Sports world
-
మాజీ ప్రధానికి క్రీడాలోకం శ్రద్ధాంజలి
న్యూఢిల్లీ: అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు క్రీడాలోకం నివాళులు అర్పించింది. పలువురు దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, రెజ్లర్ వినేశ్ ఫొగాట్, షట్లర్ సింధు, గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్లు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మాజీ ప్రధాని మన్మోహన్ మృతి దేశానికి తీరని లోటు. ఆయన సేవల్ని జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. –సచిన్ టెండూల్కర్రెస్ట్ ఇన్ పీస్ మన్మోహన్జీ. మీ జీవితం మా అందరికీ స్ఫూర్తిదాయకం. 2013లో మీతో ముచ్చటించిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. –షట్లర్ పీవీ సింధు మన్మోహన్ సింగ్ మరణవార్త నన్ను తీవ్రంగా బాధించింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచాక ఆయనతో నేను భేటీ అయ్యాను. ఆయన నాయకత్వం, ప్రధానిగా ఎంచుకున్న దీర్ఘకాలిక లక్ష్యాలవల్లే భారత్ వృద్ధి సాధించింది. ఆయన సేవలు జాతి ఎన్నటికీ మరువదు. –షూటర్ అభినవ్ బింద్రా నా జీవితంలో నేను కలిసి అతిగొప్ప వ్యక్తుల్లో మన్మోహన్ ఒకరు. దార్శనికతలో ఆయన్ని మించినవారు లేరు. ప్రపంచం గొప్ప జ్ఞానిని కోల్పోయింది. –గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్ మన్మోహన్ ప్రధాని మాత్రమే కాదు. దేశ ప్రగతి కోసం నిరంతరం పాటుపడిన ఆర్తికవేత్త. ఆయన దూరదృష్టి, ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశాన్ని ముందుకు నడిపించాయి. –మాజీ రెజ్లర్, ఎమ్మెల్యే వినేశ్ ఫొగాట్ మాజీ ప్రధాని మన్మోహన్ గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత్‌ను ప్రగతిపథంలో నిలిపేందుకు అలుపెరగని కృషి చేశారు. బరువెక్కిన హృదయంతో ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. –యువరాజ్ సింగ్ -
ఆశిద్దాం ఆటకు 'అచ్చేదిన్'...
ఆనందంగా, ఉత్సాహంగా మైదానంలో చప్పట్లు కొడుతూ అభిమాన ఆటగాళ్లను అభినందించే రోజు రావాలని... వాయిదాలు, రద్దుల పర్వం ఇకనైనా వినిపించరాదని... బయో బబుల్ అంటూ గుబులు పెట్టించే బాధ అథ్లెట్లకు తప్పాలని... 2021లో అనుకున్న తేదీల్లోనే జరిగి ఆటలకు ‘అచ్ఛే దిన్’ వస్తాయని కోరుకుందాం... కరోనా దెబ్బకు కుప్పకూలిన క్రీడలు మునుపటిలా మనకు సంతోషం పంచాలని ఆశిద్దాం. టోక్యో ఒలింపిక్స్, టి20 ప్రపంచకప్... ఇలా శిఖరాన నిలిచే టోర్నీలతో పాటు ఈ ఏడాది జరగబోయే పలు ప్రధాన టోర్నీలను చూస్తే... క్రికెట్... భారత్ బిజీ బిజీ... కరోనా కారణంగా 2020లో తక్కువ మ్యాచ్‌లు ఆడిన భారత జట్టుకు 2021లో ఎడతెరిపిలేని షెడ్యూల్ ఉంది. ప్రస్తుతం ఆ్రస్టేలియాలో ఉన్న భారత్ సిడ్నీలో జనవరి 7 నుంచి మూడో టెస్టు... జనవరి 15 నుంచి చివరిదైన నాలుగో టెస్టు ఆడుతుంది. ఆ్రస్టేలియా పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చాక తమ సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడుతుంది. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 28 వరకు జరిగే ఈ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య 4 టెస్టులు, 5 టి20 మ్యాచ్‌లు, 3 వన్డేలు జరుగుతాయి. ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన వెంటనే ఏప్రిల్–మే నెలల్లో ఐపీఎల్ జరుగుతుంది. ఇది ముగిశాక... ఒకవేళ భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే జూన్‌లో ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో ఫైనల్ ఆడేందుకు వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం ఆగస్టులో ఇంగ్లండ్‌లో భారత్ పర్యటిస్తుంది. ఇందులో భాగంగా ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టులు జరుగుతాయి. సెప్టెంబర్ చివరి వారంలో ఆసియా కప్ టోర్నమెంట్... అక్టోబర్–నవంబర్లలో స్వదేశంలో టి20 వరల్డ్‌కప్‌లో భారత్ బరిలోకి దిగనుంది. నవంబర్‌లో టి20 ప్రపంచకప్ ముగిశాక భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళుతుంది. అక్కడ సఫారీ జట్టుతో మూడు టెస్టులు, మూడు టి20 మ్యాచ్‌ల్లో తలపడుతుంది. ఫార్ములావన్ కరోనా కారణంగా గతేడాది 17 రేసులకే పరిమితమైన ఫార్ములావన్ కొత్త సంవత్సరంలో 23 రేసులతో దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. మార్చి 21న ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితో మొదలయ్యే సీజన్... డిసెంబర్ 5న అబుదాబి గ్రాండ్‌ప్రితో ముగియనుంది. ఈ మధ్యలో మార్చి 28న బహ్రెయిన్ గ్రాండ్ ప్రి, ఏప్రిల్ 11న చైనా, మే 9న స్పెయిన్, 23న మొనాకో, జూన్ 6న అజర్బైజాన్, 13న కెనడా, 27న ఫ్రాన్స్, జూలై 4న ఆ్రస్టియా, 18న యూకే, ఆగస్టు 1న హంగరీ, 29న బెల్జియం, సెపె్టంబర్ 5న నెదర్లాండ్స్, సెపె్టంబర్ 12న ఇటలీ, 26న రష్యా, అక్టోబర్ 3న సింగపూర్, 10న జపాన్, 24న యూఎస్ఏ, 31న మెక్సికో, నవంబర్ 14న బ్రెజిల్, 28న సౌదీ అరేబియా గ్రాండ్ ప్రి రేసులు జరుగుతాయి. రేసు క్యాలెండర్లో సౌదీ అరేబియా ఈ ఏడాదే అరంగేట్రం చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 25న జరిగాల్సిన గ్రాండ్ ప్రి వేదిక ఇంకా ఖరారు కాలేదు. బ్యాడ్మింటన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకావకాశాలు మెండుగా ఉన్న క్రీడ బ్యాడ్మింటన్. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ముందు ప్లేయర్లు మునుపటి లయను అందుకోవడానికి కొత్త ఏడాదిలో చాలినన్ని వరల్డ్ టూర్ సూపర్ టోరీ్నలు సిద్ధంగా ఉన్నాయి. జనవరి 12–17: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ, 19–24: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ, 27–31: వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ, మార్చి 17–21: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్–1000, ఏప్రిల్ 6–11: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500, 13–18: సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500, మే 11–16: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500, జూన్ 1–6: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500, 8–13: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000; ఆగస్టు 24–29: హైదరాబాద్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100, ఆగస్టు 31– సెపె్టంబర్ 5: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500, సెపె్టంబర్ 21–26: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000, సెపె్టంబర్ 