా ఉండాలంటే మనం బ్రహ్మనిష్ఠ, కరుణా సముద్రుడైన గురువును ఆశ్రయించాలి. నిత్యం గురువు ద్వారా సందేహాలను తొలగించుకోవాలి. అలా జ్ఞానంలో నిలబడటం జరుగుతుంది. బుద్ధి ద్వారా పరమాత్మను గురించి శ్రవణం చేయడం, విచారణ చేయడం. ఆయనను చేరుకొనేందుకు కృషి చెయ్యాలి. సత్కార్యాలను సక్రమంగా చేసినట్లైతే స్వర్గ లోకాలకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించటం కూడా నిజమే. అయితే పుణ్యఫలం ఖర్చైపోగానే తిరిగి ఈ లోకంలోకి రావాలాల్సిందే. మళ్ళీ చరిత్ర ప్రారంభించవలసిందే. తాను చెప్పే నూతన విషయాలను, సూక్ష్మబుద్ధికి తప్ప అంతుబట్టని వేదాంత విషయాలను అతడు చక్కగా అర్థం చేసుకొని వదలవలసిన వాటిని వదిలి, పట్టుకోవలసిన వాటిని పట్టుకోవాలి. తీవ్రమైన మోక్షాపేక్షతో తన దగ్గరకు వచ్చిన శిష్యుడు దృఢ నిశ్చయంతో మోక్షమార్గంలో ప్రయాణించాలంటే తాను కొన్ని కఠోరమైన సత్యాలను చెప్పక తప్పదు. అందుకే గురువులు ఇలా గట్టిగా చెబుతుంటారు. వాడు పిల్లికి బిచ్చం పెట్టడు, ఫలానా వాడు ఎంగిలి చేత్తో కాకిని తోలడు, వాడికి పూజా లేదు పునస్కారం లేదు. ఇంక వాడేం మోక్షాన్ని పొందుతాడు? మోక్షాన్ని గనక పొందాలంటే భక్తితో భగవంతుని కొలవాలని, జపతపాలు చేయాలని, పరోపకారాలు (దానధర్మాలు) చేయాలని.. ఇలా చేస్తేనే ముక్తి అని అంటూ ఉంటారు. ముక్తి పొందాలనుకున్నవారు, మోక్షప్రాప్తిని కోరేవారు ఇవన్నీ చెయ్యాల్సిన పనిలేదా? చేయకూడదా ? అంటే చేయాల్సిందే. అయితే ఎలా చేయాలి ? ఎందుకు చేయాలి? మన మనోబుద్ధుల అలజడులు తగ్గించి శాంత పరచుకోవటానికి – నిష్కామంగా, ఎట్టి కోరికలు లేకుండా కర్మలను చేయాలి. అంతవరకే వీటి ప్రయోజనం. సరే మరి ఇంత కర్కశంగా చెప్పటం ఎందుకు? వేదాంతాన్ని అభ్యసించటానికి ఒక సద్గురువు ను సమీపించేటప్పటికే శిష్యుడు కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఈ సంసార సాగరాన్ని తరించే ఉపాయాన్ని బోధించమని గురువును ప్రార్థించినప్పుడు గురువు చెప్పే సునిశిత విషయాలను గ్రహించే మానసిక స్థిరత్వం, ఏకాగ్రత, బుద్ధిసూక్ష్మత శిష్యుడికి ఉండాలి. అలా ఉండాలంటే అప్పటికే వారు ధార్మిక జీవనానికి అలవాటు పడి, నిష్కామ కర్మలు, జపతపాలు ఇష్టదేవతారాధన మొదలైన వాటిని సక్రమంగా ఆచరించేవారై ఉండాలి. ► మీరు ఇతరులను ఆదుకుంటే ఇతరులు మిమ్మల్ని ఆదుకుంటారు. ► మీరు ఇతరుల అభివృద్ధికి కృషి చేస్తే , మీ అభివృద్ధికి ఇతరులు కృషి చేస్తారు. ► మీరు ఇతరుల కోసం సమయాన్ని వెచ్చిస్తేనే, మీ కోసం ఇతరులు సమయాన్ని వెచ్చిస్తారు. ► మీరు ఇతరులకు ఆత్మ విజ్ఞానాన్ని పంచితే , మీకు సృష్టి ఆత్మ విజ్ఞానం పంచుతుంది. ► మీరు ఇతరుల దైవత్వానికి కృషి చేస్తేనే , మీరు దైవత్వం పొందగలుగుతారు. ► ‘పరోపకారం‘ (దానాలు) చేయాలని నిజంగా మీరు నిర్ణయించుకుంటే ఎన్నో రకాలుగా చేయవచ్చు. మనసు ఉంటే మార్గం ఎప్పుడూ ఉంటుంది. ► ‘పరోపకారం’ ద్వారా అన్ని సమస్యలలో నుంచి