ఐరాస సాధారణ అసెంబ్లీ చీఫ్‌గా లాజ్‌కాక్
యునైటైడ్ నేషన్స్: స్లోవేకియా విదేశాంగ మంత్రి మిరోస్లావ్ లాజ్‌కాక్(54) ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఫిజి దౌత్యవేత్త పీటర్ థాంప్సన్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.
సెప్టెంబర్‌లో మొదలయ్యే యూఎన్ 72వ సాధారణ అసెంబ్లీ సెషన్‌కు లాజ్‌కాక్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. గతేడాది యూఎన్ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడ్డ∙వారిలో లాక్‌జాక్ ఒకరు.