ఎరుపెక్కిన కడప
కడప వైఎస్ఆర్ సర్కిల్:కడప నగరంలో తొలిసారిగా జరగనున్న సీపీఐ 26వ రాష్ట్ర మహాసభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాసభల సం దర్భంగా నగరంలోని ప్రధాన సర్కిళ్లన్నీ ఎరుపెక్కాయి. ఈ మహా సభలకు సీపీఐ జాతీయ నేతలు తరలిరానున్నారు. శుక్రవారం నుంచి మహా సభలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మహా సభల షెడ్యూల్ తదితర విషయాల గురించి వెల్లడించారు.
సభల్లో ఏమేం చర్చిస్తారంటే..
ఈ మహాసభలో జిల్లాలో ఉక్కు పరి శ్రమ నిర్మాణం, రాష్ట్రానిక ప్రత్యేకహోదా, వెనుకబడిన రాయలసీమకు ప్రత్యే క ప్యాకేజీ, కరువు వలసలు, రైతుల ఆత్మహత్యలపై, రాష్ట్రానికి ప్రాజెక్టులకు నిధులు, నికరజలాలు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తరహాలో బీసీ మైనార్టీలకు చట్టబద్ధత వంటి వాటిపై చర్చిస్తామన్నారు. భూమి లేని దళిత గిరి జనులకు 5 ఎకరాల భూమి కోసం పోరాటం చేస్తామన్నారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ క్రమబద్ధీకరణ తదితర విషయాల పోరాటం, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
ఎందరో మహనీయులు
జాతీయ ఉద్యమ కాలంలోనే జిల్లాలో కమ్యూనిస్టుపార్టీ ఆవిర్భావానికి బీజాలు పడ్డాయి. ఎంతోమంది విద్యావంతులైన యువకులు ఉద్యమంలోకి వచ్చారు. ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి, నర్రెడ్డి శివరామిరెడ్డి, శంభురెడ్డి, నంద్యాల నాగిరెడ్డి, ఎన్.ఈశ్వర్‌రెడ్డి, జె.వెంకట్రామి రెడ్డి, కె.సుబ్బన్న, చెంచురామయ్య, కమ్మూ సోదరులు వంటి ఎందరో మహనీయులు తమ జీవితాలను పార్టీకి అంకితం చేశారు.
మరువలేని ఘట్టాలు
అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్న ఎద్దుల ఈశ్వర్‌రెడ్డిని ఎలాగైనా అరెస్టు చేయాలన్న పోలీసులు ఆయన స్వగ్రామం పెద్ద పసుపులను చుట్టుముట్టారు. పోలీసులు ఈశ్వర్‌రెడ్డిని పట్టుకుని వ్యాను ఎక్కించే ప్రయత్నం చేస్తుండగా, గ్రామం మొత్తం ఏకమై అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన పోలీసు కాల్పుల్లో పెద్ద వెంకట కొండారెడ్డి అమరులయ్యారు. కాలక్రమంలో జరిగిన ఎన్నికల్లో కమలాపురం నుంచి నర్రెడ్డి శివరామి రెడ్డి, రాజంపేట నుంచి పంజం నరసింహారెడ్డి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి ఒకసారి శాసనమండలి సభ్యునిగా, వరుసగా నాలుగుసార్లు కడప లోక్‌సభ సభ్యునిగా ఎన్నిక కావడం విశేషం.
మహా సభల షెడ్యూల్ ఇదే
6న ఉదయం 10 గంటలకు సొదుం జయరాం వేదికపై (మానస గార్డెన్‌లోని కాన్పరెన్స్ హాల్) ‘ఆర్థిక సంక్షోభం–సామాన్యుల స్థితి గతులు’ అనే అంశంపై కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రజా గాయకుడు గోరటి వెంకన్న, అరసం రాష్ట్ర అధ్యక్షుడు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి పాల్గొంటారు.
≈ ఉదయం 11:30 గంటలకు ప్రమాదంలో ప్రజాస్వామ్యం కార్యక్రమం ఉంటుంది.
≈ మధ్యాహ్నం 2:30 గంటలకు వై.సి.వి రెడ్డి వేదికపై వర్తమాన సమాజం– వివక్ష అనే అంశంపై సమావేశం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రము ఖ కథా రచయిత వేంపల్లి గంగాధర్, ఈశ్వరరెడ్డి హాజరవుతారు.
≈ సాయంత్రం 4 నుంచి 5:30 గంటలకు కమ్మూ సాహెబ్ అండ్ శ్యామల వేదికపై (నేక్‌నామ్ కళాక్షేత్రం)లో సాంస్కృతిక సంక్షోభం అం శంపై చర్చ ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీ విమర్శకులు పి.సంజీవమ్మ, ప్రముఖ కథా రచయిత హుస్సేన్ సత్యాగ్ని తవ్వా ఓబుల్‌రెడ్డి హాజరవుతారు.
≈ 7న సాయంత్రం 3 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి 4 గంటలకు మున్సిపల్ గ్రౌండ్లో బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి కె. నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ బాషాతో పలువురు రాష్ట్ర నాయకులు హాజరవుతారు.
≈ 8,9 తేదీల్లో ప్రతిధులు సభలు, 10న రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఉంటుం దని ఆయన వివరించారు.