సులభంగా, వేగంగా, శాశ్వతంగా బయటపడవచ్చు. ► సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం, లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటారు. కాని కలియుగంలో అన్నిటికన్నా ప్రధానం ► ‘పరోపకారం’. (దానాలు) చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది..? జీవితంలోని ఏ సమస్యలైనా ‘పరోపకారం’ ద్వారా తొలగిపోతాయి. సర్వ అనారోగ్యాలను, సమస్త సమస్యలను ‘పరోపకారం’ ద్వారా శాశ్వతంగా తొలగించుకోవచ్చు. ఎవరికైనా సహాయం చేయండి. మంచి పనులు చేయండి. అడగక ముందే వారి అవసరాన్ని కనిపెట్టి, ఏమీ ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయండి. ఏ సహాయం చేయగలుగుతారో అదే చేయండి. మీకు సహాయం చేసే వీలు లేకపోతే కనీసం సహాయం ఎక్కడ దొరుకుతుందో తెలియజెప్పండి. మీరు ఏదైనా సహాయం చేస్తేనే మీకు సహాయాలు లభిస్తాయి. మీరు ప్రేమను పంచితేనే, మీరు ప్రేమను పొందగలుగుతారు. బయటి ప్రవర్తన – లోపల మనస్సు రెండూ ఒక్కటిగా ఉంటేనే ధ్యానంలో మనస్సు నిలుస్తుంది. జ్ఞానాన్ని చక్కగా గ్రహించగలుగుతారు. అప్పుడే మనస్సు పరమాత్మకు దగ్గరగా ఉంటుంది. ఇలా మనస్సు నిర్మలంగా స్వచ్ఛంగా ఉండాలంటే – నిరంతరం భగవంతుని పూజలు, యజ్ఞలు, పరోపకారం (దానాలు), తపస్సులు, ఆధ్యాత్మిక సాధనలు భక్తితో ఆచరించాలి. అలాగాక ఆచరణ గొప్పగా ఉండి మనస్సు మాత్రం ప్రాపంచిక విషయాలతో, స్వార్థపూరిత భావాలతో వ్యవహరిస్తే అది పరమాత్మకు దూరం చేస్తుంది. – భువనగిరి, కిషన్ యోగి -
మోక్షం పొందాలంటే.. నాతో ఏకాంతంగా గడపాలి
ముబాయి: మోక్షం పొందాలంటే నాతో సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేస్తున్న యోగ గురువును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని సెవ్రిలో ఆదివారం వెలుగు చూసింది. పట్టణానికి చెందిన యోగ గురువు శివరాం రౌత్(57) తన వద్ద యోగ శిక్షణ తీసుకోవడానికి వచ్చిన ఓ మహిళను మోక్ష ప్రాప్తి కోసం తనతో ఏకాంతంగా గడపాలని కోరాడు. దీంతో భయందోళనలకు గురైన మహిళ తన భర్తతో కలిసి ఆర్.ఏ.కె మార్గ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి ఆదివారం వదాలలోని తన నివాసంలో యోగ గురువును అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్త మీడియాతో మాట్లాడుతూ.. తన వద్ద యోగ శిక్షణకు వస్తున్న పలువురు మహిళలతో రౌత్ ఈవిధంగా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. వారంతా భయంతో విషయం బయటకు చెప్పలేకపోయారు. ఇప్పుడు మరి కొంతమంది ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలిపారు. -
ఆదరాబాదరా ముస్తాబు
