స్వల్పంగా తగ్గిన వినియోగదారు విశ్వాసం
న్యూఢిల్లీ: భారత్లో వినియోగదారు విశ్వాసం ఫిబ్రవరిలో స్వల్పంగా క్షీణించింది. దేశంలో గృహా ఆర్థిక పరిస్థితులు ఏమంత బాగోలేవని ఎంఎన్ఐ ఇండియా తన నివేదికలో పేర్కొంది. జనవరిలో 109.8 వద్ద ఉన్న ఎంఎన్ఐ ఇండియా కన్సూమర్ సెంటిమెంట్ ఇండికేటర్ ఫిబ్రవరిలో 108.9కి తగ్గింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 7.4 శాతం దిగువకు చేరింది. వ్యాపార పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయనే అంచనాల వలన కుటుంబ ఆర్థిక కార్యకలాపాలపై తీవ్రమైన ఒత్తిడి నెలకొని ఉందని సర్వే చెబుతోంది.