నేటి నుంచి దసరా సెలవులు
అనంతపురం ఎడ్యుకేషన్ : పాఠశాల విద్యార్థులకు శుక్రవారం నుంచి దసరా సెలవులు ప్రకటించారు. అన్ని యాజమాన్యాల కింద నడుస్తున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు గురువారం సమ్మేటివ్–1 పరీక్షలు ముగిశాయి. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నుంచి అక్టోబర్ 11 వరకు సెలవులు ఉన్నాయి. అయితే.. 12వ తేదీ మొహరం ఉండడంతో 13న పాఠశాలలు పున ఃప్రారంభమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) అంజయ్య తెలిపారు.
2 నుంచి జూనియర్ కళాశాలలకు సెలవులు
జూనియర్ కళాశాలల విద్యార్థులకు అక్టోబర్ 2 నుంచి 12 వరకు దసరా సెలవులు ఉంటాయని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి (ఆర్ఐఓ) వెంకటేశులు తెలిపారు.