28–అక్టోబర్ 3: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750, అక్టోబర్ 12–17: సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్–300, 19–24: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750, 26–31: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750, నవంబర్ 9–14: ఫుజు చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750, 16–21: హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500, డిసెంబర్ 15–19: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ జరుగుతాయి. టెన్నిస్ ఫిబ్రవరి 8–21: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ, మార్చి 24–ఏప్రిల్ 4: మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ, ఏప్రిల్ 11–18: మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ, మే 2–9: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ, మే 23–జూన్ 6: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ, జూన్ 28–జూలై 7: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ, ఆగస్టు 9–22: రోజర్స్ కప్, 15–22: సిన్సినాటి ఓపెన్, ఆగస్టు 30–సెప్టెంబర్ 12: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్, అక్టోబర్ 10–17: షాంఘై మాస్టర్స్ సూపర్–1000 టోర్నీ, నవంబర్ 1–7: పారిస్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ, 14–21: సీజన్ ముగింపు ఏటీపీ ఫైనల్స్ టోర్నీ. షూటింగ్ ఫిబ్రవరి 22–మార్చి 5: వరల్డ్‌కప్ షాట్‌గన్ (ఈజిప్ట్), మార్చి 18–29: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ (న్యూఢిల్లీ), ఏప్రిల్ 16–27: వరల్డ్‌కప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ (దక్షిణ కొరియా), మే 7–17: వరల్డ్ కప్ షాట్‌గన్ (ఇటలీ). చెస్ జనవరి 15–31: టాటా స్టీల్ (నెదర్లాండ్స్), 17–29: మహిళల గ్రాండ్ ప్రి, ఏప్రిల్ 8–14: క్యాండిడేట్స్ టోర్నీ (రష్యా), మే 23–31: చాంపియన్స్ చెస్ టూర్, జూన్ 4–15: చెస్ క్లాసిక్ టోర్నీ (రొమేనియా), 17–22: పారిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీ, జూలై 5–12: క్రొయేíÙయా ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీ, 17–28; బీల్ చెస్ ఫెస్టివల్ (స్విట్జర్లాండ్), ఆగస్టు 10–15: సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీ, అక్టోబర్ 25–నవంబర్ 8: ఫిడే గ్రాండ్ స్విస్ అండ్ మహిళల గ్రాండ్ స్విస్ టోర్నీ, నవంబర్–డిసెంబర్: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ (దుబాయ్). -
నేటి నుంచి రియో ఒలింపిక్స్
ఆగస్టు 5 నుంచి 21 వరకు * ప్రారంభోత్సవం భారత కాలమానం ప్రకారం శనివారం * తెల్లవారుజామున గం. 4.