sunburn
-
డ్రాగన్‌కు ఎండ దెబ్బా..?
డ్రాగన్ ఫ్రూట్ తోటలను ఎండ దెబ్బ(సన్ బర్న్) నుంచి కాపాడుకోవటం రైతులకు ఒక సవాలు వంటిదే. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటితే డ్రాగన్ ఫ్రూట్ చెట్లకు సన్ బర్న్ ముప్పు పొంచి ఉంటుంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ సమస్య వస్తుంది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అనేక దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడక్కడా 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) సన్‌బర్న్ దెబ్బ నుంచి డ్రాగన్ పంటను కాపాడుకోవటానికి చేసిన సూచనలను తెలుసుకుందాం.. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్షియస్ దాటితే రాత్రి–పగటి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం కూడా పెరుగుతుంది. ఇది కూడా చెట్టును బలహీనపరుస్తుంది. ఆకు పచ్చగా నిగనిగలాడుతూ ఉండే డ్రాగన్ మొక్కల కాండాలు అధిక రేడియేషన్ వల్ల పత్రహరితాన్ని కోల్పోయి (బ్లీచ్డ్ అప్పియరెన్స్) తెల్లబోయి కాంతి హీనంగా కనిపిస్తాయి. అటువంటప్పుడు మొక్క పెరుగుదల మందగిస్తుంది. ఆ దశలో గనక రక్షక చర్యలు తీసుకోకపోతే డ్రాగన్ మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. మొక్క పశ్చిమ భాగంలోని డ్రాగన్ కాండాలకు సన్ బర్న్ నష్ట తీవ్రత 10% నుంచి 50% వరకు ఉంటుంది. కాండం కుళ్లు సోకుతుంది. ఇది విజృంభిస్తే ఏకంగా తోటలో మొక్కలన్నీటినీ రైతు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి, సన్‌బర్న్ సమస్యను రైతులు సకాలంలో గుర్తించి, తగిన జాగ్రత్తలు పాటిస్తే డ్రాగన్ ఫ్రూట్ తోటలను ఎండల తీవ్రత నుంచి రక్షించుకోవచ్చు.పిచికారీఎండ తీవ్రత వల్ల పత్ర రంధ్రాల్లో నుంచి నీటి తేమ ఎక్కువగా వాతావరణంలోకి విడుదలవుతుంటుంది. అటువంటప్పుడు మొక్కలో నీటి శాతం తగ్గిపోతుంది. ఈ ప్రక్రియను తగ్గించగలిగే యాంటీ–ట్రాన్స్‌పైరెంట్స్‌ను పిచికారీ చేస్తే ఉపయోగం ఉంటుంది. డ్రాగన్ తోటను సన్ బర్న్ నుంచి రక్షించుకోవటానికి కోలినైట్ (లీటరు నీటికి 50 గ్రాములు) + నీమ్ సోప్ (లీటరు నీటికి 4 గ్రాములు) తో పాటు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ను, హ్యూమిక్ యాసిడ్ (లీటరు నీటికి 4 ఎం.ఎల్.) కలిపి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో పిచికారీ చేయాలని ఐఐహెచ్ఆర్ నిపుణులు రైతులకు సూచిస్తున్నారు. సన్ బర్న్ నష్ట తీవ్రతతో పాటు శిలీంధ్ర, బాక్టీరియా తెగుళ్ల బెడదను కూడా తగ్గిస్తుందని తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్ తోటలో పోల్కి 8–10 లీటర్ల నీటిని డ్రిప్ ద్వారా ఇస్తే ఎండ తీవ్రతను తట్టుకోవటానికి అవకాశం కలుగుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎలుకలు కొరికేస్తున్నాయ్!డ్రాగన్ ఫ్రూట్.. ఖరీదైనది, పోషకాలతో కూడినదే కాకుండా, దీన్ని సేంద్రియంగా సాగు చేయటం కూడా సులభం. గ్రామీణప్రాంతాలతో పాటు నగరాల పరిసరప్రాంతాల్లోనూ డ్రాగన్ ఫ్రూట్ తోటలు విస్తరిస్తున్నాయి. ఇంటిపంటలు, మిద్దె తోటల్లోనూ డ్రాగన్ సాగు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ పంటకు ఎలుకల బెడద ఎదురవుతోందని కొల్లం (కేరళ) కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గుర్తించారు. కొల్లం జిల్లాలోని అనేకప్రాంతాల్లో డ్రాగన్‌కు ఎలుకల బెడద ఎదురవుతున్నట్లు సమాచారం రావటంతో కేవీకే భవనంపైనే ప్రయోగాత్మకంగా ఫైబర్ డ్రమ్ముల్లో డ్రాగన్ మొక్కల్ని పెంచారు. తెల్లవారుజామున 4–5 గంటల మధ్య ఎలుకలు డ్రాగన్ మొక్కల కాండం లోపలి గుజ్జును కొరికి తింటున్నట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. శరీరం కన్నా తోక ఎక్కువ ΄÷డవున్న రకానికి చెందిన ఎలుకలు ఈ పని చేస్తున్నాయని గుర్తించారు. ఎలుకలు కొరికిన కాండం ద్వారా నీరు, పోషకాల సరఫరా తగ్గిపోతుంది. దీంతో, పూత రాకపోవచ్చు. పూత వచ్చిన తర్వాత ఎలుకలు కొరికితే.. పూత, పిందెలు రాలిపోవచ్చు. అంతిమంగా, దిగుబడి తగ్గిపోతుంది. -
రాష్ట్రంలో వడదెబ్బకు 8 మంది మృతి
