ఎంటెక్ విద్యార్థి బలవన్మరణం
ఓబుళదేవరచెరువు : ఓబుళదేవరచెరువు మండలం మిట్టపల్లికి చెందిన మాజీ సర్పంచ్ రొద్దం గోవిందరెడ్డి కుమారుడు రొద్దం సుమంత్కుమార్రెడ్డి(28) శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు సమీప బంధువులతో పాటు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. అనంతపురం జేఎన్టీయూలో ఎంటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. తను ఓ అమ్మాయిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో చెప్పాడు. ‘చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుందువు. అంతవరకు వద్దని’ తల్లిదండ్రులు నచ్చచెప్పారు. దీంతో క్షణికావేశానికి గురైన సుమంత్ ఇంటి పైఅంతస్తులోకి వెళ్లి ఉరేసుకున్నాడు. వెంటనే గమనించి కిందకు దింపగా అప్పటికే అతను మరణించాడు. ఒక్కగానొక్క కుమారుడు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు గుండెలుపగిలేలా రోదించారు. కేసు దర్యాప్తులో ఉంది.