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం నాలుగేళ్ల కష్టాన్ని మైదానంలో చూపించే అథ్లెట్లు... కళ్లు చెదిరే విన్యాసాలతో అలరించే జిమ్నాస్ట్‌లు... ప్రాణాలు పోయినా ఫర్వాలేదు, పతకం సాధించాలనే పట్టుదలతో పోరాడే క్రీడాకారులు... ఇదంతా ఓ వైపు. అగ్రరాజ్యమైనా, శరణార్థ అథ్లెట్ అయినా అందరి లక్ష్యం ఒక్కటే... ఒలింపిక్ పతకం. తమ కలను సాకారం చేసుకోవడానికి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అథ్లెట్లు రియోకు చేరారు. అంగరంగ వైభవంగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంతో ఒలింపిక్స్‌కు తెరలేవనుంది. బోల్ట్, ఫెల్ప్స్లాంటి దిగ్గజ అథ్లెట్ల మెరుపులతో రియో వెలిగిపోనుంది. అమెరికానుంచి అజర్ బైజాన్ వరకు, ఆస్ట్రేలియా నుంచి అర్మేనియా వరకు... అగ్ర దేశమైనా, ఆకలి రాజ్యమైనా ఇప్పుడు అందరిదీ ఒకటే ఆట, ఒకటే భాష... తుపాకుల మోతలు లేవు, అంతర్యుద్ధం మాట వినిపించదు, కానీ సమరానికి మాత్రం లోటు లేదు... అభివృద్ధి చెందిన దేశం కావచ్చు, శరణార్థి శిబిరం నుంచి వచ్చిన అథ్లెట్ కావచ్చు, ప్రత్యర్థిపై పైచేయి సాధించి విజయగర్వంతో చేసే సింహనాదంలో తేడా ఉండదు. బరిలో అడుగు పెడితే చాలు గుండెల నిండా ఉద్వేగంతో, జాతీయ జెండాను మనసులో నింపుకునే అథ్లెట్లు ఈ అరుదైన క్షణం కోసం అహరహం శ్రమిస్తారు. సత్తా చాటి మెడల్ గెలిచిననాడు పోడియం వైపు నడిచే ప్రతీ అడుగు అతడికి జీవిత కాలపు ఆనందాన్ని ఇస్తుంది. పతకాల పంట పండించకపోయినా పర్వాలేదు, ప్రపంచ క్రీడా సంబరంలో తానూ భాగమయ్యానన్న సంతోషం ప్రతీ ఆటగాడి బయోడేటాలో ప్రథమాక్షరిగా కనిపిస్తుంది. కూబర్టీన్ కలల్లోంచి పుట్టి 120 ఏళ్లుగా క్రీడాకారుల గుండె చప్పుడుగా మారిన ఒలింపిక్స్ మళ్లీ వచ్చేశాయి. సమరాంగణాన నాతో సరితూగేవారెవ్వరు అంటూ అథ్లెట్లు సవాల్ విసిరే సమయం ఆసన్నమైంది. కొందరు బంగారంతో తళుక్కుమంటే, మరి కొందరికి వెండి వెలుగులే ముంజేతి స్వర్ణ కంకణంలా మారిపోతాయి. మరి కొందరికి కంచు మోతలో కూడా మాధుర్యం వినిపిస్తుంది. రియోలో విశ్వ రూపం చూపించేందుకు స్టార్లు సిద్ధమైన వేళ... ఈ పక్షం రోజులు ప్రతీ క్రీడాభిమానికి పండగే. 1908 లండన్ గేమ్స్‌లో తొలిసారి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. నాటినుంచి ఇది సంప్రదాయంగా వస్తోంది. ఏ ఒలింపిక్స్‌లోనైనా మార్చ్ పాస్ట్‌లో ముందుగా గ్రీస్ జట్టు... ఆ తర్వాత ఇంగ్లీష్ అక్షరమాల ప్రకారం వరుసలో వేర్వేరు దేశాలు వస్తాయి. అందరికంటే చివరలో ఆతిథ్య దేశం క్రీడాకారులు నడుస్తారు. క్రీడా ప్రపంచమంతా ఎదురు చూస్తున్న అతి పెద్ద సంబరం ఒలింపిక్స్‌కు రంగం సిద్ధమైంది. 31వ ఒలింపిక్ క్రీడలు నేటినుంచి బ్రెజిల్ నగరం రియో డి జనీరోలో జరగనున్నాయి. ఇక్కడి చారిత్రక మరకానా స్టేడియంలో శుక్రవారం ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్రెజిల్ గర్వప్రదాత, ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఒలింపిక్ జ్యోతిని వెలిగిస్తారు. మొత్తం మూడున్నర గంటల పాటు ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. ‘ది ఎవల్యూషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ బ్రెజిల్’ పేరుతో వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆ దేశపు అత్యుత్తమ గాయకులు పాడే పలు గీతాలతో పాటు దెబోరా కోల్కర్ నేతృత్వంలో 6 వేల మందితో ప్రత్యేక నృత్య ప్రదర్శన ఉంటుంది. శనివారంనుంచి వివిధ క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. 