Shesachalam forest
-
60 ఏళ్ల తరువాత అనుకోని అతిథి..
తిరుపతి: అర్ధరాత్రి వేళ విధుల్లో ఉన్న తలకోన బీట్ అటవీ సిబ్బందికి అనుకోని అతిథి కనిపించింది. రాజసం ఒలికిసూతు రోడ్డు దాటుతున్న ఆ జంతువును చూసి ఆశ్యర్యపోయారు. శేషాచలంలో చాలా ఏళ్లుగా కనిపించని ఆ జంతువు మరలా కనిపించింది. తర్వాత తేరుకుని ఆ ప్రదేశానికి వెళ్లి జంతువు అడుగుజాడలు పరిశీలించారు. అవి రాయల్ బెంగాల్ టైగర్ అడుగులుగా గమనించారు. ఒకటికి రెండుసార్లు పరిశీలించుకున్నారు. తాము ఊహించించదే నిజమని వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. నిర్ధారించేందుకు పాదముద్రలను బయోల్యాబ్కు పంపారు. శేషాచలం అడవుల్లో ఎప్పుడో 1955కు ముందు ఒకసారి పెద్దపులి కనిపించినట్లు అధికారులు గుర్తుచేసుకున్నారు. అయితే దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం లేవు. తాజాగా తిరుపతి వన్యప్రాణి డివిజన్ పరిధిలోని బీట్లో తలకోనకు వెళ్లే ప్రధాన రోడ్డును దాటుతున్న పెద్దపులిని వారం క్రితం సిబ్బంది చూశారు. అడుగుజాడల ప్రకారం తలకోనకు చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల దూరంలోనే అది సంచరిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు నుంచి వేంపల్లి, దిన్నెల, కడప కారిడర్ మీదుగా టైగర్ శేషాచలం చేరినట్లు అధికారులు పేర్కొంటున్నారు. నివాసానికి అనువైన ప్రాంతం, జింకలు,అడవిపంది వంటి జంతువులు అధికంగా ఉండటం, నీటి సౌకర్యం సమృద్ధిగా ఉండటం వల్లే పులి ఇక్కడికి చేరినట్లు వారు భావిస్తున్నారు. -
శేషాచలం అడవుల్లో పోలీసులపై రాళ్లదాడి
చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో మంగళవారం కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం కూలీలు రాళ్లదాడికి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం వారిమెట్టు సమీపంలోని సచ్చినోడిబండ వద్ద శేషాచలం అటవీ ప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో టాస్క్ఫోర్స్కు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. దాంతో ఎర్రచందనం కూలీలు పోలీసులపై రాళ్లు రువ్వారు. అప్రమత్తమైన పోలీసులు ఒక రౌండు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ సందర్బంగా ముగ్గురు కూలీలను అదుపులోకి తీసుకోవడంతో పాటు 18 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ అధికారి భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసులు శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. విషయం తెలుసుకున్న టాస్క్ఫోర్స్ డీఐజీ కాంతారావు సంఘటన స్థలానికి బయలుదేరారు. -
ఇది మానవ హక్కుల ఉల్లంఘనే
శేషాచలం ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ కేసును సుమోటోగా విచారణ చేపట్టిన కమిషన్ ఏపీ సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీ సమాధానమిచ్చేందుకు రెండువారాల గడువు హైదరాబాద్: శేషాచలం అటవీప్రాంతంలో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్ ఉదంతాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. మీడియా కథనాల ఆధారంగా కేసును సుమోటోగా విచారణ చేపట్టిన కమిషన్ ఇది మానవహక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని వ్యాఖ్యానించింది. ఈ ఎన్కౌంటర్ అంశాన్ని ఎన్హెచ్ఆర్సీ కేరళలోని తిరువనంతపురం పర్యటనలో ఉన్న సభ్యుడు జస్టిస్ డి.మురుగేశన్ దృష్టికి తీసుకువెళ్లింది. ఆయన ప్రాథమిక పరిశీలన ప్రకారం ఎన్కౌంటర్ ఉదంతంలో తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనలున్నట్టుగా వెలుగులోకి వచ్చినట్టు స్పష్టం చేసింది. మీడియా కథనాల ప్రకారం రాళ్లు, కత్తులు, గొడ్డళ్లతో దాడికి యత్నించిన కూలీలపై పోలీసులు, అటవీశాఖ అధికారులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోందని, ప్రాణ రక్షణ పేరుతో చేపట్టిన చర్యలో 20 మంది కూలీలు ప్రాణాలు కోల్పోవడం న్యాయసమ్మతం కాదని వ్యాఖ్యానించింది. ఈ చర్యలకు సంజాయిషీతోపాటు సమగ్ర నివేదిక కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా జవాబివ్వాలని ఆదేశించింది. ఈ నెల 23న హైదరాబాద్లో జరగనున్న ఎన్హెచ్ఆర్సీ క్యాంప్ సిట్టింగ్లో ఈ ఎన్కౌంటర్పై విచారణ చేపట్టనున్నట్టు కమిషన్ పేర్కొంది. నాలుగు నెలల్లో రెండోసారి... ఎర్రచందనం కూలీలపై రాష్ట్రంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా పరిగణించడం గడిచిన నాలుగు నెలల్లో ఇది రెండోసారి. గతేడాది డిసెంబర్లో అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. తమిళనాడులోని ధర్మపురి, వేలూరు, కృష్ణగిరి జిల్లాలకు చెందిన నిరుపేదల్ని స్మగ్లర్లు శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం చెట్లు నరికే కూలీలుగా తీసుకొస్తున్నారు. ఇలా వచ్చిన కొందరిపై అటవీ శాఖ అధికారులుగా పేర్కొంటున్న వ్యక్తులు విచక్షణారహితంగా కొట్టిన వీడియోతోసహా వచ్చిన ఫిర్యాదును ఎన్హెచ్ఆర్సీ గతేడాది డిసెంబర్లో పరిగణనలోకి తీసుకుంది. తాము చేస్తున్నది చట్టవిరుద్ధమని తెలియని నిరుపేదల విషయంలో అటవీశాఖ అధికారుల తీరును కమిషన్ సభ్యుడు జస్టిస్ డి.మురుగేశన్ తప్పుపట్టారు.