ఫైనల్లో భవాన్స్, సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్
సెయింట్ పాల్స్ ఇంటర్ స్కూల్ టీటీ టోర్నీ
ఎల్బీ స్టేడియం: సెయింట్ పాల్స్ స్టాగ్ ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ బాలికల విభాగంలో భవాన్స్ స్కూల్(ఏ), సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. హైదర్‌గూడలోని సెయింట్ హైస్కూల్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన బాలికల స్కూల్ టీమ్ చాంపియన్‌షిప్ విభాగంలో తొలి సెమీఫైనల్లో భవాన్స్ స్కూల్(ఏ) జట్టు 3-0 స్కోరుతో గీతాంజలి స్కూల్ జట్టుపై విజయం సాధించింది.
రెండో సెమీఫైనల్లో సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ జట్టు 3-0తో రోజారీ కాన్వెంట్ స్కూల్ (ఏ)పై గెలిచింది. అంతకు ముందు జరిగిన ఈ పోటీల ప్రారంభ వేడుకలకు బ్రదర్ ప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టేబుల్ టెన్నిస్ సంఘం అడ్హాక్ కమిటీ అధ్యక్షుడు ఎ.నరసింహారెడ్డి, టెక్నికల్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, సెయింట్ పాల్స్ హైస్కూల్ ప్రిన్సిపల్ బ్రదర్ సుధాకర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇబ్రహీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.