చిట్యాల/ హాలియా/కాసిపేట/చొప్పదండి/ములుగు/మహబూబాబాద్/వరంగల్/మునుగోడు: రాష్ట్రంలో వడదెబ్బకు గురై వేర్వేరు ప్రాంతాల్లో శుక్ర వారం ఒక్కరోజే ఎనిమిది మంది మృతి చెందారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు మృతి చెందగా నల్లగొండ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. నల్లగొండ జిల్లాలోని అనుముల మండలంలోని కొత్తపల్లికి చెందిన బచ్చు ముకుందరెడ్డి(55) బైక్‌పై వ్యవసాయ పనిముట్ల కోసం ఉదయం నల్ల గొండ పట్టణానికి వెళ్లి పనిచూసుకుని ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో వడదెబ్బకు గురయ్యాడు.చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా..మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. ఇదే జిల్లాలో ఏపీలోని పశి్చమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన కర్రి రాజు(40), భార్య దీనమ్మ తమ ముగ్గురు పిల్లలతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మధ్యాహ్నం నల్లగొండ జిల్లా చిట్యాల బస్టాండ్‌లో రామన్నపేటకు వెళ్లేందుకు రాజు బస్సుకోసం ఎదురుచూస్తుండగా వడదెబ్బకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు ఇదే జిల్లాకు చెందిన మునుగోడు మండలం ఊకొండి గ్రామానికి చెందిన కమ్మలపల్లి మమత (28) ఉపాధి పనుల నిమిత్తం కూలీ పనులకు వెళ్లి వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే తోటి కూలీలు 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. మంచినీళ్ల కోసమని కిందికి దిగి... కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని బసంత్ నగర్లో నివాసం ఉండే మధ్యప్రదేశ్‌కు చెందిన జాకీర్ హు స్సేన్(60) అనే లారీ డ్రైవర్ చొప్పదండికి సిమెంట్ లోడ్‌తో వచ్చాడు. ప్రధాన రహదారిపై ఓ హోటల్ సమీపంలో లారీని ఆపి మంచినీళ్ల కోసమని కిందికి దిగాడు. ఈ క్రమంలో అతడు వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే 108 సిబ్బందికి స్థానికులు సమాచారం అందించగా వారు వచ్చి హుస్సేన్‌ను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఇక మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కూలీ దుర్గం భీమయ్య(55) వడదెబ్బతో మృతి చెందాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు... మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ఎస్సీకాలనీకి చెందిన జన్ను ఎల్లమ్మ (50), ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటకు చెందిన దామెర రాంబాబు(48) వడదెబ్బకు గురై మృతి చెందారు. అదేవిధంగా వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన పల్లకొండ ఐలయ్య(74) రోజువారీగా పందులు మేపడానికి వెళ్లి ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలి మృతిచెందాడు. -
వడదెబ్బ... 108 డిగ్రీల జ్వరం
న్యూఢిల్లీ: ఢిల్లీని చుట్టుముట్టిన వడగాలులు ఒక మధ్యవయస్కుడి ప్రాణం తీశాయి. వడదెబ్బతో ఆస్పత్రిలో చేరిన అతడి శరీర ఉష్ణోగ్రత చూసి వైద్యులు హుతాశులయ్యారు. అతని శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే 10 డిగ్రీలు ఎక్కువ ఉండటం గమనార్హం. సోమవారం రాత్రి జరిగిన ఘటన వివరాలను రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి డాక్టర్ రాజేశ్ శుక్లా వెల్లడించారు. ‘‘ బిహార్‌లోని దర్భాంగా పట్టణానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి సోమవారం ఢిల్లీలో వడదెబ్బకు గురయ్యారు. వెంటనే ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చేరారు. ఆయన శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీ ఫారన్‌హీట్‌కు చేరుకోవడం చూసి ఆందోళనకు గురయ్యాం. ఆయనను ఎలాగైనా కాపాడాలని శతథా ప్రయతి్నంచాం. కానీ శరీరంలో అతివేడి కారణంగా ఆయన మూత్రపిండాలు, కాలేయం విఫలమయ్యాయి. ఇలా వెంటవెంటనే పలు అవయవాలు వైఫల్యం చెందడంతో ఆయన కన్నుమూశారు’ అని డాక్టర్ వివరించారు. ఒకే ఆస్పత్రిలో 2 గంటల్లో 16 మరణాలు పట్నా: ఉగ్ర ఉష్ణోగ్రత బిహార్‌లోని ఒకే ఆస్పత్రిలో 16 మంది ప్రాణాలను బలితీసుకుంది. గురువారం ఔరంగాబాద్‌లోని జిల్లా ఆస్పత్రిలో ఈ విషాద ఘటన జరిగింది. గురువారం అక్కడ 44, బుధవారం 48.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంతటి వేడికి తాళలేక జనం పిట్టల్లా రాలిపోయారు. చాలా మంది అక్కడి జిల్లా ఆస్పత్రిలో చేరగా గురువారం రెండు గంటల వ్యవధిలో 16 మంది చనిపోయారు. -
వడదెబ్బతో 16 మంది మృతి
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న ఎండల కారణంగా వడదెబ్బ తగిలి శనివారం వివిధ ప్రాంతాల్లో 16 మంది మృతిచెందారు. జగిత్యాల జిల్లాలో ఎంఈవోగా పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన బత్తుల భూమయ్య వడదెబ్బతో హఠాన్మరణానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఎన్నికల విజిలెన్స్ బృందంలో పనిచేస్తున్నారు. దీంతో ప్రతిరోజూ ఎండలోనే ఆయన పనిచేయాల్సి వస్తోంది. తీవ్రమైన ఎండవేడికి వడదెబ్బకు గురైన ఆయన చొప్పదండిలోని స్వగృహంలో వేకువజామున కుప్పకూలిపోయారు.అలాగే జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మంగేళ శివారు గొండుగూడెంకు చెందిన కొమురం సోము (58) ఎండకు తాళలేక మృతిచెందారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్‌తండాకు చెందిన ఉపాధ్యాయుడు లకావత్ రామన్న (45) శుక్రవారం గజ్వేల్‌లో జరిగిన ఎన్నికల శిక్షణకు వెళ్లారు. అక్కడ అస్వస్థతకు గురికావడంతో ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి తీసుకువచ్చారు. కాగా, రాత్రి ఆయన ఆరోగ్య క్షీణించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఉదయం మృతిచెందారు.నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగరాజు (56) మధ్యాహ్నం ఎండకు తాళలేక ఇంటి సమీపంలో కింద పడిపోయారు. ఆయనను 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొల్లాపూర్ మండలంలోనే ముక్కిడిగుండం గ్రామానికి చెందిన శక్రు నాయక్ (80) కొల్లాపూర్ వెళ్లి మధ్యాహ్నం తిరిగి గ్రామానికి చేరుకున్నారు. సాయంత్రం వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రికి తరలించేలోపే మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.మరో ఘటనలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన గొడిశాల దేవయ్య(70) ఎండ తీవ్రతకు మృతిచెందారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో వడ్డె యాదయ్య (72) పత్తికట్టె తొలగించే పనులు చేస్తుండగా సొమ్మసిల్లి మృతి చెందారు. అలాగే గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పక్కన స్పృహ తప్పి పడిపోయిన వర్గల్ మండలం వేలూరుకు చెందిన దార నాగయ్య(45)ను పోలీసులు ప్రభుత్వాసుపత్రిలో చేరి్పంచగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడదెబ్బ కారణంగా శనివారం ఆరుగురు మృతిచెందారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అక్కల్చెడ గ్రామానికి చెందిన ఆకుల భాస్కర్ (25), హరియా తండాకు చెందిన శతాధిక వృద్ధుడు బాదావత్ నర్సింహ(100) ఎండ వేడికి తాళలేక చనిపోయారు. నర్సంపేట మండలం ఇప్పల్‌తండాకు చెందిన అజ్మీర మంగ్యా (45) అనే రైతు ఎండ తీవ్రతకు మృతిచెందారు.ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన వంక లక్షి్మ(67) వడదెబ్బతో తనువు చాలించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాం«దీనగర్‌కు చెందిన ఆవుల కనకయ్య(75) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడేనికి చెందిన మేకల లస్మయ్య (56) అనే రైతు ప్రాణాలు కోల్పోయారు. పనిచేస్తున్న చోటే..కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం జప్తిజాన్కంపల్లి గ్రామంలో భూమిని రాములు (71) ఉపాధిహామీ పనుల్లో భాగంగా పలుగుతో మట్టిని తీస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తోటి కూలీలు ఇచ్చిన సమాచారంతో అక్కడి చేరుకున్న వైద్యులు రాములును పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. వారం రోజులుగా వరుసగా ఉపాధి పనులకు హాజరు కావడంతో రాములుకు వడదెబ్బ తగిలిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన మహిళా కూలీ బోల్లబోయిన వనమాల (45) ధాన్యం ఆరబెట్టేందుకు వెళ్లి వడదెబ్బతో మృతిచెందారు. -
Summer Special: ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగుతున్నారా? జాగ్రత్త!
ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్ లోనుంచి బాటిల్ తీసుకుని చల్లని నీళ్లు గటగటా తాగడం చాలా మందికి అలవాటే. విపరీతమైన వేడిలో మన శరీరానికి రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీరు కొంత ఉపశమనం కలిగించేమాట నిజమే అయినా ఇలా చేయడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగడం వల్ల గొంతు నొప్పి, టాన్సిలైటిస్ సమస్య మాత్రమే కాదు.. జీర్ణక్రియ నుంచి రోగనిరోధక వ్యవస్థ వరకు... చివరకు గుండెపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఎందుకంటే రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీటిని తాగడం వల్ల రక్తనాళాలు కుచించుకుపోతాయి. అదేవిధంగా ఆహారం తిన్న తర్వాత చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఘన ఆహారం సరిగా జీర్ణం కాదు. ఫలితంగా మలబద్ధకం వస్తుంది.అంతేకాదు, చల్లటి నీటిని తాగడం వల్ల ఈ నాడి చల్లబడుతుంది. ఇది హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా తగ్గితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా శరీరంలో వివిధ రకాల సమస్యలు సంభవిస్తాయి. చల్లటి నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు గట్టిపడుతుంది. ఇది బరువు పెరిగేందుకు దారితీస్తుంది.అందువల్ల వీలయినంత వరకు ఎండలో నుంచి రాగానే చల్లటి నీళ్లు తాగకూడదు. అందులోనూ ఫ్రిజ్‌లోని నీళ్లు తాగడం అసలు మంచిది కాదు. కొంచెంసేపు ఆగిన తర్వాత కుండలోని నీళ్లు లేదా నార్మల్ వాటర్ ముందు తాగి, ఆ తర్వాత చల్లటి నీళ్లు తాగినా ఫరవాలేదు.ఇవి చదవండి: Summer Special: పిల్లల్లో... వ్యాధి నిరోధకత పెంచండిలా! -
భయపెడుతున్న ఎండలు: వడదెబ్బతో ఎంత ప్రమాదమో తెలుసా?