అక్కడి నుంచి ఇక్కడకు వెళ్లే ఫలానా నెంబర్ రైలు.. ఇన్ని గంటలకు ఇన్నో నెంబర్ ఫ్లాట్‌ఫ్లాంపైకి వస్తుందని ముందస్తు సమాచారమిచ్చి ప్రయాణికులను అప్రమత్తం చేసే రైల్వేశాఖ పుష్కరాలకు వచ్చే భక్తుల విషయంలో మాత్రం ప్రమత్తంగా వ్యవహరిస్తోంది. లక్షల్లో ప్రయాణికులు వస్తారని భావిస్తున్న కొవ్వూరు రైల్వేస్టేషన్లో అవసరమైన స్థాయిలో ఏర్పాట్లు చేయడం లేదు. తూతూమంత్రంగా నిధులు విదిల్చి తాత్కాలిక తంత్రంతో బయట పడే మార్గంలో పయనిస్తోంది. అసలే అరకొర నిధులతో నిర్వహిస్తున్న పనులను ఆలస్యంగా ప్రారంభించింది. ఇప్పటికే స్టేషన్లో తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్వహణ వంటి కనీస సదుపాయాలు కొరవడ్డాయి. వాటిని పునరుద్ధరించి పైపై మెరుగులద్దేలోపే పుణ్యకాలం కాస్తా కరిగిపోయేలా ఉంది. కొవ్వూరు :గోదావరి పుష్కరాలకు కొవ్వూరు రైల్వేస్టేషన్ ఆదరాబాదరాగా ముస్తాబవుతోంది. మరో నెలరోజుల్లో మహాపర్వం ప్రారంభం కానున్న నేపథ్యంలో వచ్చే ప్రయాణికులకు సౌకర్యాల కల్పించేందుకు రైల్వే శాఖ దృష్టి సారించింది. అయితే కేవలం తాత్కాలిక పనులతోనే సరిపెట్టనుంది. జిల్లాలో ప్రధానమైన కొవ్వూరు, నరసాపురంతో పాటు నిడదవోలు రైల్వేస్టేషన్లో అసౌకర్యాలు తాండవిస్తున్నాయి. పుష్కర సమయంలోనైనా వీటికి మోక్షం లభిస్తుందని జనం భావించారు. కొవ్వూరు స్టేషన్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని రైల్వేమంత్రిని కోరానని పెద్దఎత్తున సొమ్ములు రానున్నాయని ఎంపీ మాగంటి మురళీమోహన్ చాలాసార్లు ప్రకటించారు. అయితే ఆచరణకు వచ్చేసరికి ఆశించిన స్థాయిలో రైల్వే శాఖ కొవ్వూరుకి నిధులు విదల్చలేదు. ప్రయాణికులు నిత్యం అసౌకర్యాలతో అవ స్థలు పడుతున్నప్పటికీ రైల్వే శాఖ ఈ మూడు స్టేషన్లలో సదుపాయాల మెరుగు పరచడంపై దృష్టి సారించలేదు. కొవ్వూరులో 50 మీటర్ల సిమెంట్ రోడ్డు, 60 మీటర్ల షెడ్ల ఏర్పాటు తప్ప శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన పనులు ఏమీ లేవు. చేపడుతున్న పనులు ఇవే రైల్వేస్టేషన్‌లోకి వికలాంగులైన ప్రయాణికులను తీసుకువెళ్లడానికి అనువుగా ర్యాంపు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న స్టేషన్ కార్యాలయ భవనం పైకప్పు పూర్తిగా దెబ్బతినడంతో వర్షాకాలంలో నీరుకారుతోంది. పెచ్చులూడి అధ్వానంగా తయారైంది. ప్రస్తుతం పైకప్పు రంధ్రాలకు సిమెంటు పూసి రంగులు వేస్తున్నారు. ప్రయాణికుల విశ్రాంతి నిమిత్తం రెండు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులు వేచి ఉండేందుకు రెండో ప్లాంట్ఫాంపై 60 మీటర్ల పొడవున ఐదు చిన్నచిన్న రేకుల షెడ్లు నిర్మించారు. వాటిలో సిమెంటు బల్లలు, దిమ్మలను ఏర్పాటు చేయనున్నట్టు రైల్వేశాఖ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ఆఫ్ వర్క్స్ కె.