11న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం
కూకట్పల్లి: తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఈనెల 11వ తేదీన ప్రారంభించనున్నట్లు రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం తెలిపారు. అదేరోజు రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని, కూకట్పల్లి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, పార్టీ అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.