ప్రతీచోట 44 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బయటకు వెళ్తే వడదెబ్బ తగలడం ఖాయం. జాగ్రత్తలు పాటించకుండా ఎండలో తిరిగితే శరీర ఉష్ణోగ్రతలు అదుపు తప్పుతాయి. దానిని నియంత్రించే వ్యవస్థ బలహీనపడి వడదెబ్బకు గురవుతారు. ఈ నేపథ్యంలో ఎండలో వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎండదెబ్బ తగలకుండా చూసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ పలు అంశాలు వెల్లడించారు. ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.సాక్షి: ఎండలో వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో వేడిని నియంత్రించే వ్యవస్థ విఫలమవుతుంది. ఎండకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్తే గొడుగు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. టోపీ, తలపాగానైనా తప్పకుండా ధరించాలి.సాక్షి: వడదెబ్బకు గురైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: వడదెబ్బకు గురైన వ్యక్తిని త్వరగా నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి. కొబ్బరినీరు, గ్లూకోజ్, సల్ల, ఓఆర్ఎస్ నీటిని తాగించాలి. ఫ్యాన్ గాలి బాగా తగిలేలా చూడాలి. దుస్తులను వదులుగా చేసి తడిగుడ్డతో ఒళ్లంతా తుడవాలి. మనిషికి తగినంత గాలి ఆడేలా చేయాలి. చుట్టూరా మంది గుమిగూడకూడదు. ఉప్పు కలిపిన ద్రవాలు, ఓఆర్ఎస్ ద్రావణం తాగించాలి. కీరదోస ముక్కలు ఎక్కువగా తినిపించాలి.సాక్షి: వడదెబ్బకు ఎలా గురవుతారు.. లక్షణాలేంటి..?డీఎంహెచ్‌వో: తీవ్రమైన వడగాలులు వీచినప్పుడు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. వడదెబ్బకు గురైన వ్యక్తి నాడి వేగంగా కొట్టుకోవడం, నాలుక ఎండిపోవడం, శరీరంలో నీటిని కోల్పోవడం, తీవ్రమైన తలనొప్పితో అపస్మారక స్థితిలోకి చేరుకుంటారు.సాక్షి: వడదెబ్బకు గురైన వ్యక్తిలో కలిగే మార్పులేంటి.. ఆ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: వేడికి శరీరం ఎక్కువసేపు గురికావడం వల్ల సోడియంక్లోరైడ్, నీటి నిష్పత్తి తగ్గిపోతుంది. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల్లో పనిచేసినప్పుడు ప్రతి గంటకు 3 నుంచి 4 లీటర్ల నీటిని చెమట రూపంలో కోల్పోతుంటారు. ఇలాంటి సమయంలో నీరు బాగా తీసుకోవాలి.సాక్షి: వడదెబ్బ ప్రమాదకరమేనా? అత్యవసర సమయంలో వెళ్లాల్సి వస్తే ఎలా?డీఎంహెచ్‌వో: వడదెబ్బ చాలా ప్రమాదకరం. మెదడులోని ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రం హైపోతలామస్ దెబ్బతిని వడదెబ్బకు గురవుతారు. దీనినే సన్‌స్ట్రోక్, హీట్‌స్ట్రోక్ అంటారు. బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ పడకుండా చూసుకోవాలి. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట తిరగకూడదు.సాక్షి: ప్రథమ చికిత్స ఏంటి? ఎలా ఇవ్వాలి?డీఎంహెచ్‌వో: వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకోవాలి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లను తాగించడంతో పాటు చల్లని ప్రాంతంలో పడుకోబెట్టాలి. ముఖ్యంగా 65ఏళ్లు పైబడిన వారు బయటకు వెళ్లరాదు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పసిపిల్లలు, ఏదైనా అనారోగ్య సమస్యలున్నవారు, ముఖ్యంగా గుండెజబ్బులు, బీపీ ఉన్న వారు వెళ్లవద్దు.సాక్షి: వైద్యశాఖ ఆధ్వర్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?డీఎంహెచ్‌వో: ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కువ సమయం చల్లని ప్రదేశాల్లో ఉండాలి. అంతేకాకుండా ప్రతి ఆరోగ్య కేంద్రంలో వడదెబ్బకు సంబంధించిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. ఆస్పత్రికి వెళ్తే చికిత్స అందిస్తారు. తీవ్రత ఎక్కువగా ఉంటే పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలి.సాక్షి: ఎండలో వెళ్లాల్సి వస్తే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: ముఖ్యంగా ఎండకాలంలో వేడి కలిగించే పదార్థాలు తినకూడదు. కూల్‌డ్రింక్స్ అసలే తాగొద్దు. కూల్‌డ్రింక్స్ ప్రమాదకరం. మజ్జిగ, కొబ్బరినీరు మాత్రమే తీసుకోవాలి. వీలైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగాలి. జీలకర్ర దోరగా వేయించి పొడిగా చేసి అరస్పూన్ పొడిని గ్లాస్ నిమ్మరసంలో కలిపి ఉప్పు, చక్కెర వేసుకుని తాగితే ఎనర్జీగా ఉంటుంది.- పుప్పాల శ్రీధర్, జిల్లా వైద్యాధికారిఇవి చదవండి: Dovely Bike Taxi మహిళల కోసం మహిళలే... హైదరాబాదీ అక్కాచెల్లెళ్లు -
ఈ ఎండల్లో కిడ్నీ ఎమర్జెన్సీల నివారణ ఇలా..!