ప్రసాద్ తెలిపారు. ఒకటవ ప్లాట్‌ఫాం చివరన సుమారు 50 మీటర్ల పొడవున సిమెంటు రోడ్డును నిర్మిస్తున్నారు. అదనంగా మరో ప్రవేశ ద్వారం ఏర్పాటు చేస్తున్నారు. టాయిలెట్స్, నీటి సరఫరా వంటి ఏర్పాట్లు చేయనున్నారు. దీనికోసం సుమారు రూ.50 లక్షలు వెచ్చించనున్నట్టు ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం వేసిన ఐదు చిన్న షెడ్లలో వర్షం వస్తే ప్రయాణికులు తడిసిపోవాల్సిందే. తక్కువ వెడల్పు ఉండడం వల్ల జల్లు కొట్టే అవకాశం ఉంది. అదే గతంలో నిర్మించిన షెడ్లు మాదిరిగా ఏర్పాటు చేస్తే కొంతమేరకు ప్రయాణికులకు ఉపయోగంగా ఉండేవి. ఆలస్యంగా ప్రారంభించడం వల్ల పనులు సకాలంలో పూర్తవుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నేటికీ ఎక్కడి సమస్యలు అక్కడే కొవ్వూరు స్టేషన్లో 650 మీటర్లు పొడవున మూడు ఫ్లాట్ఫాంలుండగా కేవలం 100 మీటర్ల దూరం మాత్రమే షెడ్లు ఉన్నాయి. ఇప్పుడు మరో 60 మీటర్ల పొడవుతో షెడ్లు నిర్మిస్తున్నారు. ప్రయాణికులు వేచి వుండేందుకు ఒకే విశ్రాంతి గది ఉంది. నిత్యం 12 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 20 పాసింజర్ రైళ్లు ఇక్కడ ఆపుతారు. సాధారణ రోజుల్లో సరాసరి మూడు వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. పుష్కరాల సమయంలో దీనికి పది రెట్లు ప్రయాణికులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఏ ప్లాట్‌ఫాంపైనా తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ఇప్పటికేప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఒకటవ ప్లాట్‌ఫాంపై రెండు, రెండో ప్లాట్‌ఫాంపై నాలుగు మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ నిర్వహణ లోపం కారణంగా నిరుపయోగంగా ఉన్నాయి. రన్నింగ్ వాటర్, విద్యుత్ సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులకు అక్కరకు రావడం లేదు. కొవ్వూరు స్టేషన్లో ప్రహరీ కొంతమేరకు కూలిపోయింది. గోడ పక్కనే చెత్త పారబోయడంతో అపరిశుభ్రత నెలకొంది. ప్రహరీ నిర్మించి, చెత్తను తరలించాల్సిన అవసరం ఉంది. ఈ పనులన్నింటిని కేవలం నెలరోజుల వ్యవధిలో పూర్తి చేయడం కష్టమయ్యేలా కన్పిస్తోంది. ఎందుకంటే రుతు పవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పనులు చే పట్టడానికి ఆటంకం ఏర్పడవచ్చు. కొవ్వూరుకి చేరువలో ఉన్న పశివేదల, చాగల్లు, బ్రాహ్మణగూడెం స్టేషన్లలో కనీస సదుపాయాలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్కింగ్ ఏర్పాట్లు చేయాలి ప్రస్తుతం పార్కింగ్‌కి వినియోగిస్తున్న షెడ్లో పుష్కరాలకు తాత్కాలిక బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కింగ్ షెడ్ పక్కనే ప్రయాణికుల విశాంత్రి కోసం తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పుష్కర సమయంలో పార్కింగ్ ఉండదని అధికారులు చెబుతున్నారు. వేలల్లో వచ్చే ప్రయాణికుల వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయకపోతే వారు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. రైల్వేస్టేషన్ సమీపంలో విశాలమైన ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో తుప్పలు తొలగించి పార్కింగ్ ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు అవస్థలు తప్పుతాయి. -
అంతరిక్షం అంచున.. అంతిమ సంస్కారం!
