సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌కు రంగం సిద్ధం
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లుపై పార్లమెంట్లో ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్, ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ బుధవారం లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ను కలిశారు. సభ సజావుగా జరిగేలా చూడాలని వారు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంత ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
దాంతో పార్లమెంట్ సమావేశాలు స్తంభించాయి. సభ్యుల ఆందోళనలతో పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్న సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌కు రంగం సిద్ధం అవుతోంది. బుధవారం మధ్యాహ్నం లోక్‌సభలో సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.