17 రోజుల క్రీడోత్సవానికి ఈ నెల 21న మరకానాలోనే ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తారు. బ్రెజిల్ దేశపు ఆర్థిక సంక్షోభం, రియోలో పూర్తి కాని ఏర్పాట్లు, నిరసనకారుల ప్రదర్శనలు, రష్యా ఆటగాళ్లపై నిషేధం, క్రీడా గ్రామంలో సౌకర్యాల లేమి, దోపిడీలు, జికా వైరస్ ప్రభావం... ఇలా చాలా అంశాలు ఇప్పటి వరకు రియో ఒలింపిక్స్‌లో క్రీడలకంటే ఎక్కువగా వార్తల్లో నిలిచాయి. అయితే ఒక్క సారి పోటీలు మొదలైతే ఇదంతా సద్దుమణిగినట్లే. ఆటగాళ్ల ఏకైక లక్ష్యం విజయం సాధించడం, పతకం దక్కే వరకు పట్టుదలతో పోరాడటమే. సూపర్ స్టార్లుగా ఉన్నవారు మరో మెట్టు ఎదిగేందుకు, కొత్త స్టార్లు పుట్టుకొచ్చేందుకు అసలైన వేదిక అయిన ఒలింపిక్స్... కొత్త రికార్డులు, ఘనతలతో ‘మరింత వేగంగా, మరింత ఎత్తుకు, మరింత బలంగా...’ దూసుకుపోవాలని క్రీడా ప్రపంచం కోరుకుంటోంది. 8 వేల కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా టీవీ ప్రసార హక్కుల కోసం ఎన్బీసీ యూనివర్సల్ చెల్లించిన మొత్తం 3,200 క్రీడల నిర్వహణకు రిఫరీలు, సహాయకులు 4,924 అందుబాటులో ఉన్న మొత్తం పతకాలు 77 వేల కోట్లు సుమారుగా రియో ఒలింపిక్స్ మొత్తం ఖర్చు 14 ఒకే అథ్లెట్ ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలు 555 అమెరికా అత్యధిక సంఖ్యలో పాల్గొంటున్న ఆటగాళ్లు రియోలో భారతీయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందే భారత ఆర్చరీ జట్టు నేడు (శుక్రవారం) బరిలోకి దిగబోతోంది. పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్ ఈవెంట్లో అతాను దాస్, మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ ఈవెంట్లో లక్ష్మీరాణి, బొంబేలా దేవి, దీపికా కుమారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక మహిళల టీమ్ ర్యాంకింగ్ రౌండ్లో లక్ష్మీరాణి, బొంబేలా దేవి, దీపికా కుమారి జట్టుగా పాల్గొంటున్నారు. ఒలింపిక్స్‌కు ముందు భారత అభిమానులకు చేదు వార్త. టెన్నిస్ పురుషుల డబుల్స్‌లో కలిసి ఆడాల్సిన పేస్-బోపన్న రియోలో విడిగా బసచేశారు. ఈ ఇద్దరూ కనీసం మొహాలు కూడా చూసుకోవడం లేదని సమాచారం. -
ఫిల్ హ్యూస్కు ఘన నివాళి
-
ఎప్పటికీ మా మనస్సులోనే...
ఫిల్ హ్యూస్ మరణంతో క్రికెట్ ప్రపంచమే కాదు... యావత్ క్రీడాలోకం షాక్‌కు లోనయ్యింది. ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు... హాంకాంగ్ నుంచి హైదరాబాద్ దాకా ప్రతి క్రీడాకారుడు, క్రీడాభిమాని హ్యూస్కు ఘన నివాళి అర్పించారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లు తాము ఆడుతున్న, ఆడిన బ్యాట్లను ఇళ్ల బయట ఉంచి ‘పుట్ యువర్ బ్యాట్స్’ పేరుతో అతడిని స్మరించుకున్నారు. సిడ్నీ: ‘మరణంతో భౌతికంగా నువ్వు మాకు దూరమైనా... ఎప్పటికీ మా మనసుల్లో నిలిచే ఉంటావు....’ ఫిల్ హ్యూస్కు క్రీడాప్రపంచం అర్పించిన నివాళి ఇది. 25 ఏళ్ల చిన్నవయసులోనే మైదానంలో గాయపడి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన హ్యూస్... గురువారం కన్ను మూసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మ్యాచ్‌ల మొదలు స్కూల్ స్థాయి క్రికెట్ వరకు ప్రపంచంలో అన్ని మూలలా ఆటగాళ్లు హ్యూస్కు శ్రద్ధాంజలి ఘటించారు. ముఖ్యంగా ‘పుట్ యువర్ బ్యాట్స్’ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో సాగిన ప్రచారంలో ప్రముఖులంతా భాగమయ్యారు. తాము ఆడిన/ఆడుతున్న బ్యాట్లను ఇంటి బయట, మైదానంలో