చనిపోయాక కొందరిని దహనం చేస్తారు. మరికొందరిని సమాధి చేస్తారు. ఒకవేళ ద హనం చేస్తే.. అస్థికలను గంగలో కలిపి చనిపోయినవారి ఆత్మకు శాంతి, మోక్షం చేకూరాలని కోరుకుంటారు. అయితే, మన ఆప్తులకు అంతరిక్షం అంచున కూడా అంతిమ సంస్కారం చేయొచ్చంటున్నారు అమెరికాలోని కెంటకీకి చెందిన ‘మీసోలోఫ్ట్’ కంపెనీవారు. మీరు ఓకే అంటే.. మీ ఆప్తుల చితాభస్మాన్ని కంటెయినర్లో ఉంచి ప్రత్యేక వెదర్ బెలూన్‌కు కట్టి వీరు అంతరిక్షం అంచుకు సుమారుగా 23 కిలోమీటర్ల ఎత్తుకు పంపిస్తారు. అక్కడికెళ్లగానే చితాభస్మం ఉన్న కంటెయినర్ తెరుచుకుంటుంది. చితాభస్మం బయటికి వస్తుంది. అయితే.. అది అప్పటికప్పుడే నేలపై పడిపోదు. కొన్ని నెలలపాటు భూమి చుట్టూ ధూళికణాల రూపంలో తిరుగుతూ క్రమంగా కిందికి వస్తుంది. చివరికి వర్షపు చినుకుల్లోనో, మంచు బిందువుల్లోనో కలిసిపోయి నేలకు చేరుతుంది. ఆకాశంలో చితాభస్మం జారవిడిచేటప్పుడు బెలూన్‌కు ఉండే కెమెరాలతో ఫొటోలు, వీడియోలు కూడా వీరు తీసిస్తారు. ప్యాకేజీని బట్టి ఈ అంతిమ సంస్కారానికి రూ. 17 లక్షల నుంచి రూ. 47 లక్షల వరకూ ఖర్చవుతుందట. -
గద్వాల మార్కెట్‌కు మోక్షం
గద్వాల : ఎట్టకేలకు గద్వాల పత్తి మార్కెట్‌కు మోక్షం లభించింది. ఆరేళ్ల క్రితమే ప్రారంభించినా.. తర్వాత అది మూలనపడింది. చివరకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు గురువారం ఆదేశించడంతో సీసీఐ కొనుగోళ్లు జరపనుం ది. హైదరాబాద్‌లో మార్కెటింగ్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారుల తో జరిగిన సమీక్షా సమావేశంలో గద్వా ల పత్తి మార్కెట్‌పై మంత్రి స్పందిం చారు. దీంతో గద్వాల కాటన్ మార్కెట్ కు మోక్షం లభించే అవకాశం ఏర్పడింది. గద్వాల ప్రాంతంలో మూడు, నాలుగు దశాబ్ధాల క్రితం పత్తి విత్తనోత్పత్తి సాగు ప్రారంభమైంది. పత్తి విత్తనోత్పత్తిలో రైతులకు, ఆర్గనైజర్లకు అధిక ఆదాయం వస్తుండడంతో ఏటేటా విస్తీర్ణం పెంచా రు. దీనికితోడు దేశంలోనే గద్వాలలో ఉత్పత్తి అయిన పత్తి విత్తనాలకు మంచి మార్కెట్ ఉండడంతో కంపెనీలు కూడా పత్తి విస్తీర్ణాన్ని పెంచేందుకు ముందుకు వచ్చాయి. ఇలా ఎనిమిదేళ్ల క్రితం 30వేల ఎకరాల్లో పత్తి పంట సాగు ఉండడంతో గద్వాల మార్కెట్లో పత్తి మార్కెట్ కో సం రూ. 2కోట్ల వ్యయం చేశారు. పత్తి మార్కెట్ నిర్మాణం పూర్తి కావడంతో 05 అక్టోబర్ 2008న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో మార్కెట్ ప్రారంభోత్సవం చేయించారు. ప్రారంభోత్సవం జరిగిన మరుసటి రోజు నుంచి ఇప్పటి వరకు కొనుగోళ్లు, అమ్మకాలు ప్రారం భం కాలేదు. ఆరేళ్ల పాటు ఉత్సవ విగ్రహంలా మార్కెట్ నిర్మాణాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతూ వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం గద్వాల కాటన్ మా ర్కెట్లో కొనుగోళ్లను ప్రారంభించాల్సిం దిగా సీసీఐని ఆదేశించడంతో మూలనపడిన మార్కెట్ ప్రాంతం రైతులకు ఉపయోగపడేలా మారే