జిల్లాలో ‘మావో’ల బంద్ ప్రభావం ఉండదు
ఇన్ చార్జి ఎస్పీ సన్ ప్రీత్‌సింగ్
ఆదిలాబాద్ :మావోయిస్టులు సోమవారం ఇ చ్చిన బంద్ పిలుపుతో ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి ప్రభావం ఉండదని ఇన్ చార్జి ఎస్పీ, కుమురం భీం ఎస్పీ సన్ ప్రీత్‌సింగ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయం నుంచి రెండు జిల్లాల పోలీసు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మావోయిస్టు బంద్ నేపథ్యంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగించాలన్నారు.
ప్రత్యేక సమాచార నిఘా వర్గాలు సూచించిన మేరకు రెండు జిల్లాల్లో భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలని డీఎస్పీలను ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించాలన్నారు. పోలీస్‌స్టేపోలీస్‌స్టేషన్ల పరిధిలోని ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలన్నారు. సీఐలు, ఎస్సై లు పోలీస్స్టేషన్లలో పూర్తిస్థాయి సిబ్బందితో అప్రమత్తంగా ఉం డాలన్నారు. మావోయిస్టులు జిల్లాలో చొరబాటుకు ప్రయత్నించినా, ఇతర చర్యలకు పాల్పడినా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇరు జిల్లాల్లో గట్టి పోలీస్ సమాచార వ్యవస్థ పనిచేస్తోందన్నారు. జిల్లా ప్రజలు మావోయిస్టులను పూర్తిగా మరిచిపోయారని, వారిని దరిచేరనీయకుండా నియంత్రించాలని పేర్కొన్నారు. మావోయిస్టులను అభివృద్ధి నిరోధకులుగా ప్రజలు గుర్తించారని తెలిపారు.
చిన్న జిల్లాలు ఏర్పడడంతో గ్రామాల్లో నూతనపోలీస్‌స్టేషన్ల ఆవిర్భవించడంతో పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం, భరోసా కలిగిందన్నారు. ప్రస్తుతం మావోయిస్టులు ఉనికిని చాటుకోవడానికి జిల్లాలో ఎలాంటి అవకాశం లేదని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా లొంగి పోయి ప్రజల మధ్య ఉండి పోరాడడం మినహా మరోమార్గం లేదని స్పష్టం చేశారు. మావోయిస్టుల బంద్ కు ప్రజలు ఎలాంటి మద్దతు తెలుపవద్దని, గ్రామాలను సందర్శించే ప్రజాప్రతినిధులు ముందస్తుగా తె లియజేసి పోలీస్ రక్షణ తీసుకోవాలని సూచించారు. అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, డీఎస్పీలు, సీఐలు, స్పె షల్ బ్రాంచ్ ఎస్సైలు అన్వర్‌ఉల్‌హఖ్, జి.రామన్న, కుమురం భీం స్పెషల్‌బ్రాంచ్ ఎస్సై శివకుమార్, పోలీ స్ టెలికాన్ఫరెన్స్ నిర్వహణాధికారి సింగజ్‌వార్ సంజీ వ్‌కుమార్, ఎస్పీ సీసీ పోతరాజు తదితరులున్నారు.