ఈ ఎండలతో దేహానికి వడదెబ్బ లాంటి ప్రమాదాలు పొంచి ఉన్నట్టే మూత్రపిండాల (కిడ్నీల)కు సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ‘అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ’ (ఏకేఐ), మూత్రవ్యవస్థలో రాళ్లు ఏర్పడే‘యూరో లిథియాసిస్’, కొన్నిరకాల మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు, వడదెబ్బ కారణంగా ఏర్పడే కిడ్నీ సమస్యలు ఇందులో కొన్ని. ఈ మెడికల్ ఎమర్జెన్సీ సమయాల్లో ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలి వంటి వాటి గురించి తెలిపే కథనమిది. ఏప్రిల్ నెల ఇంకా ముగియక ముందే... నమోదవుతున్న ఉష్ణోగ్రతల తీవ్రత 40 డిగ్రీలకు పైమాటే. దాంతో డీహైడ్రేషన్ వల్ల సమస్యలకు గురయ్యే కీలక అవయవాల్లో కిడ్నీలు ముఖ్యమైనవి. కిడ్నీపై దుష్ప్రభావాలిలా... అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ (ఏకేఐ) : దేహంలో నీరు తగ్గినప్పుడు రక్తం చిక్కబడి, రక్తప్రవాహ వేగమూ మందగిస్తుంది. ఫలితంగా అన్ని అవయవాలకు లాగే కిడ్నీకి అందే రక్త పరిమాణం కూడా తగ్గుతుంది. దాంతో దేహంలో పేరుకు పోయే వ్యర్థాలను బయటకు పంపే వేగమూ తగ్గుతుంది. దాంతో కిడ్నీల పనితీరులో ఆకస్మికంగా మార్పులు వచ్చి, అస్తవ్యస్తంగా పని చేస్తాయి. ఈ కండిషన్ పేరే ‘అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ’. దీని దశలు:ఆలిగ్యూరిక్ ఫేజ్: ఈ దశలో యూరిన్ ఔట్పుట్ బాగా తగ్గి, కిడ్నీల్లోని రీనల్ ట్యూబ్యూల్స్ అనే సన్నటి నాళాలు దెబ్బతింటాయి. డైయూరెటిక్ ఫేజ్: ఈ దశలో కిడ్నీ తనను తాను రిపేర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. రికవరీ ఫేజ్: ఒకవేళ తగినన్ని నీళ్లు, ద్రవాహారం అంది రీ–హైడ్రేషన్ జరిగితే...కిడ్నీల పనితీరు మెరుగయ్యే అవకాశం ఉంది. ఏకేఐ లక్షణాలు...► మూత్రం తక్కువగా రావడం.► ఒంట్లో వాపు ► వికారం ∙తీవ్రమైన నిస్సత్తువ, అలసట► శ్వాస వేగంగా తీసుకుంటూ ఉండటం... సరిగా అందకపోవడం. చికిత్స... ఇది పరిస్థితి తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా సెలైన్ పెట్టి, దేహానికి తగినంత రీహైడ్రేషన్ జరిగేలా చూడటం. ∙అవసరాన్ని బట్టి యాంటిబయాటిక్స్ వాడటం. ∙కిడ్నీలు తాత్కాలికంగా పనిచేయక దేహంలో బాగా వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు అవసరాన్ని బట్టి డయాలసిస్ చేయాల్సి రావడం. కిడ్నీలో రాళ్లు (యూరోలిథియాసిస్): మూత్ర వ్యవస్థలో లవణాల స్ఫటికాలతో రాళ్లు ఏర్పడటాన్ని ‘యూరోలిథియాసిస్’ అంటారు. దీన్నే వాడుక భాషలో మూత్రపిండాల్లో రాళ్లు రావడంగా చెబుతారు. తీవ్రమైన నడుము నొప్పి, మూత్రంలో రక్తం వంటి లక్షణాలతో వ్యక్తమయ్యే ఈ సమస్యలో రాళ్లు చిన్నగా ఉంటే మందులతో పాటు, తగినన్ని నీళ్లు, ద్రవాహారం తీసుకోవడం, రాళ్లు ఏర్పడేందుకు అవకాశం ఉండే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలను సూచిస్తారు. రాయి పరిమాణాన్ని బట్టి కొన్ని ప్రక్రియలతో చూర్ణమయ్యేలా చేసి, మూత్రంతో పాటు పోయేలా చూస్తారు. కుదరనప్పుడు శస్త్రచికిత్స చేస్తారు.మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు : వ్యర్థాలు బయటకు పోని సందర్భాల్లో... అవి దేహంలో పేరుకు పోయి, బ్యాక్టీరియా పెరిగిపోయి, మూత్రవ్యవస్థలో ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో మూత్ర విసర్జనలో తీవ్ర ఇబ్బంది, నొప్పి, మూత్రం బొట్లు బొట్లుగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తారు. నివారణ కోసం... ►సాధ్యమైనంతవరకు నీడపట్టునే ఉండటం.►తేలికపాటి రంగులతో కూడిన, గాలి తగిలేలా సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం, ఎండలోకి వెళ్లేటప్పుడు గొడుగు, బ్రిమ్ హ్యాట్, స్కార్ఫ్ వంటివి వాడటం.► తగినన్ని నీళ్లు తాగుతూ, లవణాలు (ఎలక్ట్రోలైట్స్) అందేలా చూసుకోవడం.►డాక్టర్ సూచన లేకుండా డై–యూరెటిక్స్, నొప్పి నివారణ మందుల్ని వాడకపోవడం. ∙ -
వేసవిలో మనుషులకే కాదు.. పశువులకూ ఆ డేంజర్!