అవకాశం ఏర్పడింది. మూడేళ్ల క్రితం నుంచి గద్వాల పత్తి విత్తనోత్పత్తి సమస్యల్లో రాజకీయాలు జోక్యం చేసుకోవడంతో కంపెనీలు విస్తీర్ణాన్ని పూర్తిగా తగ్గించాయి. ప్రస్తుతం కేవలం 10వేల ఎకరాల్లో సీడ్ విత్తనోత్పత్తి పంట సాగవుతుండగా, కమర్షియల్ పత్తి పంట సాగు 2వేల ఎకరాల్లో ఉంది. సాగు చేసుకున్న పత్తి రైతులకు గద్వాల మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమైతే గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం పత్తి రైతులు తమ ఉత్పత్తులను జిన్నింగ్ మిల్లులకు అప్పగించి ఎంతిస్తే అంత తీసుకునే పరిస్థితి ఉంది. గద్వాల మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభించే విషయమై గద్వాల మార్కెట్ సెక్రటరీ హిమాశైలిని వివరణ కోరగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందడంతో పాటు సీసీఐ నుంచి స్పందన రావాల్సి ఉందని, వచ్చిన వెంటనే తదుపరి చర్యలను చేపడతామని ఆమె తెలిపారు. -
జీవవైవిధ్యానికి దర్పణం
వ్యక్తిగత సక్సెస్‌స్టోరీలంటే బాగా డబ్బు సంపాదించిన వారి గురించి ప్రస్తావించుకోవడం, దేశాల సక్సెస్‌స్టోరీలంటే పారిశ్రామిక ప్రగతి సాధించిన వాటి గురించి మాట్లాడుకోవడం... ప్రపంచం దృష్టిలో చెప్పుకోదగ్గ సక్సెస్ అంటే ప్రస్తుతానికి ఇదే! ఇలాంటి వెల్లువకు భిన్నమైన విజయగాథ ఇది. చీకటి ఖండంలోని ఒక దేశం కథ. ఆ దేశం పేరు నమీబియా. ఎడారి దేశమే అయినా జీవవైవిధ్యాన్ని కాపాడటంలో, ప్రకృతి పరిరక్షణలో ఉత్తమమైనదిగా గుర్తింపు పొందింది ఈ దేశం. భూమి అంటే అది దున్నేవాడిదే కాదు, వాడితో పాటు మనుగడ సాగిస్తున్న జంతుజాలాలకు, వృక్షాలకు దాంట్లో వాటా ఉంటుందని నమ్మి, వాటి వాటా వాటికి ఇచ్చేసి జీవవైవిధ్యానికి ప్రాధాన్యమిస్తున్న దేశం నమీబియా. ప్రకృతి పరిరక్షణ కోసం ప్రతి దేశం కొన్ని నియమాలు పెట్టుకొంది, అయితే అవన్నీ చెప్పుకోవడానికి మాత్రమే. నమీబియాలో మాత్రం నీతులు, సూక్తులు మాటల్లో కాదు ఆచరణలో దర్శనమిస్తాయి. విస్తీర్ణం విషయంలో ప్రపంచంలో 34వ స్థానంలో ఉన్నప్పటికీ, జంతుజాలాల కోసం ఎక్కువ భూభాగాన్ని అభయారణ్యాలుగా వదిలేసిన జాబితాలో మాత్రం ఈ దేశం తొలి స్థానంలో నిలుస్తుంది. ఈ దేశంలో 42 శాతం భూభాగం అభయారణ్యమే. చాలా ఏళ్ళపాటు తెల్లవాళ్ల పాలనలో ఉండిపోయిన ఈ దేశం, స్వాతంత్య్రం పొంది కేవలం పాతికేళ్లు మాత్రమే అయింది. వెంటనే ఏర్పాటైన ప్రభుత్వం ప్రజల విషయంలోనే కాక, జంతు పరిరక్షణపై కూడా దృష్టిసారించి, ‘ప్రకృతి పరిరక్షణ కోసం ఎవరు మంచి మాటలు చెప్పినా విని, వాటిని అమలులో పెడదాం. నమీబియన్లుగా ప్రకృతి పరిరక్షకులుగా నిలుద్దాం..’ అనేది ఆ దేశరాజ్యాంగంలోని ఆర్టికల్ 95 గా రాసుకొన్నారు. ఇతర ఆఫ్రికన్ దేశాలన్నీ మైనింగ్, పారిశ్రామికీకరణ అంటుంటే.. నమీబియా మాత్రం వాటికి దూరంగా అడవుల్లోనే ఉండిపోవాలని బలంగా నిర్ణయించుకొంది. చెట్లను నరికి అడవులకు నిప్పెట్టి గాలినీ, నీటిని కలుషితం చేసి తెచ్చుకొనే అభివృద్ధి తమకు అనవసరమని నమీబియా పాలకులు, ప్రజలు ప్రకృతి పరిరక్షణలో మునిగి తేలుతున్నారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితితో పాటు అనేక సంస్థలు వీరి కృషిని గుర్తించి, అనేక అవార్డులతో సత్కరిస్తూనే ఉన్నాయి. పారిశ్రామిక ప్రగతి లేకపోతే ఆ దేశం అభివృద్ధి చెందేదెలా? అని కొన్ని అమాయకపు బుర్రలు ప్రశ్నించవచ్చు. కానీ ఆర్థిక ప్రగతిలో కూడా ఈ దేశం వెనుకపడలేదు. జీవవైవిధ్యానికి నిలువెత్తు దర్పణమైన ఈ దేశం ‘పర్యాటకుల స్వర్గం’ మారింది. దీంతో పర్యాటక పరిశ్రమ నిధుల వనరుగా మారి విదేశీమారకాన్ని ఆర్జించి పెడుతోంది. -
హెల్మెట్‌తో ప్రాణ రక్షణ
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్ : ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్‌ను ధరించి ప్రాణ రక్షణ పొందాలని జిల్లా ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ సూచించారు. రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని విజయనగర పట్టణ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. ఈ సందర్భంగా వివిధ రకాల హోర్డింగ్ (ప్లెక్సీ), బ్యానర్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలతో పాటు, ఆటోలు, లారీలు, ట్రాక్టర్ల వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు సంభవించినపుడు ప్రాణాలతో బయటపడడంతో పాటు కాలుష్యం బారి నుంచి బయట పడతారన్నారు. 25వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరిం చుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రజలకు, వాహనచోదకులకు, విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ర్యాలీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో వారం రోజులపాటు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. వాహనచోదకులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అతి వేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రవాణాకు మాత్రమే ఉపయోగించాల్సిన వాహనాల్లో ప్రయాణికులను తరలించడం, హెడ్లైట్లు, సిగ్నల్ లైట్లు సరిగ్గా పనిచేయకపోవడం ప్రమాదాలకు కారణంగా గుర్తించామన్నారు. ప్రమాదాలను నియంత్రించేందుకు నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎస్పీ ఎస్.శ్రీనువాస్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన హోర్డింగ్‌లను పట్టణంలో ముఖ్య కూడళ్లలోను, జన సంచారం అధికంగా ఉన్న ప్రదేశాల్లో ఏర్పాటు చేసి తద్వారా ప్రజలకు ట్రాఫిక్ గుర్తులపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ ఎ.రవికుమార్, ఒకటో పట్టణ సీఐ ఎ.రవికుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఎ.వి.లీలారావు, ఆర్.ఐ పి.నాగేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐ వి.ఎన్.మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
కర్మలను నాశనం చేసుకుంటేనే బంధవిముక్తి