ఉంచి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆస్ట్రేలియా జట్టులో హ్యూస్ జెర్సీ నంబర్‌తో 408 ఫర్ ఎవర్, అతని ఆఖరి ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తూ 63 నాటౌట్ ఫర్ ఎవర్ అంటూ తమ ఆవేదనను పంచుకున్నారు. ఆస్ట్రేలియా మీడియా కూడా ఈ దురదృష్టకర వార్తను ప్రముఖంగా ప్రచురించి హ్యూస్కు తగిన విధంగా శ్రద్ధాంజలి ఘటించింది. శుక్రవారం ఉదయం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మొత్తం సిడ్నీ క్రికెట్ మైదానంలో సమావేశమైంది. ఈ సందర్భంగా హ్యూస్‌తో తమకున్న అనుబంధం, జ్ఞాపకాలను జట్టు సభ్యులు పంచుకున్నారు. దుబాయ్‌లోని ప్రధాన కార్యాలయం ముందు తమ సభ్య దేశాలైన 105 జట్ల తరఫున ఐసీసీ 105 బ్యాట్లను ఉంచింది. గూగుల్ ఆస్ట్రేలియా హోంపేజ్‌లో కూడా బ్యాట్‌ను ఉంచిన ఫోటోను డూడుల్‌గా పెట్టింది. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రధాన కార్యాలయంలో హ్యూస్ ఆఖరి స్కోరును గుర్తు చేస్తూ 63 బ్యాట్లను బయట ప్రదర్శించారు. పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు కూడా ఆట ప్రారంభానికి ముందు ఇదే విధంగా చేశాయి. అనంతరం నిమిషం పాటు మౌనం పాటించి నివాళి అర్పించాయి. ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. కివీస్ క్రికెటర్లు తమ జెర్సీలపై పీ. హెచ్. (ఫిల్ హ్యూస్) అక్షరాలను రాసి మైదానంలోకి అడుగు పెట్టారు. రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించినప్పుడు జట్టు సభ్యుల సంతకాలతో కూడిన బ్యాట్‌ను బీసీసీఐ ప్రదర్శించింది. ఇందులో హ్యూస్ కూడా ఉన్నాడు. చాంపియన్ క్రికెటర్‌కు ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నట్లు బోర్డు పేర్కొంది. సచిన్ టెండూల్కర్ తన 25వ ఏట (హ్యూస్ వయసు) వాడిన బ్యాట్‌ను పుట్ యువర్ బ్యాట్స్ కోసం ప్రదర్శించాడు. భారత హాకీ జట్టు తమ హాకీ స్టిక్‌లను ఉంచగా, ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారులు ఆడమ్ స్కాట్, రోరీ మెకిల్రాయ్ తమ క్యాప్‌లకు నల్ల బ్యాండ్‌ను ధరించి నివాళి అర్పించారు. అమెరికాలోనూ పలువురు క్రీడాకారులు సంతాపం తెలిపారు. దక్షిణాఫ్రికా క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు రిచర్డ్స్, గిల్‌క్రిస్ట్, డీన్జోన్స్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు రైనా, రహానే తదితరులు కూడా తమ బ్యాట్‌ను ఉంచి సంఘీభావం ప్రకటించారు. టెన్నిస్ స్టార్స్ నాదల్, ముర్రే క్రికెటర్ కుటుంబానికి సంతాపాన్ని తెలిపారు. ఆస్ట్రేలియాలో క్లబ్ క్రికెట్లో కొన్ని మ్యాచ్‌లను 63 ఓవర్ల పాటు నిర్వహించగా... ఓ మ్యాచ్‌లో జూనియర్ క్రికెటర్లు 63 పరుగులు చేయగానే రిటైర్ అయ్యారు. స్కూల్ క్రికెట్లో పిల్లలు ధరించేందుకు 408 నంబర్ ఉన్న క్యాప్‌లను అందించారు. సిడ్నీలో స్మారక సభ ఫిల్ హ్యూస్‌ను స్మరించుకునేందుకు వీలుగా త్వరలోనే స్మారక సభ నిర్వహించనున్నట్లు న్యూసౌత్‌వేల్స్ ప్రీమియర్ మైక్ బెయిర్డ్ ప్రకటించారు. హ్యూస్ కుటుంబ సభ్యులతో చర్చించి తేదీని ఖరారు చేస్తామని, సిడ్నీ క్రికెట్ మైదానంలో ఇది జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ మైదానంతో ఫిల్కు ఎంతో అనుబంధం ఉందని, అతడిని అభిమానించేవారంతా పెద్ద సంఖ్యలో రావాలని మైక్ కోరారు.