ఇంటిప్స్
కిచెన్ టవల్స్ బాగా మురికిగా ఉంటే, వాటిని వేడినీళ్లలో బేకింగ్ పౌడర్, వెనిగర్ కలిపి నానబెట్టి ఆ తర్వాత శుభ్రపరచాలి బ్లీచింగ్, సోడియం బై కార్బోనేట్లో రాత్రంతా నానబెట్టి, తర్వాత శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టాలి. వంటగదిలో పట్టిన మొండి మరకలను తొలగించడానికి చింతపండును నానబెట్టి మరకలమీద రుద్దాలి.
వెండి వస్తువులను వేడి నీటిలో నానబెట్టి, నిమ్మరసంతో రుద్ది కడిగితే చక్కగా శుభ్రపడతాయి. కిచెన్ సింక్ సరిగ్గా శుభ్రపడకపోతే చింతపండు గుజ్జులో ఉప్పు కలిపి రుద్ది, తర్వాత డిటర్జెంట్ లిక్విడ్‌ను వాడి కడగాలి. చీమలు మరీ బాధిస్తుంటే నిమ్మరసంలో టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి చీమలు ఉన్న ప్రాంతాలలో స్ప్రే చేయాలి. దాల్చినచెక్క పొడి, మిరియాల పొడులను నీళ్లలో కలిపి స్ప్రే చేస్తే చీమల సమస్య ఉండదు.