samai kaya state
-
అసెంబ్లీలో సీఎంవి అన్నీ అబద్ధాలే
చౌటుప్పల్/చౌటుప్పల్ రూరల్, న్యూస్‌లైన్ : అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగినన్ని రోజులు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నీ అబద్ధాలే మాట్లాడిండు.. తెలంగాణ ప్రజల దురదృష్టాన్ని అదృష్టంగా చూపే ప్రయత్నం చేసిండు.. తెలంగాణ ఏర్పాటైతే, మీకు కరెంటే ఉండదన్నడు.. ఇప్పుడు కలిసే ఉన్నాం కదా.. మరి రైతాంగానికి 7గంటల కరెంటు ఎక్కడ ఇస్తుండ్రు.. అని టీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి.హరీష్‌రావు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నిం చారు. చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని శుక్రవారం రాత్రి ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ధూంధాం కార్యక్రమంలో ప్రసంగించారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడినపుడు తెలంగాణ ఏర్పాటైతే కరెంటే ఉండదన్నడు, ఇప్పుడు సమైక్య రాష్ట్రం లోనే ఉన్నాం కదా, వ్యవసాయానికి 7గంటల కరెంటు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయానికి 5గంటలకు మించి విద్యుత్ సరఫరా జరగడం లేదన్నారు. దీంతో ఇప్పుడే వరినాట్లు, దుక్కులు పారక రైతులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం తెలంగాణ ప్రజల దురదృష్టాన్ని అదృష్టంగా చూపే ప్రయత్నం చేశాడన్నారు. 1956కు ముందు తెలంగాణలో 5శాతం మాత్రమే వ్యవసాయ బావులు, బోర్లు ఉండేవని, సమైక్య రాష్ట్రంలో నేడు 55శాతానికి చేరాయని, ఉచితంగా విద్యుత్‌ను ఇస్తున్నామని చెప్పారన్నారు. సీమాంధ్రలో ప్రభుత్వమే ప్రాజెక్టులు కట్టి, కాలువలు తవ్వి, ఎకరానికి రూ.200 తీసుకొని, రెండు పంటలకు నీరిస్తుందన్నారు. తెలంగాణలోనేమో రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేసి బోరు బావులు తవ్వి, కరెంటు సాంక్షన్లు తెచ్చుకొని, మోటార్లు ఏర్పాటు చేసుకుంటే, ఎకరానికి రూ.2లక్షల ఖర్చు వస్తుందన్నారు. ఇదే తెలంగాణ రైతుల అదృష్టం అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలది 60ఏళ్ల న్యాయమైన పోరాటం కాబట్టే, నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతుందన్నారు. -
జననేత బాటలో.. ప్రజల ముంగిట్లో
కర్నూలు, న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్ర పరిరక్షణకు ఉద్యమిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును శనివారం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు వేడుకగా నిర్వహించారు. నిత్యం ప్రజల కోసం తపించే ఆయన బాటలోనే సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేసి.. అనాథాశ్రమాల్లో అన్నదానం నిర్వహించారు. యాచకులకు దుప్పట్లు.. నిరుపేద వితంతువులకు చీరలు అందజేయడంతో పాటు పలుచోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయాల్లో కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నంద్యాలలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పద్మావతినగర్‌లోని పార్టీ కార్యాలయంలో జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేషనల్ డిగ్రీ కళాశాలలో ఇంతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటైంది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అదనపు పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.వి.మోహన్‌రెడ్డి తదితరులు పత్తికొండ కస్తూరిబా పాఠశాలలో జననేత వేడుకలను జరుపుకున్నారు. ఆదోనిలో నియోజకవర్గ సమన్వయకర్త సాయిప్రసాదరెడ్డి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. డోన్‌లో నియోజకవర్గ సమన్వయకర్త బుగ్గన రాజారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. కర్నూలులో నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి అభిమానులకు పంచి పెట్టారు. రైల్వే స్టేషన్, కలెక్టరేట్, కొత్తబస్టాండ్ ప్రాంతాల్లోని యాచకులకు దుప్పట్లు అందించారు. మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం బుధవారపేటలో పేద వితంతువులకు చీరలను పంచారు. పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ నారాయణమ్మ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలోని ప్రసూతి విభాగంలో పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు.