struggele
-
మానసిక సమస్యలలో అమితాబ్ మనవరాలు
అమితాబ్ మనవరాలు 23 ఏళ్ల నవ్య నవేలి నందా తీవ్రమైన యాంగ్జయిటీతో బాధ పడుతున్నట్టు చెప్పింది. అమితాబ్ కుమార్తె శ్వేత, అల్లుడు నిఖిల్ల కుమార్తె అయిన నవ్య నవేలీ గత సంవత్సరమే న్యూయార్క్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని వచ్చింది. ఈమెకు అగస్త్య అనే తమ్ముడు ఉన్నాడు. ఇటీవల నవ్య నవేలి తన సహ భాగస్వామ్యంతో ‘ఆరా’ అనే హెల్త్ పోర్టల్‌ను ప్రారంభించింది. దాని కోసమని విడుదల చేసిన వీడియోలో తన మానసిక సమస్య గురించి, దానికి తీసుకుంటున్న వైద్యం గురించి మాట్లాడింది. ‘గతంలో నేను చాలా నెగెటివ్ మనుషుల మధ్య ఉండేదాన్ని. వారెప్పుడు నెగెటివిటీనే మాట్లాడేవాళ్లు. కారణాలు తెలియదు నేను చాలాసార్లు మానసికంగా లోలోపల అడుగు వరకూ చాలా దెబ్బ తిన్నాను. తీవ్రమైన యాంగ్జయిటీ నన్ను వేధించేది. ఇంట్లో ఉన్న బయట ఉన్నా ఒక అటాక్లాగా వచ్చేది. ఆ సమయంలో దానిని కంట్రోల్ చేయడం సాధ్యమయ్యేది కాదు. బయటి విషయాలు ఏవో ఒకటి ట్రిగర్ చేయడం వల్ల అలా జరుగుతుంది అనుకునేదాన్ని. ఒక్కోసారి ఏ కారణం లేకపోయినా అలాగే జరిగేది. ఇది చాలా భరింపలేని విషయం’ అందామె. ‘మొదట్లో నేను దీని గురించి ఎవరితోనూ మాట్లాడకూడదు అనుకున్నాను. కాని మాట్లాడితేనే సగం పరిష్కారం. అలాగై వైద్య సహాయం తీసుకోవడం మరో సగం పరిష్కారం. కొందరు తమ మానసిక సమస్యకు సహాయం అవసరం అని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. యాంగ్జయిటీకి మూలం బయట ఉండదు. ఎనభై శాతం మన బుర్రలోనే ఉంటుంది. అక్కడి నుంచే యాంగ్జయిటీ మొదలవుతుంది. మొదట మన మనసును, శరీరాన్ని అర్థం చేసుకోవాలి. మన ఎమోషన్స్‌ను అర్థం చేసుకునే కొద్దీ ఈ సమస్య నుంచి బయటపడతాం’ అందామె. ‘యాంగ్జయిటీ నుంచి బయటపడటానికి థెరపిస్ట్‌ను కలుస్తున్నాను. వారానికి ఒక గంట అతనితో మాట్లాడుతున్నాను. మాట్లాడేకొద్దీ నాకు ధైర్యం వస్తోంది. యాంగ్జయిటీ నన్నేమీ చేయదనే నమ్మకం కలుగుతోంది. అలాగే మన చుట్టు మనల్ని కంఫర్ట్‌గా సంతోషంగా ఉంచే మనుషులుండేలా చూసుకోవాలని కూడా తెలుసుకున్నాను’ అని చెప్పిందామె. అమితాబ్ ప్రియమైన మనవరాలు నవ్య. ఆమె యుక్త వయసుకు రాగానే స్త్రీ ఎదుర్కొనే మానసిక, శారీరక సమస్యలను గురించి, సంఘపరమైన సవాళ్ల గురించి మాట్లాడుతూ అమితాబ్ ఆమెకు రాసిన బహిరంగ లేఖ అప్పట్లో ఒక పురోగామి విషయంగా చెప్పుకున్నారు. మానసిక సమస్యలకు స్త్రీ పొందాల్సిన వైద్య సహాయాన్ని ఈ వీడియో నొక్కి చెబుతోంది. నవ్య నవేలి నందా; తల్లి శ్వేతతో నవ్య -
గృహయోగం కావాలి
ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆమె సొంతం. ఒక యూనివర్సిటీ వసతిగృహానికి ఏకంగా ఆమె పేరు. ఆమె రాష్ట్రప్లానింగ్బోర్డు సభ్యురాలు కూడా.. అయినా ఉండడానికి ఆమెకు పక్కా ఇల్లు లేదు. రచ్చ ఎంత గెలిచినా ఆమె ఇంటిని గెలుచులేకపోయింది. సాధారణ మహిళలా ఒక పూరిగుడిసెలోనే కాలం గడుపుతోంది. జయపురం : వ్యవసాయరంగంలో అత్యున్నత ఫలితాలు సాధించి, పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న మహిళ కమల పూజారి. డొంగరచించి పంచాయతీ పాత్రోపుట్ గ్రామానికి చెందిన కమలపూజారి పక్కాఇల్లు లేక కుటుంబంతో కలిసి ఒక పూరిగుడిసెలో నివాసం ఉంటోంది. భర్తను కోల్పోయిన ఆమెకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు ధనుంజయ్ పూజారికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. తన కుటుంబంతో కలిసి తల్లి కమల పూజారికి దూరంగా వేరుకాపురం ఉంటున్నాడు. చిన్నకొడుకు టంకుధరపూజారికి ముగ్గురు కొడుకులు. అదే ఊరిలో తనకున్న రెండు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ భార్యాబిడ్డలతో కలిసి తల్లి కమల దగ్గరే ఉంటున్నాడు. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్‌యోజన, బిజూ ఆవాస్‌యోజన వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా తనకు ఇల్లు మంజూరు చేయాలని చాలాసార్లు ప్రభుత్వానికి కమల పూజారి అర్జీ పెట్టుకుంది. అయినా పక్కా ఇల్లు మంజూరుకాలేదు. ఎట్టకేలకు చిన్న కొడుకు టంకుధరకు మంజూరైన ఇంటికి పూర్తిస్థాయిలో బిల్లులు అందకపోవడంతో ఆ ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. కొత్త ఇల్లు మంజూరరైందన్న సంతోషంతో ఉన్న ఒక్క పూరి గుడిసె పడగొట్టామని ఉండేందుకు ఇప్పుడు ఇల్లు లేక నిర్మాణంలో ఉన్న ఇల్లు పూర్తికాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కమల పూజారి వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన అవస్థలను గుర్తించి తనకో ఇల్లు మంజూరు చేస్తే బాగుంటుందని కమలపూజారి కోరుకుంటున్నారు.