'ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం' చూస్తూ మృతి
సిద్దిపేట: సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని శ్రీనివాస థియేటర్లో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం సినిమా చూస్తూ సదరు వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మృతుడు సిద్ధిపేట్‌లోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఎండీ షాదుల్(30)గా గుర్తించారు. ఇంటర్వెల్ సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని థియేటర్ యాజమాన్యం పోలీసులకు తెలియజేసింది.
సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుండెపోటుతో మరణించి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.