వేసవిలో మనుషులే కాదు పశువులూ వడదెబ్బకు గురవుతాయి. నిర్లక్ష్యం చేస్తే పశువులు మరణించే ప్రమాదం ఉంది. వడదెబ్బ నివారణ గురించి పశువైద్యాధికారి సగ్గం మహేశ్ రైతులకు అందిస్తున్న సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే.. ‘ఉష్ణోగ్రత పెరిగి గాలిలో తేమ తగ్గినప్పుడు పశువులు ఎక్కువగా వడదెబ్బకు గురవుతాయి. గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, పశువులు షెడ్లలో ఎక్కువ సంఖ్యలో ఉండటం, నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం, వడగాల్పుల తాకిడికి వడదెబ్బకు గురవుతాయి. తెల్లజాతి కంటె నల్లజాతి పశువులు ఎక్కువగా వడదెబ్బబారిన పడతాయి.’ వడదెబ్బ ప్రాణాంతకమే.. వేసవి కాలంలో బయటి ఉష్ణోగ్రత పశువుల శరీర ఉష్ణోగ్రత కన్నా ఎక్కువైనప్పుడు మెదడులోని హైపోథాలమస్ స్వేద గ్రంథులపై నియంత్రణ కోల్పోతుంది. దీంతో చర్మంపై గల స్వేద రంధ్రాలు చెమటను అధికంగా విడుదల చేసి శరీరంలోని ఎలక్ట్రోలైట్లను కోల్పోయి శరీర పక్రియ మందగిస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శ్వాస, గుండె, నాడి వేగం పెరుగుతాయి. మూత్ర పిండాలు సరిగా పనిచేయకపోవడంతో మూత్ర విసర్జన కుంటు పడుతుంది. పశువుల ఆరోగ్య పరిస్థితి విషమించి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాయి. శ్వాస ఆడక మరణిస్తాయి. నివారణకు ముందస్తు చర్యలు.. వేసవిలో ముఖ్యంగా పశువులను పగటి వేళలో మేతకు వదలరాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు పంపాలి. తాగునీరు అన్నివేళలా అందుబాటులో ఉంచాలి. పశువులను రోజుకు కనీసం రెండుసార్లు చల్లని నీళ్లతో కడగాలి. చెరువులు, కుంటల్లో ఈద నివ్వాలి. గాలి వెలుతురు ప్రసారమయ్యేలా ఎత్తయిన కొట్టాలను గడ్డితో నిర్మించాలి. రేకులు ఉంటే మధ్యాహ్నం వేళల్లో వరిగడ్డి పరిచి నీరు చల్లాలి. వేసవిలో దాహంతో ఉన్న పశువులు కలుషిత నీరు తాగకుండా జాగ్రత్త వహించాలి. షెడ్డుపై వరిగడ్డివేసి మధ్యాహ్నం వేళ్లలో నీరివ్వాలి. షెడ్ల నిర్మాణం తూర్పు, పడమర దిశలలోనే జరగాలి. దీనివల్ల వడ గాల్పుల నుంచి, తూర్పు, పడమర ఎండల నుంచి రక్షణ లభిస్తుంది. పాడి గేదెలకు ఉదయం, సాయంత్రం పాలు పితికేటప్పుడు పొదుగును చల్లని నీటిలో కడగాలి. పశువులకు గోమార్లు లేకుండా చూసుకోవాలి. పరిశుభ్రమైన నీరు ఎల్లవేళలో అందుబాటులో ఉంచాలి. వడదెబ్బ లక్షణాలు.. వడదెబ్బ తగిలిన పశువుల శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీల ఫారన్ హీట్ కన్నా ఎక్కువగా ఉంటుంది. చర్మ సున్నితత్వం కోల్పోయి గట్టిపడుతుంది. పశువులు సరిగ్గా నడవలేక తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి. నీడ కోసం చెట్ల కిందకు చేరుతాయి. అధిక దాహం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత 104 ఫారన్‌హీట్ దాటితే శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఫిట్స్ లక్షణాలతో క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 109 డిగ్రీలు దాటితే ప్రాణపాయం సంభవిస్తుంది. వడదెబ్బ ప్రభావంతో చూలు పశువుల్లో గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది. పశువుల్లో పునురుత్పత్తి ప్రక్రి య కుంటుపడుతుంది. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. చికిత్స ఇలా.. వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రాంతానికి మార్చాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి తీసుకరావడానికి పలుమార్లు కడగాలి. తాగు నీటిని అందుబాటులో ఉంచాలి. వెంటనే పశువైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. వైద్యుల పర్యవేక్షణలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఇంజెక్షన్లు వేయించాలి. రక్తంలోకి సైలెన్ ద్వారా గ్లూకోజు, ఎలక్ట్రోలైట్స్ అందిస్తే నీరసం నుంచి పశువులు బయటపడతాయి. - సగ్గం మహేశ్, పశువైద్యాధికారి -
TS: రెండ్రోజులు సాధారణ ఉష్ణోగ్రతలే
సాక్షి, హైదరాబాద్: తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో తూర్పు, దక్షిణ ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నల్లగొండ జిల్లా దామెరచర్లలో 45.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 42.5 డిగ్రీల చొప్పున నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 25.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. రాష్ట్రానికి వాయవ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వడదెబ్బకు ముగ్గురు మృతి.. అశ్వారావుపేట రూరల్: ఒకే గ్రామ పరిధిలో వడదెబ్బకు గురై ముగ్గురు వ్యక్తులు శుక్రవారం మృతి చెందారు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం కాలనీ గ్రామానికి చెందిన అచ్చె రామారావు (75) ఎండవేడితో తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబసభ్యులు ఆస్పత్రి తీసుకెళ్లేలోగానే మృతి చెందాడు. వినాయకపురం గ్రామానికి చెందిన బేతం చిన్ని (58), తన్నీరు మనోహర్ (48) కూడా వడదెబ్బతో మృతి చెందారు. -
‘ఫొటో సెన్సిటివిటీ’ ఉన్నవారికి ఎండాకాలంలో కష్టమే.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే..
ఎండలోకి వెళ్లినప్పుడు కొందరిలో ముఖం, మెడ భాగాలు ఎర్రగా మారుతుంటాయి. అప్పుడప్పుడు ఈ ఎర్రమచ్చల్లో కాస్త దురద కూడా రావచ్చు. ఎండకు ఏమాత్రం తట్టుకోలేని ‘ఫొటో సెన్సిటివిటీ’ ఉన్నవారిలో... ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలా ఎర్రబారడం, ఎర్రమచ్చలు రావడాన్ని ‘సన్‌బర్న్స్’గా చెప్పవచ్చు. ఫెయిర్ స్కిన్ ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ‘సన్‌బర్న్స్’ నివారణ కోసం కొన్ని సూచనలివే... ► బాగా ఎండలోకి వెళ్లే ముందు 50 ప్లస్ ఎస్పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్ రాసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం రాసుకోవడమే కాకుండా... బయటకు వెళ్లాక ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్ క్రీమ్ రాసుకోవడం రిపీట్ చేస్తుండాలి. ► అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. అందులో ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు ఎక్కువగా వాడాలి. అలాగే క్యారట్, క్యాప్సికప్ (పసుపు పచ్చరంగులో ఉండేవి) ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మంచి రంగు ఉండే తాజా పండ్లు ఎక్కువగా తినాలి. ► ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి ఆయన సలహా మేరకు యాంటీ ఆక్సిడెంట్స్ ట్యాబ్లెట్లను ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తీసుకోవచ్చు. ఇలా కనీసం మూడు నెలల పాటు వాడాలి. (చదవండి: అందరి తీర్పూ ఆమె ఉద్యోగంపైనే!) ► రోజూ కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల మన ప్రతి కణం పునరుత్తేజం పొందుతుంది. దాంతో ఈ సమస్యతో పాటు అన్నిరకాల ఆరోగ్యసమస్యల నుంచి నివారణ పొందవచ్చు. ► సమస్య తీవ్రంగా ఉన్నవారు ఆ ఎర్రమచ్చల మీద డాక్టర్ సలహా మేరకు ‘డెసోనైడ్’ అనే మైల్డ్ స్టెరాయిడ్ ఉన్న క్రీము ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పదిరోజుల పాటు రాయాలి. ► ఈ సూచనలు పాటించాక కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఒకసారి డర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. (చదవండి: మీ కోసం 'వెదురు' చూసే బొమ్మలం!) -
అమ్మో ఎండలు: ఈ ఐడియా అదుర్స్..
సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ: ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనం భయపడి పోతున్నారు. ఎండకు ఒక్క నిమిషం కూడా రోడ్డుపై నిలబడే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో విజయవాడ వన్‌టౌన్ తారాపేటలో వ్యాపారస్తులు ఓ వినూత్న ఆలోచన చేశారు. ఆయా దుకాణాలకు వచ్చే వినియోగదారులకు ఎండ బారి నుంచి తప్పించేందుకు గ్రీన్ షేడ్ పందిళ్లను ఏర్పాటు చేశారు. దీంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మాటేసి ఉన్నాం.. మాస్క్ లేకుండా వచ్చారో జాగ్రత్త’’ మహమ్మారికి ‘మాస్క్’ దెబ్బ -
ప్రారంభమైన కాసేపటికే... సన్‌బర్న్ పార్టీలో వెపన్ కలకలం..
-
ప్రారంభమైన కాసేపటికే... సన్‌బర్న్ పార్టీలో వెపన్ కలకలం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో సన్‌బర్న్ పార్టీ ప్రారంభమైంది. హైదరాబాద్‌లో తొలిసారి జరుగుతున్న ఈ పార్టీకి యువత పెద్దసంఖ్యలో హాజరయ్యారు. 17 ఏళ్ల లోపు బాలలను ఈ పార్టీకి అనుమతించకూడదని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పోలీసుల నిఘా నడుమ పార్టీ కొనసాగుతోంది. అయితే, సన్‌బర్న్ పార్టీ ప్రారంభమైన కాసేపటికే కలకలం రేగింది. ఓ యువకుడు ఆయుధంతో సన్‌బర్న్ పార్టీ వేదిక వద్ద దొరికిపోయాడు. ఓ వ్యక్తి తుపాకీతో పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే, ప్రవేశద్వారం వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు అతని వద్ద తుపాకీ ఉన్న విషయాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తుపాకీ తీసుకొని వచ్చిన ఆ వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ‘సన్‌బర్న్’ వద్ద మైనర్లు.. సన్ బర్న్ ఈవెంట్ వద్ద మైనర్లకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. హైకోర్టు తీర్పు మేరకు మైనర్లను వెనక్కి పంపిస్తున్నారు. దీంతో కొందరు మైనర్లు ఆందోళన చేపట్టారు. అనుమతి ఇవ్వనప్పుడు ఎందుకు ముందుగా టిక్కెట్లు విక్రయించారని అధికారులను నిలదీస్తున్నారు. వారికి వారి తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులను భారీగా మోహరించారు. హైకోర్టు ఆదేశాలు.. సన్‌బర్న్ పార్టీకి హైకోర్టు మధ్యాహ్నం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. సన్‌బర్న్ పార్టీ మొత్తాన్ని రికార్డు చేయాలని ఎక్సైజ్ , లాండ్ ఆర్డర్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబరు 30 లోగా వీడియో రికార్డులను సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణ 30 కి వాయిదా వేసింది. నగరంలో శుక్రవారం నిర్వహించనున్న సన్ బర్న్ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల యువత డ్రగ్స్, మద్యానికి బానిసలవుతున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. మద్యం సరఫరా చేసే కార్యక్రమానికి మైనర్లను అనుమతించడం చట్ట విరుద్ధమన్నారు. స్టేడియం వద్ద భారీగా బందోబస్తు గచ్చిబౌలి స్టేడియం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటలకు సన్‌బర్న్ ఈవెంట్ షో జరుగుతుంది. అయితే ఈ ఈవెంట్ షోను అడ్డుకుంటారనే వార్తలు వస్తున్న నేపధ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకుంటున్నారు. దీంత్ అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఈవెంట్ షోకు అనుమతినివ్వడం పట్ల ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. క్రీడల కోసం ఏర్పాటు చేసిన స్టేడియంను తాగి ఊగడానికి ఇస్తారా అంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. -
'సన్‌బర్న్' పై హైకోర్టులో పిటిషన్
-
'సన్‌బర్న్'కు అనుమతి.. స్టేడియం వద్ద టెన్షన్
సాక్షి, హైదరాబాద్: నగరంలో నిర్వహించనున్న సన్‌బర్న్ పార్టీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సన్‌బర్న్ పార్టీ మొత్తాన్ని రికార్డు చేయాలని ఎక్సైజ్ , లాండ్ ఆర్డర్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబరు 30 లోగా వీడియో రికార్డులను సమర్పించాలని కోర్టు పేర్కొంది. అనంతరం తదుపరి విచారణ 30 కి వాయిదా వేసింది.