ఉద్యమానికి కొత్త ఊపు
చోడవరం,న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి ఉధృతం చేయడానికి క్రమశిక్షణతో అంతా పనిచేయాలని అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ పరిశీలకుడు జ్యోతుల నెహ్రూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లాస్థాయి విస్తృత సమావేశం చోడవరం లో ఆదివారం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందలాదిమంది నాయకులు, కార్యకర్తలతో పట్టణంలో సం దడి సంతరించుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాల రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త సుజయ్‌కృష్ణ రంగారావు తొలుత మహానేత వైఎస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిం చారు.
జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు అధ్యక్షతన జరి గిన కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ప్రాంతాల వారీగా పూటకో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న లక్ష్యంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఉద్యమం మరిం త ఉధృతానికి ఈనెల రెండో తేదీ నుంచి నియోజకవర్గాలు, మండలాల వారీగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు, దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా డ్రామాతీరు సిగ్గుచేటుగా ఉందని విమర్శించారు.
చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు విశాఖజిల్లాకు ఎంతో అవసరమని, దీనిని పరిరక్షించుకోవడానికి రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశం పరిశీలకుడు పుచ్చా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇందిరాగాంధీ రాష్ట్రాల సమైక్యం కోసం పోరాడితే,స్వార్థ రాజకీయంతో సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ విభజనకు చర్యలు చేపట్టారన్నారు.
కేంద్రపాలకమండలి సభ్యుడు కుంభా రవిబాబు మాట్లాడుతూ వైఎస్ రాష్ట్రాన్ని అభివృద్ధిచేసి సమైక్యంగా ఉంచితే టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలు రాష్ర్ట ప్రజలతో ఆటలాడుతూ విభజనకు పూనుకున్నాయని విమర్శించారు. సమైక్యాంధ్ర కోసం అంతా సమిష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నెలరోజుల పోరాటానికి ప్రణాళిక రూపొందించారు. అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు, దీక్షలు గురించి విస్తృతంగా చర్చించారు.
సమావేశంలో నియోజకవర్గాల సమన్వయకర్తలు బోకం శ్రీనివాసరావు, చెంగల వెంకట్రావు, పూడి మంగపతిరావు, బూడిముత్యాలనాయుడు, వంజంగి కాంతమ్మ, ప్రగడ నాగేశ్వరరావు, బొడ్డేడ ప్రసాద్, పెట్ల ఉమాశంకరగణేష్, కోరాడ రాజబాబు, గిడ్డి ఈశ్వరి, సీకరి సత్యవేణి, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ పీలా వెంకటలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మిలట్రీనాయుడు, మాజీమంత్రి ఎం. బాలరాజు, పార్టీ నాయకులు పీలా ఉమారాణి, నాయకులు డాక్టర్ బండారు సత్యనారాయణ, పీవీఎస్ఎన్ రాజు, కాండ్రేగుల జగదీష్, పీవీజే కుమార్, నీలం శారద, తదితరులు పాల్గొన్నారు.