అతి ప్రాచీనమైనదిగా, ఉత్తమోత్తమమైన మతంగా గుర్తింపు పొందినది జైనమతం. ఈ మతం ఎప్పుడు నెలకొల్పబడిందో ఇతమిత్థంగా తెలియనప్పటికీ, ఋగ్వేద మంత్రాలలో సైతం జైనమత వ్యవస్థాపకుడైన ఋషభుని గురించిన ప్రస్తావన ఉన్నదంటేనే ఆ మతం ఎంత ప్రాచీనమైనదో అర్థం చేసుకోవచ్చు. జైనమతానికి మొత్తం 24 తీర్థంకరులున్నారు. తీర్థంకరులు అంటే జీవన స్రవంతిని దాటడానికి వారథిని నిర్మించినవారు అని అర్థం. వర్థమాన మహావీరుడు జ్ఞాత్రికా తెగకు చెందినవాడు. వైశాలి దగ్గరగల కుందగ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడాయన. యశోదతో ఈయన వివాహం జరిగింది. వారికి ప్రియదర్శన అనే కుమార్తె కలిగింది. ముప్పైసంవత్సరాల వయసులో వర్థమాన మహావీరుడికి జీవితంపై విరక్తి కలిగి, ఇల్లు వదిలి సన్యాసం స్వీకరించాడు. శరీరాన్ని కృశింపజేసే కఠోరమైన జైనమత ఆచార నియమాలు పాటిస్తూ సుమారు పుష్కరకాలంపాటు దేశ సంచారం చేశాడు. వర్థమానుడు దాదాపు సంవత్సరకాలంపాటు ఒక వస్త్రాన్ని ధరిచి, ఆ తర్వాత ఆ వస్త్రాన్ని కూడా విసర్జించి దిగంబరంగా జీవించాడు. పన్నెండేళ్లపాటు రుజుపాలిక నదీతీరంలోగల జృంభిక గ్రామసమీపంలో ఒక సాలవృక్షం కింద కఠోర తపస్సు చేసి జ్ఞానోదయం పొందాడు. కర్మకాండను, కులాధిక్యభావనను తిరస్కరించి పవిత్రమైన జీవితం గడపాలని బోధించాడు. ఈ ప్రపంచమంతా చేతన, అచేతన జీవులతో నిండి ఉందని,అంతేగాని, జాతి, కుల, మత, వర్ణ, లింగ వివక్షత పాటించడం అవివేకమన్నాడు. కర్మ ఆత్మను అంటిపెట్టుకుని ఉంటుందని, కామ, క్రోధ, లోభ మోహాదులు కర్మకు కారణాలని, కర్మల ఫలితాలను అనుభవించడం కోసమే ఆత్మ జన్మ, పునర్జన్మలను అనుభవించవలసి వస్తోంది. దీర్ఘ తపస్సు చేత, పూర్వార్జిత కర్మలను నాశనం చేసుకున్నప్పుడు జీవుడు బంధవిముక్తుడవుతాడని, కాబట్టి జనన మరణాల నుండి విముక్తి పొందడమే జీవిత లక్ష్యంగా భావించాలని బోధించాడు. సల్లేఖన వ్రతం: జైనమత కఠోర నియమం సల్లేఖన వ్రతం. జైన సన్యాసులుగా దీక్ష స్వీకరించేవారు కఠిన నియమాలను పాటించవ లసి ఉంటుంది. ఏవిధమైన సాధనాలూ ఉపయోగించకుండా తలవెంట్రుకలను తనంతట తానుగా తొలగించుకోవడం, పరిమితమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ తీక్షణమైన ఎండ వానలను లెక్కచేయకుండా కఠోర తపస్సులో నిమగ్నం కావడం జైనమత నియమాలు. అన్నింటికంటే చాలా కష్టతరమైనది సల్లేఖన వ్రతం. ఆహారం కాని, నీరు కానీ తీసుకోకుండా శరీరాన్ని శుష్కింపజేసుకోవడం సల్లేఖన వ్రతంలోని ప్రధానాంశం. సల్లేఖన వ్రతం ద్వారానే మోక్షానికి చేరువ కావచ్చునన్నది జైనమత విశ్వాసం. జైనమతానికి 24వ తీర్థంకరుడైన వర్థమాన మహావీరుడు ఆశ్వయుజమాసంలో అమావాస్యనాడు తన భౌతిక కాయాన్ని వదిలి నిర్యాణం చెందాడు. ఆయన నిర్యాణ సమయంలో దేవతలందరూ వచ్చి ఆయన చుట్టూ నిలిచారని, వారి శరీరాలనుండి వెలువడిన వెలుగు రేఖలతో అమావాస్య చీకట్లు తొలగి కాంతికిరణాలు వెలువడ్డాయని, అందుకు గుర్తుగానే జైనమతానుయాయులు దీపావళినాడు దీపాలు వెలిగిస్తారు.