నగరంలో శుక్రవారం నిర్వహించనున్న సన్ బర్న్ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల యువత డ్రగ్స్, మద్యానికి బానిసలవుతున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. మద్యం సరఫరా చేసే కార్యక్రమానికి మైనర్లను అనుమతించడం చట్ట విరుద్దమన్నారు. సన్ బర్న్‌పై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. వాడివేడిగా వాదనలు సన్‌బర్న్ ఈవెంట్‌కు అనుమతివ్వడంపై దాఖలైన పిటిషన్‌కు శుక్రవారం మధ్యాహ్నం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఈ ఈవెంట్లో మైనర్ల ప్రవేశానికి అనుమతి ఇవ్వటంపై పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. అయితే, సన్‌బర్న్ ఈవెంట్‌కు షరతులతో కూడిన అనుమతులిచ్చామని ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదించారు. ఆ షరతులతో కూడిన అనుమతి పత్రం చూపించాలని న్యాయమూర్తి కోరగా ప్రభుత్వ న్యాయవాది చూపించలేకపోయారు. మైనర్లకు ఎంట్రీ టికెట్లు విక్రయించి ఈవెంట్‌కు రాకుండా ఎలా ఆపుతారని ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి వాదనలు వినిపించేందుకు మధ్యాహ్నం రెండున్నరకు వాయిదా వేసింది. స్టేడియం వద్ద భారీగా బందోబస్తు గచ్చిబౌలి స్టేడియం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటలకు సన్‌బర్న్ ఈవెంట్ షో జరగనుంది. అయితే ఈ ఈవెంట్ షోను అడ్డుకుంటారనే వార్తలు వస్తున్న నేపధ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకుంటున్నారు. దీంత్ అక్క బ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఈవెంట్ షోకు అనుమతినివ్వడం పట్ల ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. క్రీడల కోసం ఏర్పాటు చేసిన స్టేడియంను తాగి ఊగడానికి ఇస్తారా అంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఈవెంట్ షోను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు మందుస్తు చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున మోహరిస్తున్నారు. -
ముసుగు మ్యూజిక్.. హౌస్ ఫుల్..
సాక్షి,వీకెండ్: ‘ముసుగు వేయొద్దు మనసు మీద...’ అంటూ ఓ తెలుగు సినీ రచయిత చెబితే... ‘ముసుగు వేస్తాను ముఖం మీద..’ అంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు మార్ష్ మెల్లో. యూరోపియన్ డీజే మార్‌్షమెల్లో ముసుగు వీరుడు. ఇప్పటిదాకా మాస్క్ తీయకుండా ప్లే చేసిన ఈ డీజే ఎవరు? ఎలా ఉంటాడనేది ఫుల్ సస్పెన్స్. నగరంలో నిర్వహించనున్న సన్‌బర్న్ 10వ ఎడిషన్ ఈవెంట్ ఈసారి మోసుకొస్తున్న సంచలనం ఇది. – ఎస్.సత్యబాబు అత్యంత భారీ మ్యూజికల్ ఈవెంట్‌గా ప్రసిద్ధి చెందిన సన్‌బర్న్ మరోసారి నగరంలో సందడి చేయనుంది. ఎప్పుడూ సిటీలోని పార్టీ ప్రియుల మధ్య టాక్ ఆఫ్ ది టౌన్‌గా ఉండే సన్‌బర్న్ ఈ సారి కూడా తన దైన శైలిలో ఆసక్తి రేపుతోంది. మాదాపూర్ హైటెక్స్‌లో శనివారం నిర్వహించనున్న ఈ ఈవెంట్లో మంత్రముగ్ధుల్ని చేసే ఎస్ఎఫ్ఎక్స్ ఒక స్పెషల్. డీజేల ధమాకా.. మాస్క్‌మ్యాన్ తడాఖా ప్రపంచ ప్రసిద్ధ డీజే ద్వయం డీవీఎల్‌ఎం ఈ ఈవెంట్లో పాల్గొననుండడం విశేషం. తొలిసారి నగరానికి వస్తున్న ఈ బెల్జియానికు చెందిన ఇద్దరు డీజేలు డిమిత్రి వెగాస్, లైక్మైక్లకు ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్కు సంబంధించి ట్రాక్స్‌ను కదం తొక్కించడంలో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. వీరిద్దరు మాత్రమే కాకుండా మాస్క్ వేసుకొని మ్యూజిక్ ప్లే చేసే డీజే మార్‌్షమెల్లో సైతం సిటీకి వస్తుండడం మరో విశేషం. ఇప్పటిదాకా అతనెలా ఉంటాడనేది? ఎవరికీ తెలీదు. అదొక మిస్టరీ. యూరోపియన్ డీజేలలోనే లేటెస్ట్ సెన్సేషన్‌గా మారిన మార్‌్షమెల్లో ఇండియాకి రావడం ఇదే మొదటిసారి. పూర్తిగా తల భాగాన్ని కవర్ చేస్తూ ఆయన ధరించే హెడ్ కవరింగ్ యాక్ససరీని మార్‌్షమెల్లో హెల్మెట్ అంటారు. గతేడాది ఆన్లైన్ ద్వారా మ్యూజిక్ ట్రాక్స్ విడుదల చేస్తూ బాగా పాపులరైన మార్‌్షమెల్లో... ‘జెడ్స్ బ్యూటీఫుల్ నవ్, జాక్ యూస్ వేర్ ఆర్ యూ నవ్’ లాంటి ట్రాక్స్‌ను రీమిక్స్ చేయడం ద్వారా యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బుకింగ్స్ ఫుల్... సన్‌బర్న్ అంటేనే డీజే మ్యూజిక్. ఈసారి వెరైటీ డీజేలను సమర్పిస్తున్న సన్‌బర్న్ పార్టీ సంగీత ప్రియులను సంపూర్ణంగా అలరించనుందని, శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్ రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుందని ఈవెంట్ నిర్వాహక సంస్థ ఓలా ప్రతినిధి విజయ్ అమృత్‌రాజ్ చెప్పారు. ఈ ఈవెంట్‌కు కనీసం 8 నుంచి 10 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు.