మళ్లీ మన ఊరు–మన ప్రణాళిక
16 నుంచి 22 వరకు కార్యక్రమం
హైదరాబాద్: సమ్మిళిత సంక్షేమం లక్ష్యం గా రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ‘మన ఊరు– మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని 16 నుంచి 22 వరకు చేపడుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ సమక్షంలో ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య, ఇతర అధికారులు మంగళవారం సచివాలయంలో ఈ అంశంపై సమావేశమయ్యారు. రాష్ట్రంలో 545 గ్రామీణ మండలాల్లో, 8,684 గ్రామాల్లో కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామాల వారీగా సంక్షేమ ప్రణాళికలను తయారు చేయ టంతోపాటు, ప్రజల సంక్షేమావసరాల గుర్తిం పును ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నారు.
సంక్షేమ, ఆర్థిక ప్రయోజన పథకాలకు లబ్ధిదారుల ఎంపికను చేపట్టాలని నిర్ణయించారు. మంత్రు లు, ప్రజాప్రతినిధులతోపాటు అధికారులంతా కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. ప్రతి గ్రామం లో సభల నిర్వహణకు వీలుగా ప్రతి మండలం లో మూడు బృందాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బృందం ఒక్కోరోజు ఒక గ్రామాన్ని సందర్శించేలా షెడ్యూలు రూపొందిస్తారు.